గెలాక్సీ ఎస్22 సిరీస్‌ల లక్ష ప్రీ-బుకింగ్‌లు


ఇండియాలో Galaxy S22 సిరీస్ ప్రీ-బుకింగ్‌లు ఫిబ్రవరి 23న ప్రారంభమైయి, ఇప్పటివరకు లక్ష ప్రీ-బుకింగ్‌లు వచ్చాయని కంపెనీ తెలిపింది. “Galaxy S22 సిరీస్‌కి కస్టమర్‌ల నుండి ఇంత అద్భుతమైన స్పందన లభించినందుకు మేము నిజంగా సంతోషిస్తున్నాము” అని శామ్‌సంగ్ ఇండియా సీనియర్ డైరెక్టర్, ప్రొడక్ట్ మార్కెటింగ్ హెడ్ ఆదిత్య బబ్బర్ ఒక ప్రకటనలో తెలిపారు. కస్టమర్‌లకు స్మార్ట్ ఫోన్‌ను వీలైనంత త్వరగా అందించేందుకు దృఢంగా కట్టుబడి ఉన్నామని బబ్బర్ తెలిపారు. Galaxy S22 Ultraని ప్రీ-బుకింగ్ చేసే కస్టమర్‌లు రూ.26,999 విలువైన Galaxy Watch4ని కేవలం రూ.2,999కే పొందవచ్చు. Galaxy S22+, Galaxy S22 ప్రీ-బుకింగ్ కస్టమర్‌లు రూ. 11,999 విలువైన Galaxy Buds 2 రూ. 999 కి పొందుతారు. Galaxy S22 Ultra, Galaxy S22+, Galaxy S22ని రిటైల్ అవుట్‌లెట్‌లు, Samsung ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌లు, Samsung ఆన్‌లైన్ స్టోర్, Amazon.inలో ఫిబ్రవరి 23 నుండి మార్చి 10 వరకు ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. Galaxy S22 సిరీస్ మార్చి 11 నుంచి అమ్మకానికి ఉంటుంది. Samsung Galaxy S22.. 8GB RAM+256GB స్టోరేజ్ ధర రూ.72,999. 8GB+256GB మోడల్ ధర రూ.76,999. Galaxy S22+.. 8GB+128GB మోడల్‌కు రూ. 84,999. 8GB+256GB రూ. 88,999. Samsung Galaxy S22 Ultra 12GB+256GB రూ. 1,09,999. టాప్-ఆఫ్-ది-లైన్ 12GB+512GB మోడల్ ధర రూ.1,18,999.

Post a Comment

0 Comments