Ad Code

ఎన్ఎఫ్‌టీ వెండింగ్ మెషిన్ ఏర్పాటు ?



అమెరికాలోని న్యూయార్క్ సిటీలో నియాన్ అనే క్రిప్టో స్టార్టప్ కంపెనీ ఎన్ఎఫ్‌టీ వెండింగ్ మెషన్‌ను ప్రారంభించింది. సాధారణంగా వెండింగ్ మెషిన్‌లు ఏవైనా స్నాక్స్ కోసం, కాఫీ, టీలు, కూల్‌డ్రింక్స్ కోసం ఏర్పాటు చేస్తారు. ఎన్ఎఫ్‌టీలు అంటే తెలుసు కదా. కానీ ఓపెన్‌సీ, బియాండ్‌లైఫ్‌.క్లబ్ అనే ప్లాట్‌ఫామ్స్ ద్వారా డిజిటల్ అసెట్‌ను కొనుగోలు, అమ్మకాలు చేయొచ్చు. క్రిప్టోకరెన్సీలాగానే, ఎన్ఎఫ్‌టీ కూడా ఒక డిజిటల్ ఆస్తి. అయితే ఎన్ఎఫ్‌టీలను వెబ్‌సైట్లలో ఇప్పటి దాకా కొనుగోలు చేశాం కానీఇలా వెండింగ్ మెషిన్ ద్వారా కొనుగోలు చేయడం ఇదే మొదటిసారి. సాధారణంగా ఎన్ఎఫ్‌టీలను క్రిప్టోకరెన్సీల ద్వారానే కొనుగోలు చేయాలి. కానీ.. ఈ వెండింగ్ మెషిన్‌లో ఫియట్ కరెన్సీ, క్రెడిట్ కార్డ్స్‌, డెబిట్ కార్డ్స్ ఉపయోగించి కొనుగోలు చేయొచ్చు. ఈ ఎన్ఎఫ్‌టీ వెండింగ్ మెషిన్‌ను సొలానా బ్లాక్‌చైన్ టెక్నాలజీ ద్వారా డెవలప్ చేశారు. ఈ వెండింగ్ మెషిన్‌లో డిజిటల్ ఆర్ట్స్ ఎక్కువగా ఉంటాయి. వాటిని ఈ మెషిన్ ద్వారా కొనుగోలు చేయొచ్చు. తిరిగి అమ్ముకోవచ్చు కూడా.

Post a Comment

0 Comments

Close Menu