యాపిల్ ఐఫోన్‌కు మార్కెట్లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రీమియం సెగ్మెంట్లో లభించే ఈ ఫోన్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతాయి. అయితే ధర కాస్త ఎక్కువగా ఉండటంతో ఐఫోన్ కొనేందుకు కొంత మంది వెనకడుగువేస్తుంటారు. లేటెస్ట్ ఐఫోన్ 13 మోడల్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఐఫోన్ 13 (128 జీబీ స్టోరేజ్) అసలు ధర 79,900 ఉండగా.. యాపిల్ ఇండియా ఐస్టోర్ రిటైల్ స్టోర్లలో దీన్ని కేవలం రూ. 50,900 వద్ద కొనుగోలు చేయవచ్చు.ఐఫోన్ 12 ధర వద్దే కొత్త ఐఫోన్ 13 కూడా లభిస్తుందన్న మాట. అయితే ఈ ఆఫర్‌ను పొందేందుకు అనేక నిబంధనలు, షరతులు ఉన్నాయి. ఐఫోన్ 13 కొనుగోలుపై యాపిల్ ఐస్టోర్ రిటైల్ స్టోర్లలో రూ. 5,000 విలువైన ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా, ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లతో అదనంగా రూ. 6,000 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. మరోవైపు, మీ పాత ఐఫోన్ XR (64 జీబీ స్టోరేజ్) ఎక్స్ఛేంజ్పై రూ. 18,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అయితే ఎంచుకున్న స్మార్ట్‌ఫోన్ మోడల్స్‌ను బట్టి ఎక్స్ఛేంజ్ ఆఫర్ మారుతుంది. అన్ని ఆఫర్లను పరిగణనలోకి తీసుకుంటే ఐఫోన్ 13 (256 జీబీ స్టోరేజ్) వేరియంట్ అసలు ధర రూ. 89,900 వద్ద ఉండగా.. దీన్ని రూ. 60,900 వద్ద కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 13 (512 జీబీ స్టోరేజ్) వేరియంట్ అసలు ధర రూ. 1,09,900 వద్ద ఉండగా.. దీన్ని రూ. 80,900 వద్ద కొనుగోలు చేయవచ్చు. కాగా, ఐఫోన్ 13 మొత్తం ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. రెడ్, పింక్, మిడ్‌నైట్, బ్లూ, స్టార్‌లైట్ వైట్ కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఆసక్తిగల వారు సమీపంలోని ఐస్టోర్ స్టోర్ లేదా ఆప్ట్రానిక్స్ ఇండియా, ఫ్యూచర్ వరల్డ్, మైఇమాజిన్ స్టోర్ వంటి పార్ట్నర్ ఈ-రిటైలర్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. యాపిల్ ఐఫోన్ 13 6.1 సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది A15 బయోనిక్ చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. ఫోన్ iOS 15 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌పై రన్ అవుతుంది. దీనిలో డ్యూయల్ కెమెరా సిస్టమ్‌ను అందించింది. వెనుకవైపు 12- మెగాపిక్సెల్ కెమెరాల, ముందు వైపు సెల్ఫీ కోసం మరో 12 మెగాపిక్సెల్ కెమెరాను చేర్చింది. ఈ కెమెరాలు 4K వీడియోలను చిత్రీకరించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఐఫోన్ 13 మోడల్ 5G కనెక్టివిటీకి మద్దతిస్తుంది. ఇది మాగ్‌సేఫ్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. వైఫై 6 కనెక్టివిటీకి కూడా మద్దతిస్తుంది. ఐఫోన్ 13 లైటింగ్ ఛార్జింగ్ పోర్ట్‌తో వస్తుంది.
0 Comments