Header Ads Widget

14న పీఎస్ఎల్వీ సీ-52 ప్రయోగం


ఈ ఏడాది తొలి దశ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. పీఎస్ఎల్వీ సీ-52 రాకెట్ ప్రయోగాన్ని చేపట్టబోతోంది. ఈనెల 14న ఉదయం 5 గంటల 59 నిమిషాలకు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి రాకెట్‌ను ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. లాంచ్ ఆథరైజ్డ్ బోర్డు నుంచి అనుమతి రాగానే ఇస్రో టీం పిఎస్ఎల్వి-సి 52ను అంతరిక్షంలోకి పంపనుంది. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఫస్ట్ లాంచ్ ప్యాడ్ నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ-52 ప్రయోగం జరుగనుంది. ఈనెల 13న ఉదయం 4 గంటల 29 నిమిషాలకు కౌంట్‌డౌన్ ప్రారంభమవుతుంది. 25 గంటల 30 నిమిషాల పాటు కౌంట్‌డౌన్‌ కొనసాగిన తర్వాత వాహననౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. ఐఆర్‌శాట్-1-ఏతో పాటు ఐఎన్‌ఎస్‌-2-టి.డి, విద్యార్థులు రూపకల్పన చేసిన ఇన్‌స్పైర్‌శాట్-1 ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ సీ-52 మోసుకెళ్లనుంది. పిఎస్ఎల్వి- సి 52 ప్రయోగం ద్వారా 1710 కిలోగ్రాముల బరువున్న ఈఓఎస్-04 శాటిలైట్ తో పాటు మరో రెండు శాలిలైట్లను పీఎస్ఎల్వీ తనతో పాటు నింగిలోకి తీసుకెళ్లనుంది. ఈఓఎస్-04 శాటిలైట్ ను 529 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయం, అడవులు, ప్లాంటేషన్స్, నేలలో తేమ, హైడ్రాలజీ, వరదల మ్యాపింగ్‌లకు సంబంధించి ఈ శాటిలైట్ హై క్వాలిటీ ఇమేజెస్‌ను తీసి పంపిస్తుంది. ఇందులో మరో రెండు చిన్న నానో శాటిలైట్లను సిద్దం చేశారు. ఇందులో ఒకటి ఇన్స్పైర్ శాట్-1. దీన్ని యూనివర్శిటీ ఆఫ్ కొలరాడోకు చెందిన లేబొరేటరీ ఆఫ్ అట్మాస్పియరిక్ అండ్ స్పేస్ ఫిజిక్స్ తో కలిసి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ తయారు చేసింది. రెండో చిన్న శాటిలైట్ పేరు ఐఎన్ఎస్-2టీడీ. ఇది ఇండియా-భూటాన్ జాయింట్ శాటిలైట్. పీఎస్ఎల్వీ సీ-51 ప్రయోగానికి లాంచ్ అథరైజేషన్ బోర్డ్ అప్రూవల్ రావాల్సి ఉంది. అది వచ్చిన వెంటనే 25 గంటల కౌంట్‌డౌన్ ప్రారంభమవుతుంది. పీఎస్ఎల్వీ ప్రయోగం కోసం శ్రీహరికోటలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Post a Comment

0 Comments