45 రోజుల్లోనే అంగారకుడిని చేరుకునే అవకాశం?


మానవులను అంగారక గ్రహాంపైకి తరలించడంపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా భూగ్రహం తర్వాత అత్యంత నివాసయోగ్యమైనదిగా భావిస్తున్న మార్స్ పైకి ప్రయాణ సమయంపై భిన్న వాదనలు ఉన్నాయి. భూమి నుంచి అంగారక గ్రహానికి ప్రయాణించాలంటే 500 రోజులు పడుతుందని నాసా గతంలోనే ప్రకటించింది. కానీ ఆ సమయాన్ని గణనీయంగా తగ్గించొచ్చని ప్రస్తుతం కొందరు శాస్త్రవేత్తలు అంటున్నారు. భూమి నుంచి అంగారకునిపైకి వెళ్లే ప్రణాళికలను వేగవంతం చేసిన మానవుడు ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలో భూమి-అంగారకుడి మధ్య ప్రయాణానికి 500 రోజులు పడుతుందని నాసా చెబుతోంది. అయితే కొంతమంది శాస్త్రవేత్తల బృందం ఆ గ్రహానికి చేరుకోవడానికి పట్టే సమయాన్ని తగ్గించవచ్చని చెబుతున్నారు. కేవలం 45 రోజుల్లో చేరుకోవచ్చని లెక్కగడుతున్నారు. దీనికోసం లేజర్-థర్మల్ ప్రొపల్షన్ సిస్టమ్‌ను రూపొందించారు. ఫలితంగా ఆశ్చర్యకర రీతిలో ప్రయాణ సమయం తగ్గిపోతుందని కెనడాకు చెందిన శాస్త్రవేత్తల బృందం స్పష్టం చేస్తోంది. లేజర్‌ల సహాయంతో హైడ్రోజన్ ఇంధనాన్ని వేడి చేసేందుకు.. 'లేజర్-థర్మల్' ప్రొపల్షన్ సిస్టమ్‌ను అభివృద్ధి చేశారు మాంట్రియల్‌లోని మెక్‌గిల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. దీనినే 'డైరెక్ట్-ఎనర్జీ ప్రొపల్షన్' అని పిలుస్తున్నారు. ఇది అంతరిక్ష నౌకలోని ఫోటోవోల్టాయిక్ ప్యానెళ్లకు శక్తినిస్తుంది. మార్స్ పర్యటనలో దీనిని ఉపయోగించొచ్చని మెక్‌గిల్ యూనివర్సిటీ ఎంఎస్సీ ఏరోస్పేస్ ఇంజినీరింగ్ స్టూడెంట్ ఇమ్మాన్యుయేల్ డుప్లే పేర్కొన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో ఓ పరిశోధన పత్రాన్ని ప్రచురించారు. డైరెక్ట్ ఎనర్జీ ప్రొపల్షన్ యొక్క నిజమైన ఉపయోగం అంతరిక్ష యాత్రేనని ఆయన పేర్కొన్నాడు.

Post a Comment

0 Comments