Ad Code

ఫేషియల్ టెక్నాలజీతో అవెరా విన్సెరో


అవెరా ఏఐ మొబిలిటీ సంస్థ దుబాయ్ ఎక్స్‌పోలో సరికొత్త ఎలక్ట్రిక్ వెహికల్ ను ఆవిష్క రించింది. “అవెరా విన్సెరో ” పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోపాటు ఫేషియల్ టెక్నాలజీని కలిగి ఉన్న ప్రపంచంలోనే ఇది మొదటి స్కూటర్ అని అవెరా ఏఐ మొబిలిటీ సంస్థ వెల్లడించింది. ఈ స్కూటర్ ను ఒక్కసారి చార్జింగ్ చేస్తే100 కిలోమీటర్ల వేగంతో 200 కిమీ వరకు ప్రయాణింవచ్చని కంపెనీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని తమ ప్లాంట్‌లో ఈ స్కూటర్లను తయారు చేసి విదేశాలకు సైతం ఎగుమతి చేస్తామని అవెరా ఏఐ మొబిలిటీ సంస్థ ప్రకటించింది. దుబాయ్ ఎక్స్‌పోలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన రోడ్‌షోలో కంపెనీ వ్యవస్థాపకుడు వెంకట రమణ, సహ వ్యవస్థాపకుడు చాందిని చందనా సమక్షంలో భారతదేశంలోని యుఎఇ రాయబారి అహ్మద్ అబ్దుల్ రెహమాన్ అల్బానా ఈ స్కూటర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Post a Comment

0 Comments

Close Menu