Ad Code

ఆకర్షణీయమైన ఫీచర్లతో ఐటెల్ ఏ 27


ఐటెల్ తన లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ గా itel A27 ను మార్కెట్ లోకి తెచ్చింది.  ఐటెల్ A27 స్మార్ట్ ఫోన్ రూ.5,999 రూపాయల ధరలో ఆకర్షణీయమైన ఫీచర్లతో వచ్చింది. ఆండ్రాయిడ్ 11 Go ఎడిషన్ తో పాటుగా  5.45 అంగుళాల IPS డిస్ప్లే, డ్యూయల్ 4G VoLTE సపోర్ట్ మరియు 4,000mAh పెద్ద బ్యాటరీని కూడా కలిగివుంది. ఒకవిధంగా చెప్పాలంటే ఇటీవల ప్రకటించిన జియోఫోన్ నెక్స్ట్ కి పోటీగా నిలుస్తుందని చెప్పవచ్చు. ఐటెల్ A27 స్మార్ట్ ఫోన్ కేవలం 2జిబి ర్యామ్ మరియు 32జిబి స్టోరేజ్ కలిగిన ఒకే వేరియంట్ లో లభిస్తుంది మరియు దీని ధర రూ.5,999. ఈ ఫోన్ క్రిస్టల్ బ్లూ, డీప్ గ్రే మరియు సిల్వర్ పర్పుల్ మూడు కలర్ అప్షన్లలో లభిస్తుంది.  ఐటెల్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ 5.45 అంగుళాల FW+IPS డిస్ప్లేతో వస్తుంది. ఈ ఐపిఎస్ డిస్ప్లే యొక్క రిజల్యూషన్ 960x480 పిక్సెల్స్. దీని వెనుక ప్యానెల్లో 5 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాని ఫ్లాష్ లైట్ తో కలిగివుంది. ముందుభాగంలో, 2MP సెల్ఫీ కెమెరాని కూడా అందించింది. ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్) తో వచ్చిన ఈ ఫోన్ 1.4GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్తో పనిచేస్తుంది. ఇది 2 జీబీ ర్యామ్ మరియు 32 జీబీ స్టోరేజ్తో వస్తుంది మరియు మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా మెమోరిని విస్తరించవచ్చు. ఈ ఫోన్లో 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.

Post a Comment

0 Comments

Close Menu