Ad Code

స్క్రీన్‌షాట్‌లను తీసుకోవడం ఇక కుదరదు !


ఫేస్‌బుక్ కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ మెసెంజర్ చాట్‌ల కోసం కొత్త అప్‌డేట్‌ను విడుదల చేయనుంది. డిలీట్ అవుతున్న మెసేజ్‌ను ఎవరైనా స్క్రీన్‌షాట్‌లు తీస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ విషయాన్ని మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తన ఫేస్‌బుక్ పేజీలో వెల్లడించారు. మాములుగా చాట్ మెసేజ్‌లు చదివిన వెంటనే అదృష్యమవుతాయి. వాటి చాట్‌ల కోసం ఎవరైనా స్క్రీన్‌షాట్‌ తీస్తే అవతలి వ్యక్తికి హెచ్చరికను జారీ చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ యూనైటెడ్ స్టేట్స్‌లో అందుబాటులో ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో మరిన్ని ప్రాంతాలలో ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టనున్నారు. కంపెనీ వానిష్ మోడ్ అనే కొత్త ఫీచర్‌ను కూడా ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.


Post a Comment

0 Comments

Close Menu