Header Ads Widget

షావోమీ 11 లైట్ ఎన్ఈ 5జీపై రూ.7,000 తగ్గింపు!


అమెజాన్‌లో ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్ ఇంకొన్ని గంటల్లో ముగుస్తుంది. షావోమీ గతేడాది రిలీజ్ చేసిన షావోమీ 11 లైట్ ఎన్ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై భారీగా డిస్కౌంట్ లభిస్తోంది. ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్స్‌తో కలిపి ఏకంగా రూ.7,000 వరకు తగ్గింపు పొందొచ్చు. షావోమీ 11 లైట్ ఎన్ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ రూ.25,000 లోపు సెగ్మెంట్లో రిలీజైంది. ఇప్పుడు రూ.20,000 లోపే కొనొచ్చు. ధర చూస్తే 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.28,999. ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.5,000 ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్ కూడా కలిపి రూ.7,000 డిస్కౌంట్ పొందొచ్చు. ఈ ఆఫర్‌తో బేస్ వేరియంట్‌ను రూ.19,999 ధరకే కొనొచ్చు. బ్యాంక్ ఆఫర్స్ చూస్తే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులపై రూ.3,500, కొటక్ బ్యాంక్ కార్డులపై రూ.4,500, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులతో కొంటే 10 శాతం, స్టాండర్డ్ ఛార్టర్డ్ క్రెడిట్ కార్డుపై 7.5 శాతం, హెచ్ఎస్‌బీసీ క్రెడిట్ కార్డుపై 7.5 శాతం, హెచ్ఎస్‌బీసీ క్యాష్‌బ్యాక్ కార్డుపై 5 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేసేవారికి రూ.20,250 వరకు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. ఒకవేళ స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేసేవారికి రూ.20,250 వరకు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ వర్తిస్తే కేవలం రూ.6,749 చెల్లించి షావోమీ 11 లైట్ ఎన్ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఎక్స్‌ఛేంజ్ వ్యాల్యూ అంతకన్నా తక్కువ వస్తే కస్టమర్లు మిగతా మొత్తాన్ని చెల్లించాలి. ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.55 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది ఇటీవల పాపులర్ అయిన ప్రాసెసర్. ఇదే ప్రాసెసర్ సాంసంగ్ గెలాక్సీ ఎం52 5జీ, రియల్‌మీ జీటీ మాస్టర్ ఎడిషన్, ఐకూ జెడ్5 5జీ, మోటోరోలా ఎడ్జ్ 20 స్మార్ట్‌ఫోన్లలో కూడా ఉంది. 

Post a Comment

0 Comments