ఉక్రెయిన్ నుండి వచ్చేయండి!


ఉక్రెయిన్​ సరిహద్దుల్లో పరిస్థితులు రోజురోజూకు దిగజారుతున్నాయి. ఆ దేశంపై ఎప్పుడైనా దాడి చేసేందుకు రష్యా సిద్ధంగా ఉందని అమెరికా నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్​లో తమ పౌరులను వీలైనంత త్వరగా ఉక్రెయిన్​ విడిచి స్వదేశానికి వచ్చేయమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ సూచించారు. పౌరుల తరలింపునకు సైన్యాన్ని పంపిస్తే.. ప్రపంచ యుద్ధానికి దారి తీయవచ్చని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.  "ఇది ఉగ్రవాద సంస్థతో వ్యవహరిస్తున్నట్లు కాదు. ప్రపంచంలోని అతిపెద్ద సైనిక వ్యవస్థలో ఒకటైన రష్యాతో వ్యవహరిస్తున్నాం. ఇది పూర్తిగాా భిన్నమైంది. పరిస్థితులు శరవేగంగా మారవచ్చు. అమెరికన్లను తరలించడానికి భద్రతా దళాలను ఉక్రెయిన్‌కు పంపితే.. అది ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చు" అని బైడెన్​ చెప్పినట్లు ఎన్​బీసీ మీడియా సంస్థ పేర్కొంది.

Post a Comment

0 Comments