Ad Code

వాలెంటైన్స్ డే సందర్భంగా గూగుల్ కొత్త గేమ్!


వాలెంటైన్స్ డే సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్ తో శుభాకాంక్షలు అందజేసింది. అంతేకాదు ఆ డూడుల్ చూసి ఆనందపడేదే కాదు. ఇంట్రస్ట్ ఉంటే గేమ్ కూడా. విడిపోయిన అక్షరాలను కలిపే పజిల్ అన్నమాట. చాలా ఈజీగా ఉన్న ఈ పజిల్ కంప్లీట్ చేయడానికి 30సెకన్ల సమయాన్ని కూడా ఇస్తుంది గూగుల్. కొన్ని సార్లు ప్రేమ ఆశ్చర్యాన్ని కలిగించొచ్చు. ఒక్కసారిగా వచ్చిపడే ట్విస్ట్ లు, కాలంతో పాటు తిరిగే మలుపులు సర్వసాధారణం. కానీ, ప్రేమలో ఎత్తుపల్లాలు కూడా ఉంటాయి. అయినప్పటికీ ఇద్దరినీ ఒక ప్రపంచంలోకి తీసుకొచ్చేదే ప్రేమ’ గూగుల్ డూడుల్ ఈ రోజు మీ కోసం 3D Doodleతో సిద్ధమైంది. ఈ రెండు బొమ్మలకు దారిచూపిస్తారా అంటూ కామెంట్ పెట్టింది గూగుల్. దాని కిందనే ఉండే ఆప్షన్లతో అక్షరాలను ఎటు కావాలన్నా తిప్పుకోవచ్చు. సెయింట్ వాలెంటైన్ జ్ఞాపకార్థంగా వాలెంటైన్స్ డేను ఏటా జరుపుకుంటాం. మూడో శతాబ్దానికి చెందిన రోమన్ సెయింట్ జ్ఞాపకార్థంగా జరుపుకుంటాం. తొలినాళ్లలో ఇద్దరు క్రైస్తవులను గుర్తు చేసుకుంటూ విందు కార్యక్రమం నిర్వహించేవారు. కాలక్రమేణా కమర్షియల్ ఆలోచనలతో దీనిని రొమాన్స్, లవ్, రిలేషన్ షిప్ లకు ఆపాదించారు.

Post a Comment

0 Comments

Close Menu