Header Ads Widget

మార్చి 9న రెడ్‌మీ నోట్ 11 సిరీస్ విడుదల


చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ జియోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మీ నుంచి నోట్ 11 సిరీస్ రిలీజ్‌కు ముహూర్తం ఖరారైంది. భారత విపణిలోకి మార్చి 9, 2022న రెడ్‌మీ నోట్ 11 సిరీస్ లాంచ్ కానుంది. రెడ్‌మీ నోట్ 11 ప్రో, రెడ్‌మీ నోట్ 11 ప్రో ప్లస్ 5జీ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయనున్నారు. రెడ్‌మీ నోట్ 11 ప్రో సిరీస్ గత సంవత్సరమే చైనాలో రిలీజ్ అయింది. గ్లోబల్ మార్కెట్‌లోకి కూడా ఈ సిరీస్ లాంచ్ అయింది. మార్చి 9న భారత మార్కెట్‌లోకి రానుంది. అయితే.. రెడ్‌మీ నోట్ 11 ప్రో, 11 ప్రో ప్లస్ పేరుతో చైనాలో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్లు భారత్‌లో మాత్రం జియోమీ 11ఐ హైపర్‌చార్జ్ పేరుతో లాంచ్ కానున్నాయి. రెడ్‌మీ నోట్ 11 ప్రో ఫోన్ ధర సుమారు రూ.22,500గా ఉండనుంది. అదే రెడ్‌మీ నోట్ 11 ప్రో ప్లస్‌ 5జీ ఫోన్ ధర రూ.24800 గా ఉండనుంది. డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 11 ప్రాసెసర్‌, ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో జీ96 ఎస్‌వోసీ ప్రాసెసర్‌, 6.67 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఏఎంవోఎల్ఈడీ డిస్‌ప్లే, 120 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్‌, 1200 ఎన్ఐటీఎస్ బ్రైట్‌నెస్‌, క్వాడ్ కెమెరా సెటప్‌, 108 ఎంపీ ప్రైమరీ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ లాంటి ఫీచర్లతో రెడ్‌మీ నోట్ 11 ప్రో ఫోన్ రానుంది. రెడ్‌మీ నోట్ 11 ప్రో ప్లస్ ఫోన్‌లోనూ దాదాపుగా ప్రోలో ఉన్నటువంటి ఫీచర్లే ఉన్నా.. ప్రాసెసర్ మాత్రం స్నాప్‌డ్రాగన్ 695తో రానుంది

Post a Comment

0 Comments