Ad Code

యూట్యూబ్‌ నుంచి టిక్‌టాక్‌ తరహాలో కొత్త ఫీచర్!


గూగుల్‌కు చెందిన యూట్యూబ్‌ మరో కొత్త ఫీచర్‌ను యూజర్స్‌కు అందిస్తోంది. ఇతర వీడియోస్ట్రీమింగ్‌, షేరింగ్ ప్లాట్‌ఫాంలకు పోటీగా సరికొత్త అప్‌డేట్స్ అందిస్తోంది. తాజాగా టిక్‌టాక్‌ తరహాలో ఉండే లైవ్ రింగ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇండియాలో టిక్‌టాక్‌ యాప్‌ను కేంద్ర ప్రభుత్వం బ్యాన్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో యూట్యూట్‌లోని షార్ట్‌ వీడియోస్‌ ఫీచర్‌ యూజర్లను విశేషంగా ఆకట్టుకొంది. చాలా మంది టిక్‌టాక్‌ వినియోగదారులు య్యూటూబ్‌లో ఛానెల్‌ ఓపెన్‌ చేశారనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం యూట్యూబ్‌ ఛానల్ నిర్వాహకుల లైవ్‌ స్ట్రీమింగ్‌ను సూచించేలా ప్రత్యేక ఇండికేటర్‌ను తీసుకొస్తున్నట్లు యూట్యూబ్‌ నిర్వాహకులు ప్రకటించారు. కొత్తగా అలరించనున్న యూట్యూబ్‌ ఫీచర్‌ ద్వారా లైవ్‌ కంటెంట్‌ను వినియోగదారులు సులువుగా గుర్తించవచ్చు. ఛానెల్‌ నిర్వాహకులు లైవ్‌లో ఉన్నారని తెలిపేలా వారి ప్రొఫైల్‌ పిక్చర్‌ వద్ద 'Live' అనే రింగ్‌ కనిపిస్తుంది. దీని ద్వారా లైవ్‌స్ట్రీమ్‌లోకి వెళ్లి ఛానెల్‌ నిర్వాహకులతో కనెక్ట్‌ అయ్యే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి యూట్యూబ్‌ చీఫ్‌ ప్రొడక్ట్‌ ఆఫీసర్‌ నియల్‌ మోహన్‌ మాట్లాడుతూ..' య్యూటూబ్‌లో లైవ్‌ స్ట్రీమ్స్‌ను యూజర్స్‌ సులువుగా గుర్తించేలా చేయడంపై దృష్టి పెట్టాం. వీలైనంత త్వరగా యూజర్లకు ప్రత్యేక ఫీచర్‌ను అందించాలనే ఉద్దేశంతో పనిచేశాం. ప్రస్తుతం మొబైల్‌లో యూట్యూబ్‌ వినియోగిస్తున్న సమయంలో లైవ్‌ స్ట్రీమింగ్‌ను సూచించేలా Live రింగ్‌ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాం. యూట్యూబ్‌ క్రియేటర్స్‌ ఛానల్‌ ప్రొఫైల్‌ పిక్చర్‌ పక్కన లైవ్‌ రింగ్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేస్తే నేరుగా లైవ్‌ స్ట్రీమ్‌ ఓపన్‌ అవుతుంది.' అని వివరించారు. ఇప్పటి వరకు ఈ తరహా సదుపాయం టిక్‌టాక్‌ యాప్‌లో అందుబాటులో ఉంది. ఛానల్‌ ప్రొఫైల్‌ పిక్చర్‌ వద్ద పల్సింగ్‌ రింగ్‌ ఎఫెక్ట్‌ కనిపిస్తుంది. ఆ రింగ్‌ కనిపిస్తే ఆ ఛానల్‌ వ్యక్తి లైవ్‌ స్ట్రీమింగ్‌లో ఉన్నట్లు అని భావించాలన్నారు. అదే విధంగా ఐఫోన్‌, ఐప్యాడ్‌లలో పిక్చర్‌ ఇన్‌ పిక్చర్‌(PiP) సదుపాయాన్ని యూట్యూబ్‌ టీవీ అందిస్తోంది. దీని గురించి నియల్‌ మోహన్‌ మాట్లాడుతూ.. 'ఐఓఎస్‌ ప్లాట్‌ఫాంపై పిక్చర్‌ ఇన్‌ పిక్చర్‌ సదుపాయం ఏరోజున అందుబాటులోకి వస్తుందనే అంశంపై కచ్చితమైన స్పష్టత ఇవ్వలేం. యూట్యూబ్‌ టీవీ యూజర్లకు కచ్చితంగా కొన్ని నెలల్లోపే ఈ సదుపాయాన్ని అందిస్తాం.' అని చెప్పారు. పిక్చర్‌ ఇన్‌ పిక్చర్‌ సదుపాయం ఇప్పటికే ఆండ్రాయిడ్‌ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఐఓఎస్‌ యూజర్స్‌ మాత్రం యూట్యూబ్‌ టీవీ పిక్చర్‌ ఇన్‌ పిక్చర్‌ సదుపాయం కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. సరౌండ్‌ సౌండ్‌ వంటి మరికొన్ని సదుపాయాలను తీసుకొచ్చేందుకు కూడా యూట్యూబ్‌ పని చేస్తోంది. ఈ సదుపాయం గతేడాది కొన్ని సబ్‌సెట్‌ ఆఫ్‌ డివైజస్‌కు మాత్రం అందించింది. త్వరలో అన్ని రకాల డివైజెస్‌పై, అన్ని ప్లాట్‌ఫాంలపై రన్‌ అయ్యేలా అభివృద్ధి చేయనుంది.

Post a Comment

0 Comments

Close Menu