Ad Code

భూటాన్ మార్కెట్లో టాటా కార్లు


దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న తమ ప్యాసింజర్ రేంజ్ కార్లను ఇప్పుడు పొరుగుదేశమైన భూటాన్ మార్కెట్లో కూడా విడుదల చేసింది. ఈ మేరకు భూటాన్ దేశంలో టాటా ప్యాసింజర్ వాహనాల ఏకైక అధీకృత పంపిణీదారుగా ఉన్న సామ్‌డెన్ వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో టాటా మోటార్స్ చేతులు కలిపింది. టాటా నేపాల్‌లో టియాగో, టిగోర్, నెక్సన్, ఆల్ట్రోజ్, హారియర్ మరియు సఫారీలతో సహా పూర్తి రేంజ్ టాటా కార్లను పరిచయం చేసింది. భూటాన్ లో విడుదలైన అన్ని టాటా కార్లు కూడా BS6 నిబంధనలకు లోబడి ఉంటాయి మరియు కంపెనీ యొక్క పాపులర్ 'ఇంపాక్ట్ 2.0' డిజైన్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి తయారు చేయబడ్డాయి. అక్కడి మార్కెట్లో టాటా టియాగో ప్రారంభ ధర రూ. 7.34 లక్షల భూటానీస్ ఎన్‌యూలు కాగా, టాటా టిగోర్  ధర రూ. 7.99 లక్షల ఎన్‌యూలుగా ఉంది. టాటా నెక్సాన్  కాంపాక్ట్ ఎస్‌యూవీ మరియు టాటా ఆల్ట్రోజ్ ​​హ్యాచ్‌బ్యాక్ కార్ల ధరలు వరుసగా రూ. 10.55 లక్షల ఎన్‌యూలు మరియు రూ. 8.95 లక్షల ఎన్‌యూలుగా ఉన్నాయి. ఇకపోతే, మిడ్-సైజ్ ఎస్‌యూవీని అయిన టాటా హారియర్  ధర రూ. 18.38 లక్షల ఎన్‌యూలు మరియు కంపెనీ యొక్క ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ టాటా సఫారీ ధర రూ. 24.42 లక్షల ఎన్‌యూలుగా ఉన్నాయి.

Post a Comment

0 Comments

Close Menu