Ad Code

గుండె వేగంగా కొట్టుకుంటుందా ?


మానవుని శరీరంలో గుండె చాలా ముఖ్యమైన అవయవం. ఇది రక్తాన్ని శరీరంలోని అన్ని భాగాలకు సరఫరా చేస్తుంది. కనుక ఇది నిరంతరం పనిచేయాల్సి ఉంటుంది. గుండె కొట్టుకుంటుంటే రక్తం పంప్ అవుతుంటుంది. ఇక ఒక వ్యక్తి గుండె కొట్టుకునే రేటు సహజంగానే నిమిషానికి 60 నుంచి 100 వరకు ఉంటుంది. కానీ కొందరి గుండె ఎప్పుడూ వేగంగానే కొట్టుకుంటుంది. మనిషి గుండె నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకోవడం సహజమే. కానీ 100 కన్నా ఎక్కువ సార్లు ఎల్లప్పుడూ కొట్టుకుంటూ ఉంటే అది మంచిది కాదు. ఏదో అనారోగ్య సమస్య ఉన్నట్లు భావించాలి. వైద్య పరిభాషలో దీన్నే టాకీకార్డియా అంటారు. భయం కలిగినప్పుడు, ఒత్తిడికి గురైనప్పుడు, శారీరక శ్రమ చేసినప్పుడు, వ్యాయామం చేసిన సమయంలో, పరుగెత్తినా.. నడిచినా.. కొండ ప్రాంతం, మెట్లు ఎక్కినా.. గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. ఇలాంటి సమయాల్లో సహజంగానే గుండె కొట్టుకునే వేగం ఎక్కువగా ఉంటుంది కనుక కంగారు పడాల్సిన పనిలేదు. కానీ ఎల్లప్పుడూ గుండె వేగంగానే కొట్టుకుంటుంటే.. అంటే.. 100 సార్లకు పైగా నిమిషానికి కొట్టుకుంటుంటే.. అప్పుడు మీకు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్లు భావించాలి. దీంతో వెంటనే అలర్ట్ అయి డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకోవాలి. దీంతో సమస్య ఉంటే వెంటనే తెలుసుకుని ముందుగానే ప్రమాదాన్ని గుర్తించి నివారించవచ్చు. లేదంటే గుండెకు ముప్పు ఏర్పడుతుంది. శరీరంలో షుగర్ లెవల్స్ మరీ తక్కువగా ఉన్నప్పుడు, లో బీపీ ఉన్నప్పుడు, జ్వరం, రక్తహీనత, డీహైడ్రేషన్ ఏర్పడినప్పుడు, గర్భిణీలకు లేదా మహిళలకు నెలసరి సమయంలో, మద్యం సేవించడం వల్ల, టీ, కాఫీలను లేదా పొగ ఎక్కువగా తాగడం వల్ల, డ్రగ్స్ వాడకం, ఇతర మందుల వాడకం వల్ల గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. గుండె కొట్టుకునే వేగం పెరిగి అలాగే కొన్ని రోజుల తరబడి ఉంటే.. దాన్ని నిర్లక్ష్యం చేస్తే అది హార్ట్ ఫెయిల్యూర్‌కు దారి తీయవచ్చు. లేదా హార్ట్ ఎటాక్‌, కొరొనరీ ఆర్టరీ డిసీజ్‌, ఆట్రియల్ ఫైబ్రిలేషన్ వంటి సమస్యలు రావచ్చు. ఈ క్రమంలోనే గుండె ఎల్లప్పుడూ వేగంగా కొట్టుకునే వారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలవడం ఉత్తమం.

Post a Comment

0 Comments

Close Menu