Ad Code

గెలాక్సీ ఎస్‌22 ప్రీ బుకింగ్స్ ప్రారంభం

  



సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్‌22 సిరీస్‌ ప్రీబుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. గెలాక్సీ అక్‌ప్యాక్డ్ 2022 ఈవెంట్‌లో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్‌22 సిరీస్‌ను లాంచ్ చేసింది. గెలాక్సీ ఎస్‌22 సిరీస్‌లో భాగంగా సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్‌22, గెలాక్సీ ఎస్‌22 ప్లస్‌, గెలాక్సీ ఎస్‌22 అల్ట్రా స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. గెలాక్సీ ఎస్‌21 సిరీస్‌కు కొనసాగింపుగా లాంచ్ అయిన సిరీస్ ఇది. గత సంవత్సరం గెలాక్సీ ఎస్‌21 ను సామ్‌సంగ్ రిలీజ్ చేసింది. ఇందులో ఎస్‌22 అల్ట్రా ఫోన్‌ను ఎస్ పెన్ ఆప్షన్‌తో రానుంది. గెలాక్సీ నోట్ సిరీస్‌లో సపరేట్‌గా పెన్ ఆప్షన్ ఇందులో ఉంటుంది. సామ్‌సంగ్ ఇండియా సైట్‌లో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ ప్రీ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. రూ.1,999 కట్టి ఫోన్‌ను బుక్ చేసుకోవచ్చు. ఇండియాలో సామ్‌సంగ్ సేల్స్ ప్రారంభం కాగానే.. ప్రీ బుకింగ్ చేసుకున్న వాళ్లకు ముందుగా ఫోన్ కొనుగోలు చేసే చాన్స్ ఉంటుంది. ప్రీబుకింగ్ సమయంలో పే చేసిన రూ.1999ను ఫోన్ కొనుగోలు చేసిన తర్వాత రిఫండ్ చేస్తారు. ఫిబ్రవరి 9 నుంచి ఫిబ్రవరి 21 వరకు ప్రీ బుకింగ్స్ చేసుకోవచ్చు. ప్రీ బుకింగ్స్ చేసుకున్న కస్టమర్లకు రూ.2699 విలువైన సామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ట్యాగ్ ట్రాకింగ్ డివైజ్‌ను ఉచితంగా అందిస్తారు. మార్చి 10 లోపు ప్రీ బుకింగ్స్ చేసుకున్న వాళ్లు ప్రీ రిజర్వ్ వీఐపీ పాస్‌ను ఉపయోగించి ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు. మార్చి 10 తర్వాత ప్రీ బుకింగ్స్ కొనుగోలు ఆగిపోతాయి. ఫిబ్రవరి 25 నుంచి భారత్‌లో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 21 సేల్స్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్‌22 ఫోన్ ధర రూ.59,900 గా నిర్ణయించారు. గెలాక్సీ ఎస్‌22 ప్లస్ ఫోన్ ధర రూ.74,900, గెలాక్సీ ఎస్‌22 అల్ట్రా ధర రూ.89,900 గా నిర్ణయించారు. గెలాక్సీ ఎస్‌22, ఎస్ 22 ప్లస్ ఫోన్లు 8జీబీ ప్లస్ 128 జీబీ, 8 జీబీ ప్లస్ 256 జీబీ వేరియంట్లలో లభించనున్నాయి. గెలాక్సీ ఎస్‌22 అల్ట్రా మాత్రం 8జీబీ ప్లస్ 128 జీబీ, 12 జీబీ ప్లస్ 256 జీబీ, 12 జీబీ ప్లస్ 512 జీబీ, 12 జీబీ ర్యామ్ ప్లస్ 1 టీబీ స్టోరేజ్ వేరియంట్లలో లభించనుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్ యూఐ 4.1 ఓఎస్‌, స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 1 ఎస్‌వోసీ ప్రాసెసర్ లాంటి ఫీచర్లు ఎస్‌22 సిరీస్‌లో ఉండనున్నాయి. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్‌22 మాత్రం 6.1 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఏఎంవోఎల్ఈడీ డిస్‌ప్లేతో రానుండగా.. గెలాక్సీ ఎస్‌22 ప్లస్ మాత్రం 6.6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డైనమిక్ ఏఎంవోఎల్ఈడీ డిస్‌ప్లేతో రానుంది. గెలాక్సీ ఎస్‌22 అల్ట్రా.. 6.8 ఇంచ్ ఎడ్జ్ ఏఎంవోఎల్ఈడీ డిస్‌ప్లేతో రానుంది. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్‌22, ఎస్‌22 ప్లస్ ఫోన్లు ట్రిపుల్ రేర్ కెమెరా, 50 ఎంపీ రేర్ కెమెరా, 10 ఎంపీ సెల్ఫీ కెమెరా ఆప్షన్లతో రానున్నాయి. గెలాక్సీ ఎస్‌22 అల్ట్రా మాత్రం 108 ఎంపీ రేర్ కెమెరా, 40 ఎంపీ సెల్ఫీ కెమెరాతో రానున్నాయి. 3700 ఎంఏహెచ్ బ్యాటరీతో ఎస్‌22, 4500 ఎంఏహెచ్ బ్యాటరీతో ఎస్‌22 ప్లస్‌, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఎస్‌22 అల్ట్రా ఫోన్ రానుంది.


Post a Comment

0 Comments

Close Menu