Ad Code

వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 సేల్ ప్రారంభం !


వన్‌ప్లస్ నార్డ్ సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్ ఇటీవల ఇండియాలో లాంఛ్ అయింది. ఇప్పటికే వన్‌ప్లస్ నార్డ్, వన్‌ప్లస్ నార్డ్ 2, వన్‌ప్లస్ నార్డ్ సీఈ మోడల్స్ ఇండియాలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. లేటెస్ట్‌గా వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ స్మార్ట్‌ఫోన్ లాంఛ్ అయింది. రూ.25,000 లోపు బడ్జెట్‌లో ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్, 4,500ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. గతేడాది రిలీజ్ అయిన వన్‌ప్లస్ నార్డ్ సీఈ అప్‌గ్రేడ్ వర్షన్‌గా వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ మొబైల్ రిలీజ్ అయింది. ఫిబ్రవరి 22 మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్‌తో పాటు వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్‌లో సేల్ మొదలవుతుంది.  వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ స్మార్ట్‌ఫోన్ ధరలు చూస్తే 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.1,500 డిస్కౌంట్ లభిస్తుంది. 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.22,499 ధరకు, 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.23,499 ధరకు సొంతం చేసుకోవచ్చు. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ ద్వారా కొనేవారికి అదనంగా రూ.3,500 ఎక్స్‌ఛేంజ్ బోనస్ లభిస్తుంది.  వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.4 అంగుళాల అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కూడా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఒప్పో రెనో6, ఒప్పో రెనో7, టెక్నో పోవా 5జీ, ఇన్ఫీనిక్స్ జీరో 5జీ స్మార్ట్‌ఫోన్లలో ఇదే ప్రాసెసర్ ఉన్న సంగతి తెలిసిందే. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ స్మార్ట్‌ఫోన్ కెమెరా ఫీచర్స్ చూస్తే ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండటం విశేషం. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రావైడ్ యాంగిల్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. రియర్ కెమెరా ఫీచర్స్ చూస్తే ఏఐ సీన్ ఎన్హాన్స్‌మెంట్, ఏఐ హైలైట్ వీడియో, డ్యూయెల్ వ్యూ వీడియో, హెచ్‌డీఆర్, నైట్‌స్కేప్, పోర్ట్‌రైట్ మోడ్, పనో, రీటచింగ్, ఫిల్టర్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ Sony IMX471 ఫ్రంట్ కెమెరా ఉంది. ఏఐ హైలైట్ వీడియో, ఫేస్ అన్‌లాక్, స్క్రీన్ ఫ్లాష్, హెచ్‌డీఆర్, నైట్‌స్కేప్, పోర్ట్‌రైట్ మోడ్, రీటచింగ్, ఫిల్టర్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 4,500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 65వాట్ SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 11 + ఆక్సిజన్ ఓఎస్ 11.3 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే 5జీ, బ్లూటూత్, వైఫై, యూఎస్‌బీ టైప్ సీ, 3.5ఎంఎం ఆడియో జాక్ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. బహామా బ్లూ, గ్రే మిర్రర్ కలర్స్‌లో కొనొచ్చు.  వన్‌ప్లస్ నార్డ్ సీఈ అప్‌గ్రేడ్ వర్షన్‌గా వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ రిలీజైంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల మధ్య ప్రధాన మార్పులు చూస్తే వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌తో రిలీజ్ కావడం విశేషం. మిగతా స్పెసిఫికేషన్స్ అన్నీ దాదాపుగా ఒకేలా ఉన్నాయి. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ స్మార్ట్‌ఫోన్ 65వాట్ SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో లభిస్తుంది. ధర కూడా ఒకే రేంజ్‌లో ఉంది. అయితే వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్, ఇటీవల రిలీజ్ అయిన ఒప్పో రెనో 7 మొబైల్ ఫీచర్స్ దాదాపు ఒకేలా ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. 

Post a Comment

0 Comments

Close Menu