వైర్‌లెస్‌ ఛార్జర్లు వాడుతున్నారా..?


వైర్డ్‌ ఛార్జర్లను వినియోగించడంకంటే వైర్‌ ఛార్జర్లను ఉపయోగించడం సౌకర్యంగా ఉంటుంది. వీటిని వినియోగించేందుకు ఛార్జర్‌ను పవర్‌ సాకెట్‌కు కనెక్ట్‌ చేసి.. స్టాండ్‌ ఆఫ్‌ ఛార్జింగ్‌ లేదా ప్యాడ్‌పైన్‌ స్మార్ట్‌ఫోన్‌ పెడితే చాలు. ఇదే వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ టెక్నాలజీకి ప్రాచుర్యం కల్పించింది. భవిష్యత్తులో వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ విస్తృతంగా అందుబాటులోకి రావడం కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఓ సారి వినియోగిస్తే ఆ టెక్నాలజీ కల్పిస్తున్న సదుపాయాలపై అవగాహన కలుగుతుంది. వైర్‌లెస్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే స్మార్ట్‌ఫోన్లలో ఇన్‌బిల్ట్‌ రిసీవర్‌ కాయిల్స్‌ ఉంటాయి. ఛార్జింగ్‌ ప్యాడ్‌లో పొందుపరిచిన కాయిల్స్‌తో అవి కమ్యునికేట్‌ అవుతాయి. వైర్డ్‌ ఛార్జర్‌లో సరఫరా అయ్యే వోల్టేజ్‌ కంటే ఈ రెండు కాయిల్స్‌ మధ్య సరఫరా అయ్యే వోల్టేజ్‌ చాలా తక్కువగా ఉంటుంది. దీంతో డివైజ్‌కు ఎలాంటి ప్రమాదం లేదు. ఫోన్లో రిసీవర్‌ కాయిల్‌, ఛార్జింగ్‌ ప్యాడ్‌లో కూడా కాయిల్‌ ఉండటంతో సరఫరా అయ్యే విద్యుత్తు నియంత్రణలోనే ఉంటుంది. అయితే ఛార్జింగ్‌ ప్యాడ్‌పై స్మార్ట్‌ఫోన్‌ను సక్రమంగా పెట్టడంపై కాస్త జాగ్రత్త అవసరం. స్మార్ట్‌ఫోన్‌ ఆప్టిమమ్‌ స్పీడ్‌లో ఛార్జ్‌ అయిన తర్వాత, నార్మల్‌ స్పీడ్‌లో ఛార్జింగ్‌ అయ్యేలా ప్రొటెక్షన్‌ సర్క్యూట్‌ మోడ్యూల్‌ చేస్తుంది. బ్యాటరీ జీవితకాలం పెరిగేలా ఇది దోహదపడుతుంది. మార్కట్‌లో చాలా రకాల వైర్‌లెస్‌ ఛార్జర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే క్యూఐ సెర్టిఫైడ్‌ ఛార్జర్లను వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. మంచి ఫలితాలు ఉంటాయని, ఫోన్‌ సురక్షితంగా ఉంటుందని చెబుతున్నారు.అన్ని రకాల ఫోన్‌లోని బ్యాటరీలు కాలం గడిచేకొద్దీ సామర్థ్యాన్ని కోల్పోతూ వస్తాయి. తయారు చేస్తున్న సమయంలోనే బ్యాటరీ సైకిల్స్‌ నిర్ధారిస్తారు. అయితే వైర్‌లెస్‌ ఛార్జర్‌ ద్వారా బ్యాటరీ త్వరగా ఎఫెక్ట్‌ అవుతుందనే వాదనలో వాస్తవం లేదు. స్మార్టఫోన్‌లతో అనుసంధానమై పనిచేసేలానే వైర్‌లెస్‌ ఛార్జర్లను రూపొందించారు. 15W ఛార్జింగ్‌ స్పీడ్‌తో పనిచేసే స్మార్ట్ ఫోన్‌కు 30W వైర్‌లెస్‌ ఛార్జర్‌ను వినియోగిస్తుంటే.. ఛార్జర్‌లో స్పీడ్‌ లెవల్‌ తగ్గి.. ఫోన్‌కు సరిపడా స్థాయిలోనే వోల్టేజ్‌ను అందిస్తుంది. సెర్టిఫై చేసిన ఛార్జర్‌ను వినియోగించినంత కాలం బ్యాటరీ లైఫ్‌ బావుంటుంది, ఫోన్‌కూడా సురక్షితంగా ఉంటుంది. వాటికైతే పవర్‌ ఔట్‌పుట్‌ను సక్రమంగా కంట్రోల్‌ చేసే శక్తి ఉంటుంది.

Post a Comment

0 Comments