భార్య అదృశ్యమైంది!


మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌కు చెందిన రాజేంద్రకుమార్‌, అతని భార్య హీర్కాన్‌బాయి జీవనోపాధి నిమిత్తం ఇటీవల హైదరాబాద్ నగరానికి వచ్చారు. మియాపూర్‌లో నిర్మాణ కూలీలుగా పని చేసేవారు. ఈనెల 16న సొంతూరు వెళ్లేందుకు ప్రయాణమయ్యారు. మియాపూర్‌లో కొందరు గుర్తుతెలియని వ్యక్తులతో రాజేంద్రకుమార్‌ పందెం కాసి డబ్బులు పోగొట్టుకున్నాడు. అనంతరం ఆటో ఎక్కి పంజాగుట్ట చౌరస్తాలో దిగారు. అక్కడి నుంచి బేగంపేట రైల్వేస్టేషన్‌కు కాలినడకన బయలుదేరారు. హీర్కాన్‌బాయి కనిపించకుండాపోవడంతో శనివారం పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

Post a Comment

0 Comments