Ad Code

అందుబాటు ధరలో జియో ఫోన్ 5G?


దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో భారతదేశంలో జియో ఫోన్ 5Gని విడుదల చేయడానికి ప్రణాళికలు వేస్తుంది. వినియోగదారులకు తక్కువ ధరలో ఈ ఫోన్‌ను అందించాలని చూస్తోంది. ఈ ఫోన్ విభిన్న స్క్రీన్ సైజులు, స్పెసిఫికేషన్‌లతో రానుంది. ఇది హోల్-పంచ్ డిస్ప్లేతో ఆధునిక డిజైన్‌ను కలిగి ఉంటుంది. Jio Phone 5G స్పెసిఫికేషన్లు (అంచనా) Jio Phone 5G 20:9 యాస్పెక్ట్ రేషియోతో 6.5-అంగుళాల HD+ IPS డిస్‌ప్లేను, 720×1,600 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ని కలిగి ఉంటుంది. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో ఆటో ఫోకస్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాతో కూడిన 13-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. ఫోన్ ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. భద్రత కోసం ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది. ఫోన్ 4GB RAM 32GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఉండవచ్చు. మైక్రో SD కార్డు ద్వారా మెమరీని పెంచుకోవచ్చు. ఇది octa-core Qualcomm Snapdragon 480 SoC తో ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్)లో రన్ అవుతుంది. 18W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని అందిస్తుంది. ఫోన్‌లో గూగుల్ అసిస్టెంట్, రీడ్-అలౌడ్ టెక్స్ట్, గూగుల్ లెన్స్, గూగుల్ ట్రాన్స్‌లేటర్, ఇండిక్ లాంగ్వేజ్ సపోర్ట్ కూడా ఉంటుంది. MyJio, JioTV, JioSaavn వంటి అనేక ప్రీలోడెడ్ యాప్‌లతో కూడా వస్తుంది. దేశంలో Jio 5G సేవలు ప్రారంభించిన తర్వాత ఈ ఫోన్ విక్రయాలు ప్రారంభమవుతాయి. భారతదేశంలో Jio Phone 5G ధర (అంచనా) ధర రూ. 9,000 నుంచి రూ. 12,000 మధ్య ఉంటుంది.


Post a Comment

0 Comments

Close Menu