Ad Code

హోండా CB300R బైక్ లాంచ్​!


ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్​ సైకిల్ అండ్​ స్కూటర్ ఇండియా (హెచ్​ఎంఎస్​ఐ) బుధవారం మార్కెట్​లోకి మరో కొత్త బైక్​ను లాంచ్​ చేసింది. 2019లో విడుదలైన హోండా సీబీ300ఆర్ బైక్​కు మార్పులు చేర్పులు చేసి మరోసారి దీన్ని ఆవిష్కరించింది. ఈ సరికొత్త హోండా CB300R బైక్​ రూ. 2.77 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధర వద్ద అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే భారతదేశం అంతటా బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. హోండా ప్రీమియం బిగ్‌వింగ్, బిగ్‌వింగ్ టాప్‌లైన్ డీలర్‌షిప్‌ సెంటర్ల ద్వారా దీన్ని బుక్​ చేసుకోవచ్చు. ఇక, హైఎండ్​ ఫీచర్లతో వచ్చిన ఈ బైక్​ డెలివరీలు అతి త్వరలోనే ప్రారంభం కానున్నాయి. కాగా, ఈ బైక్​ మొత్తం రెండు కలర్​ ఆప్షన్లలో లభిస్తుంది. మ్యాటీ స్టీల్​ బ్లాక్​, పెరల్​ స్పార్టన్​ రెడ్​ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఈ బైక్​ లాంచింగ్​పై  మేనేజింగ్ డైరెక్టర్, ప్రెసిడెంట్ & సీఈఓ అట్సుషి ఒగాటా మాట్లాడుతూ ''విలక్షణమైన హై ఎండ్​ ఫీచర్లు, డైనమిక్ రోడ్ ప్రెజెన్స్‌తో కొత్త CB300R బైక్​ను ఆవిష్కరించాం. కస్టమర్ల నుంచి మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నాం.'' అని చెప్పారు. కొత్త హోండా CB300R బైక్​ బీఎస్​ 6 ప్రమాణాలతో రూపొందింది. ఇంజిన్​ విషయానికి వస్తే.. దీనిలో 286 సీసీ 4 సింగిల్ సిలిండర్ వాల్వ్ లిక్విడ్ కూల్డ్ మోటార్​ను అమర్చారు. పవర్​, టార్క్​ అవుట్​పుట్​లో ఎక్కడా రాజీపడకుండా 30.7 హెచ్​పీ పవర్​, 27.5 ఎన్​ఎమ్​ గరిష్ట టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6 స్పీడ్​ ట్రాన్స్​మిషన్​తో స్లిప్​, అసిస్ట్​ క్లచ్​తో జతచేసి ఉంటుంది. సాధారణ క్లచ్ మెకానిజంతో పోలిస్తే మెరుగైన ఫంక్షన్‌ను అందిస్తుంది. సడన్ ఇంజన్ బ్రేకింగ్ వల్ల కలిగే కుదుపులను తగ్గిస్తుంది. తద్వారా బైక్​పై సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu