గూగుల్ పే నుంచి పర్సనల్ లోన్ ఆఫర్


గూగుల్ పే ప్లాట్ ఫాం కూడా తమ యూజర్ల కోసం డిజిటల్ పర్సనల్ పేమెంట్స్ ఆఫర్ చేస్తోంది. అందుకోసం గూగుల్ పే యూజర్లకు రూ. లక్ష వరకు పర్సనల్ లోన్ ఆఫర్ అందిస్తోంది. ఈ డిజిటల్ పర్సనల్ లోన్ ఆఫర్ పొందాలంటే గూగుల్ పే యూజర్లు తప్పనిసరిగా క్రెడిట్ స్కోరు కలిగి ఉండాలి. ఈ క్రెడిట్ స్కోరు ఆధారంగానే గూగుల్ పే తమ యూజర్లకు లక్ష వరకు లోన్ అందిస్తోంది. గూగుల్ పే ప్రీ క్వాలిఫైడ్ యూజర్లకు డిఎంఐ ఫైనాన్స్ అనే కంపెనీ ద్వారా జిటల్ పర్సనల్ లోన్ ఆఫర్ తీసుకొచ్చింది గూగుల్ పే. ఈ లోన్ ఆఫర్ అర్హత కలిగిన యూజర్లు కేవలం నిమిషాల వ్యవధిలోనే లక్ష రూపాయల వరకు పర్సనల్ లోన్ పొందవచ్చు. ఈ లోన్ మొత్తాన్ని 36 నెలలు లోగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. గూగుల్ పే యూజర్ల అందరికి ఈ లోన్ ఆఫర్ వర్తించదు. గూగుల్ పే యూజర్లు ఆన్ లైన్ పేమెంట్స్ విధానంలో మంచి క్రెడిట్ హిస్టరీ కలిగి ఉండాలి. క్రెడిట్ స్కోరు బాగుంటేనే పర్సనల్ లోన్ పొందే అవకాశం ఉంటుంది. లక్షలాది మంది గూగుల్ పే యూజర్లు పారదర్శకంగా తొందరగా లోన్లు పొందేందుకు ఈ ఆఫర్ తీసుకొచ్చినట్టు డిఎంఐ ఫైనాన్స్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 

Post a Comment

0 Comments