Ad Code

రూ.10 వేలలోనే నోకియా జీ11


నోకియా జీ11 స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఏకంగా మూడు రోజుల బ్యాటరీ లైఫ్‌ను అందించగలదని కంపెనీ తెలిపింది. గతేడాది ఏప్రిల్‌లో లాంచ్ అయిన నోకియా జీ10కు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ అయింది. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. 90 హెర్ట్జ్ డిస్‌ప్లేను కూడా ఇందులో అందించారు. వాటర్ డ్రాప్ నాచ్ తరహా డిస్‌ప్లే ఇందులో ఉంది. ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను 499 ఆస్ట్రేలియన్ డాలర్లుగా (సుమారు రూ.10,200) నిర్ణయించారు. చార్‌కోల్, ఐస్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. దుబాయ్, యూకే మార్కెట్లలో మార్చి నుంచి ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గానూ, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గానూ ఉంది. యూనిసోక్ టీ606 ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. 3 జీబీ ర్యామ్‌ను ఇందులో అందించారు. కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. దీంతోపాటు ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 4జీ ఎల్టీఈ, వైఫై, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎఫ్ఎం రేడియో, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఇందులో ఉన్నాయి. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్లు ఇందులో అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5050 ఎంఏహెచ్‌గా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ మందం 0.85 సెంటీమీటర్లు కాగా... బరువు 189 గ్రాములుగా ఉంది.

Post a Comment

0 Comments

Close Menu