Ad Code

భారీ నగదుతో ఉడాయించిన డ్రైవర్


తెలంగాణ లోని మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా దుండిగల్‌ పీఎస్ పరిధి సాయిబాబా నగర్‌లో ఓ దొంగ ఏటీఎం క్యాష్‌ వాహనంతో పరార్‌ అయ్యాడు. భారీ నగదుతో డ్రైవర్ సాగర్ ఉడాయించాడు. దుండిగల్  సాయిబాబా నగర్ లోని యాక్సిస్ బ్యాంక్ ఏటిఎంలో డిపాజిట్ చేయడానికి వాహనం వచ్చింది. రైటర్ సంస్థకు చెందిన ఈ వాహనంలో 36 లక్షలు రూపాయల నగదు ఉంది. శనివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో 3 లక్షల రూపాయల నగదుని వాహనం నుంచి క్యాషియర్ తీసుకున్నాడు. ఆయనతోపాటు గన్ మ్యాన్ దిగి ఏటీఎంలో డబ్బుని నింపుతున్నారు. వాహనాన్ని మలుపుకొస్తానని చెప్పిన డ్రైవర్‌ అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయాడు. మలుపుకుని వస్తాడని క్యాషియర్‌, గన్‌మ్యాన్‌ ఎదురుచూశారు. ఎంతోసేపటికి గానీ అసలు విషయం తెలియలేదు. వెంటనే డ్రైవర్‌ డబ్బుతో ఉడాయించాడని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్న పోలీసులు వివరాలు అడిగితెలుసుకున్నారు. వాహనానికి జీపీఎస్‌ ఉండడంతో దాని సాయంతో సెర్చింగ్‌ మొదలుపెట్టారు. నర్సాపూర్ అడవిలో వాహనం జాడ దొరికింది. కాని అందులో 36లక్షల రూపాయల డబ్బు మాయమైంది. వాహనం, దానిపక్కనే తుపాకీ కూడా పడి ఉంది. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. దొంగ వివరాలపై ఆరా తీస్తున్నారు. గతంలో ఇలాంటి దొంగతనాలేమైనా జరిగాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సంస్థలో నమోదైన వివరాలు, ఆధార్‌ ఆధారంగా వివరాలు సేకరించారు. దుండగుడు వేరే రాష్ట్రాలకు గాని, విదేశాలకు గాని పారిపోయే చాన్స్‌ కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu