Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Thursday, March 31, 2022

డిలీట్ ఫోటోలు తిరిగి పొందేందుకు బెస్ట్ యాప్స్ !


ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ నుండి అనుకోకుండా డిలీట్ అయినా సరే, మీరు చింతించాల్సిన పనిలేదు. డిలీటైన మీ ఫోటోలను తిరిగి తీసుకొచ్చే యాప్స్ గూగుల్ ప్లే స్టోర్ లో చాలా వున్నాయి. అయితే, వాటిలో బెస్ట్ లేదా చాలా సులభంగా ఉపయోగించదగిన యాప్స్ 

డిస్క్ డిగ్గర్ ఫోటో రికవరీ యాప్ : దాదాపుగా 5 మిలియన్ల వినియోగదారుల చేత డౌన్లోడ్ చేయబడింది. అలాగే, ఇది  గూగుల్ ప్లే స్టోర్లో 4.2 స్టార్స్ అందుకుంది. అంతేకాకుండా 2 మిలియన్లకు పైగా వినియోగదారులు దీన్ని రేట్ చేసారు ఈ App యొక్క పరిమాణం మీ పరికరాన్నిబట్టి ఆధారపడి ఉంటుంది. మీరు ఈ ఆప్ తో, డిలీట్ అయిన ఫోటోలను మళ్ళీ ఫోటోలను అన్ డిలేట్ మరియు రికవరీ చేస్తుంది. అప్లికేషన్ ఇంటర్ఫేస్ చాలా సులభం. ఇది ఉపయోగించడానికి సులభం. ఎటువంటి రూట్ చేయాల్సిన పనిలేదు.

డిలీటెడ్ ఫోటో రికవరీ యాప్ : గూగుల్ ప్లే స్టోర్ లో ఈ ఆప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఆప్, 5 మిలియన్ల వినియోగదారులచేత డౌన్లోడ్ చేయబడింది. ఇది Google ప్లే స్టోర్లో 4.3 స్టార్స్ కలిగివుంది. ఇది 66,000 వినియోగదారులచే రేట్ చేయబడింది. ఈ అప్లికేషన్ చాలా ఫోటోలను రికవర్ చేస్తుంది. మైక్రో SD కార్డ్ మరియు అంతర్గత స్టోరేజిని ఈ అప్లికేషన్ స్కాన్ చేస్తుంది. అప్లికేషన్ చాలా వేగంగా స్పందిస్తుంది.మీ ఫోనులో లేదా మెమొరీ కార్డులో నుండి తెసివేయబడిన ఫోటోలను, త్వరగా తిరిగి తీసుకొస్తుంది.

రెస్టోర్ ఇమేజ్ : ఈ అప్లికేషన్ దాదాపుగా 10 మిలియన్ల వినియోగదారులచేత డౌన్లోడ్ చేయబడింది. అంతేకాకుండా, Google Play Store లో 4.0 స్టార్లను సొంతంచేసుకుంది. ఇది 65,000 కన్నా ఎక్కువ మంది వినియోగదారులు రేటింగును అందుకుంది. ఈ అప్లికేషన్ పరిమాణం 3MB గా ఉంటుంది. మీరు ఈ అప్లికేషన్ లో పైన తెలిపిన అన్ని లక్షణాలను పొందుతారు. మీరు ఈ అనువర్తనాన్ని ఉపయోగించడానికి మీ ఫోన్ను root చేయాల్సిన అవసరం లేదు. 

అంతరిక్షంలో వ్యోమగాముల స్పేస్‌వాక్‌ !

 

అంతరిక్షంలో వ్యోమగాములు అప్పుడప్పుడూ నడుస్తుంటారు. దీన్నే స్పేస్‌వాక్ అంటారు. అయితే, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చి అంతరిక్షంలో నడుస్తున్న ఇద్దరు వ్యోమగాములను ఓ ఆస్ట్రో ఫొటోగ్రాఫర్ భూమినుంచి క్లిక్‌మనిపించాడు. ఈ ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఆస్ట్రో ఫొటోగ్రాఫర్లు భూమిపైనుంచే సుదూర గెలాక్సీలు, గ్రహాల ఫొటోలను తీస్తుంటారు. గతవారం సెబాస్టియన్ వోల్ట్‌మెర్ అనే ఆస్ట్రో ఫొటోగ్రాఫర్ ఓ ప్రత్యేకమైన ఫొటో తీశారు. నాసాకు చెందిన ఇద్దరు వ్యోమగాములు రాజాచారి, మాథియాస్ మౌరర్ మార్చి 23న ఐఎస్ఎస్ బయట ఏడు గంటలు గడిపారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం మెయింటెనెన్స్ పనుల్లో భాగంగా వారు బయట స్పేస్‌వాక్ చేస్తూ కనిపించారు. ఆ సమయంలో వోల్ట్‌మెర్ వాళ్ల చిత్రాలను అద్భుతంగా ఫొటో తీశాడు. ఈ ఫొటోను జర్మనీలోని మౌరర్ స్వస్థలమైన సంక్త్ వెండెల్ నుంచి క్యాప్చర్ చేశాడు. ఇందులో ఇద్దరు వ్యోమగాములు స్పేస్‌వాక్ చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నారు.

ఎలక్ట్రిక్ వాహన ధరలు పెరుగుతాయా?


పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుక్కోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఈ వాహనాల ధరలను పెంచేందుకు కంపెనీలు దృష్టి సారిస్తున్నాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. దీనికంతటికి కారణం రష్యా – ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధమే కారణమని విశ్లేషిస్తున్నారు. యుద్ధం కారణంగా.. దిగుమతి చేసుకున్న బ్యాటరీల ధరలు పెరుగుతున్నాయి. ఈవీ బ్యాటరీ సెల్స్ ధర రూ. 130 డాలర్లు లేదా అంతకంటే ఎక్కువగానే పెరిగినట్లు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ఇండియా ఆటోమోటివ్ సీనియర్ రీసెర్చ్ అనలిస్టు సౌమెన్ మండల్ వెల్లడిస్తున్నారు. సరఫరాలో అంతరాయం ఏర్పడడం, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు ఆయన అంచనా వేస్తున్నారు. ఓలా ఎన్ 1 స్కూటర్  లో 2.98 కిలోవాట్ బ్యాటరీ ఉంటుందని, ఏథర్ 450 ఎక్స్ లో 2.61 కిలోవాట్ల బ్యాటరీ ఉంటుంది. ఇక దేశీయంగా తయారవుతున్న అథర్ ఎనర్జీ  450X స్కూటర్ ధరలను జనవరిలో 3 శాతం లేదా రూ. 5,500 కంటే ఎక్కువగానే పెంచిన విషయం తెలిసిందే. ఓలా S1pro ఎలక్ర్టిక్ స్కూటర్ ధరలను పెంచనున్నట్లు కంపెనీ ఎలక్ట్రిక్ ఎగ్జిక్యూటివ్ భవిష్ అగర్వాల్ వెల్లడించారు. మార్చి 17న పెంచిన ధరలను అమల్లోకి వచ్చాయి. బ్యాటరీ సెల్స్ తయారీ, ఇందుకు అవసరమైన ముడి పదార్థాల ధరలు, వాణిజ్య ఆంక్షల కారణంగా..ఇతరత్రా వాటి కారణంగా ధరలు పెరిగాయని గ్రేటర్ నోయిడాకు చెందిన బ్యాటరీ తయారీ దారు లోహమ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రజత్ వర్మ తెలిపారు. చైనా, తైవాల్, కొరియా దేశాల్లో ప్రధాన సెల్ తయారీ దేశాల్లో బ్యాటరీ సెల్ ధరల పెరుగుదలకు కారణమయ్యాయని తెలిపింది. గత రెండు నెలల్లో 30 శాతం పెరిగాయని వెల్లడించారు. 

గూగుల్ పేలో కొత్త ఫీచర్ !


గూగుల్ పే యూజర్లకు యూపీఐ పేమెంట్ల కోసం కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. పైన్ ల్యాబ్స్‌తో భాగస్వామ్యంతో భారత్‌లో UPI ట్రాన్సాక్షన్ల కోసం ట్యాప్ టు పే  ప్రారంభించినట్లు గూగుల్ పే ప్రకటించింది. సమీపంలోని రిటైల్ షాపుల్లోని పాయింట్-ఆఫ్-సేల్ టెర్మినల్‌లో నేరుగా ఫోన్‌లను ట్యాప్ చేయడం ద్వారా UPI పేమెంట్లు చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్ ముందుగా రిలయన్స్ రిటైల్‌తో పైలట్ ప్రాజెక్టు మొదలైంది. ఇప్పుడు ఫ్యూచర్ రిటైల్ స్టార్‌బక్స్‌తో సహా అన్ని రిటైల్ స్టోర్ల వద్ద అందుబాటులోకి వచ్చింది. NFC- ఆధారిత Android స్మార్ట్‌ఫోన్లు కలిగిన UPI యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. ట్యాప్-టు-పే లావాదేవీల కోసం ఫంక్షనాలిటీకి పైన్ ల్యాబ్స్ ఆండ్రాయిడ్ PoS టెర్మినల్ అవసరం ఉంటుంది. UPI ఫంక్షనాలిటీతో పనిచేసే పీఓఎస్ టెర్మినల్స్‌పై ట్యాప్ చేయడం ద్వారా యూజర్లు తమ ఫోన్‌ను PoS టెర్మినల్‌లో ట్యాప్ చేసుకోవచ్చు. తద్వారా ఈజీగా లావాదేవీలను చేసుకోవచ్చు. UPI పిన్‌ ద్వారా ఫోన్ నుంచి పేమెంట్లను చేసుకోవచ్చు. QR కోడ్‌ స్కాన్ చేయాల్సిన పనిలేదు. UPI-లింక్ చేసిన మొబైల్ నంబర్‌తో అవసరం లేదు. మీ స్మార్ట్ ఫోన్‌లో NFC సపోర్టు ఉందో లేదో చెక్ చేసుకోవాలి. Apple Pay కాకుండా ఇతర సర్వీసుల ద్వారా NFC ఆధారిత పేమెంట్లను Apple సపోర్టు చేస్తుంది. Android ఫోన్‌లకు లిమిట్ వర్తిస్తుంది. UPI పేమెంట్ల కోసం ట్యాప్ చేయడం ద్వారా అధిక ట్రాఫిక్ రిటైల్ అవుట్‌లెట్‌లకు అనేక సమస్యలు ఉన్నాయి. క్యూ నిర్వహణ ఇబ్బందులు చాలా వరకు తగ్గుతాయి. కార్డ్‌లకు మించి POSలో డిజిటల్ పేమెంట్లను చేసుకోవచ్చు అని Google Pay నెక్స్ట్ బిలియన్ యూజర్ ఇనిషియేటివ్‌ల బిజినెస్ హెడ్ సజిత్ శివానందన్ అన్నారు.

దూసుకొస్తున్న సౌర తుపాను !


భూమికి మరో ముప్పు ముంచుకొస్తుంది. అత్యంత వేగంగా దూసుకొస్తున్న సౌర తుఫాన్ గురువారం భూమిని ఢీకొట్టే అవకాశం ఉంది. సౌర తుఫాను కారణంగా భూమిపై తీవ్ర ప్రభావంతో పాటు దెబ్బతినే అవకాశం ఉందని సైంటిస్టులు అంటున్నారు. దాదాపు 21 లక్షల కిలోమీటర్ల వేగంతో సౌర తుఫాన్ దూసుకొస్తోంది. ఈ రోజు ఏ క్షణమైనా భూమిని సౌర తుఫాన్ ఢీకొట్టే అవకాశం ఉందంటున్నారు. ఎందుకంటే… మార్చి 28న సూర్యుడిపై రెండు రీజియన్లలో భారీగా విస్పోటనాలు జరిగాయి. దాంతో అక్కడ కరోనల్ మాస్ఎజెక్షన్ రిలీజైంది. దీని కారణంగా హీట్ వేవ్ భారీ స్థాయిలో వెలువడింది. ఇప్పుడు అది అంతరిక్షంలో అత్యంత వేగంతో పయనిస్తోంది. భారీ విస్పోటనం జరిగినప్పటి నుంచి మూడు రోజులుగా సూర్యుడి నుంచి తీవ్ర స్థాయిలో జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఈ భారీ వేడి తరంగాలు భూమిని ఢీకొట్టనున్నాయి. ఈ సోలర్ స్ట్రోమ్‌ భూమిపై ఉండే అయస్కాంత తరంగాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ సైన్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది. 21 లక్షల 85 వేల 200 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న ఈ సోలార్ తుఫాన్ వేగం.. భూమిని చేరుకునేసరికి 496 నుంచి 607 కిలోమీటర్ల వేగానికి తగ్గిపోతుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ సోలార్ వేవ్‌ ప్రభావానికి శాటిలైట్లు గతి తప్పే అవకాశం ఉంది. శాటిలైట్లలోని కమ్యూనికేషన్ల వ్యవస్థ కూడా తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందంటున్నారు. గతంలో సౌర తుఫాన్ బారిన పడి ఎలన్‌ మస్క్‌ స్పేస్ ఎక్స్‌కు చెందిన 40 శాటిలైట్లు పనిచేయకుండా పోయాయి. ఇప్పుడు కూడా శాటిలైట్లపై సౌర తుఫాను ప్రభావం పడే అవకాశం ఉందని అంటున్నారు సైంటిస్టులు. ఈ బహుళ భూ అయస్కాంత తుఫానులు భూమిపై ప్రభావం చూపుతాయని భావిస్తున్నారు. సౌర కొరోనా అంతరిక్షంలోకి నిలిచిపోవడం ద్వారా భూ అయస్కాంత తుఫానులు ఏర్పడతాయి. ఈ తుఫానులు ఎక్కువగా భూమి ఎగువ వాతావరణాన్ని ప్రభావం చూపిస్తాయి. తక్కువ-కక్ష్యలో ఉన్న వస్తువులపై తనలోకి లాగేసుకుంటాయి. నివేదికల ప్రకారం.. 'కరోనల్ మాస్ ఎజెక్షన్‌లు  కరోనల్ హోల్ హై-స్పీడ్ కలయిక ఫలితంగా భూమివైపు దూసుకొచ్చే ప్రమాదం ఉందని బ్రిటీష్ మెట్ ఆఫీస్ హెచ్చరించింది. రాబోయే రోజుల్లో మరిన్ని సౌర తుఫానులు వచ్చే అవకాశం ఉంది. భౌగోళిక అయస్కాంత తుఫానుల పెరిగిన ఫ్రీక్వెన్సీ సౌర ప్రాంతం AR2975తో ముడిపడి ఉందని సైంటిస్టులు గుర్తించారు. శక్తివంతమైన భూ అయస్కాంత తుఫాను వేడి రేడియేషన్ కారణంగా దాని మార్గంలోని ఉపగ్రహాలను నాశనం చేయగలదు. అంతేకాదు.. సున్నితమైన పరికరాలు దెబ్బతినే అవకాశం ఉంది. అలాగే GPS సిస్టమ్‌లు, సెల్ ఫోన్‌లు, ఇంటర్నెట్ సేవలు పవర్ గ్రిడ్‌లకు కూడా అంతరాయం కలుగుతుంది. ఎయిర్‌ప్లేన్ నావిగేషన్ సిస్టమ్‌ల నుంచి ఆస్పత్రులు, ప్రైమరీ కేర్ సర్వీస్‌ల వరకు ప్రతిదీ ప్రభావితమయ్యే అవకాశం ఉంది.

రియల్‌మీ వాషింగ్ మెషీన్ !


రియల్‌మీ తన టెక్‌లైఫ్ రేంజ్‌లో సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లను లాంచ్ చేసింది. వీటిలో సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లు ఉన్నాయి. యాంటీ బ్యాక్టీరియల్, శక్తివంతమైన హోం అప్లయన్సెస్‌కు మనదేశంలో మంచి డిమాండ్ ఉంది. దీంతో రియల్‌మీ వాషింగ్ మెషీన్ల రంగంలోకి కూడా దిగింది. ఈ కొత్త సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లు 8, 8.5 కేజీల వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. వీటి ధర రూ.10,990 నుంచి ప్రారంభం కానుంది. సెమీ ఆటోమేటిక్, టాప్ లోడ్ వాషింగ్ మెషీన్‌లో ఎక్కువ కెపాసిటీ అందించారు. జెట్ స్ట్రీమ్ టెక్నాలజీ కూడా ఇందులో ఉంది. ఫైవ్ స్టార్ ఎనర్జీ రేటింగ్ కూడా వీటికి ఉంది. వీటిని భారతీయ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. వీటిలో 1,400 ఆర్‌పీఎం స్పిన్ సైకిల్, ఎయిర్ డ్రై టెక్నాలజీ, హార్డ్ వాటర్ వాష్, కాలర్ స్క్రబ్బర్, పల్సేషన్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఈ వాషింగ్ మెషీన్ అవుటర్ బాడీని డ్యూరబుల్ ప్లాస్టిక్‌తో రూపొందించారు. కాబట్టి తుప్పు పట్టకుండా ఉంటుంది. ఇందులో హెవీ డ్యూటీ మోటార్‌ను అందించారు. రియల్‌మీ జీటీ 2 ప్రో, 4కే టీవీ స్మార్ట్ టీవీ స్టిక్ మనదేశంలో ఏప్రిల్ 7వ తేదీన లాంచ్ కానున్నాయి. రియల్‌మీ జీటీ 2 ప్రోలో 6.7 అంగుళాల ఎల్టీపీవో ఈ4 అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ క్వాడ్ హెచ్‌డీ+గా ఉండనుంది. దీని పీక్ బ్రైట్‌నెస్ ఏకంగా 1400 నిట్స్‌గా ఉండనుంది. 1000 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ కూడా ఇందులో అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో టీసీవో సర్టిఫికేషన్ అందించారు. ఈ సర్టిఫికెట్ ఉన్న ఫోన్ల జీవితకాలం ఎక్కువ ఉంటుంది.

Wednesday, March 30, 2022

శామ్ సంగ్ నుంచి పోర్టబుల్ ప్రొజెక్టర్ లాంచ్


కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శామ్ సంగ్ నేడు ఇండియాలో ఒక ప్రొజెక్టర్ ని విడుదల చేసింది. ఒక స్మార్ట్ స్పీకర్ పరిమాణంలో గల ది ఫ్రీస్టైల్ యాంబియంట్ లైటింగ్ పోర్టబుల్ ప్రొజెక్టర్ డివైస్ తేలికైనదిగా లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. తరచూ ప్రయాణం చేయడానికి ఇష్టపడే వ్యక్తులకు ఇది ఒక గొప్ప ఎంపికగా ఉంటుంది. ఈ ఫ్రీస్టైల్ ప్రొజెక్టర్ 100-అంగుళాల (2 బై 54 సెం.మీ) వరకు స్క్రీన్ పరిమాణాలతో వీడియోను ప్రొజెక్ట్ చేయగలదు. విశేషమైన విషయం ఏమిటంటే దాని పోర్టబుల్ పరిమాణం దానిని చుట్టూ తీసుకెళ్లడానికి అనుమతిస్తుంది. Samsung ఫ్రీస్టైల్ ప్రొజెక్టర్ 30-అంగుళాల నుండి 100-అంగుళాల వీడియోను 180-డిగ్రీల రొటేషన్ మరియు క్రెడిల్ డిజైన్‌లతో ప్రొజెక్ట్ చేయగలదు. శామ్ సంగ్ బ్రాండ్ యొక్క ఫ్రీస్టైల్ కొత్త ప్రొజెక్టర్ ఫోటోలు మరియు వీడియోల కోసం వీక్షణ కోణాలను కేవలం కొన్ని క్లిక్‌లతో సెట్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఈ డివైస్ యొక్క బరువు కేవలం 800 గ్రాములు మాత్రమే ఉండడం దీని యొక్క ప్రత్యేకత. ఇది చాలా తేలికగా ఉన్నందున దీనిని సులభంగా ఎక్కడికైనా తీసుకొని వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. ఈ ప్రొజెక్టర్‌ను టేబుల్, ఫ్లోర్, గోడలు లేదా సీలింగ్‌పై కూడా ఉంచవచ్చు. శామ్ సంగ్ ఫ్రీస్టైల్ కొత్త ప్రొజెక్టర్ యొక్క ప్రత్యేకత విషయానికి వస్తే వీడియో ప్రొజెక్షన్ కోసం వైట్ బ్యాక్ గ్రౌండ్ అవసరం లేదు. ఎందుకంటే ఇది మీ గోడ యొక్క రంగు ఆధారంగా స్వయంచాలకంగా సెట్ చేయబడుతుంది. ఫోటోల నాణ్యతను మెరుగుపరచడానికి పరికరం ఆటో కీస్టోన్, ఆటో-లెవలింగ్ మరియు ఆటోఫోకస్ ఫీచర్‌లతో వస్తుంది. ఈ ఫీచర్‌లను ఉపయోగించి మీరు దాని స్క్రీన్‌ని ఏదైనా ఫ్లాట్ ఉపరితలంపై ఏ కోణంలోనైనా అమర్చవచ్చు. Samsung యొక్క ఫ్రీస్టైల్ ప్రొజెక్టర్ నెట్‌ఫ్లిక్స్, Hulu, యూట్యూబ్, డిస్నీ హాట్‌స్టార్ మరియు ప్రైమ్ వీడియోలకు కూడా మద్దతు ఇస్తుంది. ఇది OTT ప్లాట్‌ఫారమ్‌తో మొదటి సర్టిఫైడ్ ప్రొజెక్టర్‌గా నిలిచింది. ఫ్రీస్టైల్ ఛార్జింగ్ కోసం C-రకం పవర్ కనెక్షన్‌ని కలిగి ఉంది మరియు Galaxy పరికరాలతో సమకాలీకరించబడుతుంది. ఫ్రీస్టైల్ అల్ట్రా-పోర్టబుల్ ప్రొజెక్టర్ ఇండియాలో రూ.84,990 ధర వద్ద లాంచ్ అయింది. ఇది శామ్‌సంగ్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్, Samsung షాప్ మరియు అమెజాన్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు రూ.5000 వరకు తక్షణ క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు. పరిమిత వ్యవధి ఆఫర్‌లో 31 మార్చి 2022 రాత్రి 11.59 గంటల లోపు ఈ ఫ్రీస్టైల్‌ను కొనుగోలు చేసే వినియోగదారులు రూ.5,900 విలువైన ది ఫ్రీస్టైల్ క్యారీ కేస్‌ను ఉచితంగా పొందుతారు. ది ఫ్రీస్టైల్‌ను ప్రీ-రిజర్వ్ చేసుకున్న వినియోగదారులు రూ.4,000 వరకు తగ్గింపును పొందవచ్చు.

Redmi 10A చైనాలో లాంచ్


స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ Xiaomi కొత్తగా Redmi 10A ఫోన్‌ను చైనాలో లాంచ్ చేసింది. త్వరలో ఇండియాలో కూడా లాంచ్ కానుంది. ఇది MediaTek Helio G25 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. 6.53 అంగుళాల HD+ డిస్‌ప్లేతో పాటు 720×1600 పిక్సెల్ రిజల్యూషన్, 20:9 నిష్పత్తిని కలిగి ఉంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ v11 ఆధారంగా MIUI 12.5 కంపెనీ స్వంత లేయర్‌పై స్మార్ట్‌ఫోన్ నడుస్తుంది. హ్యాండ్‌సెట్ ఆక్టా-కోర్ MediaTek Helio G25 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఇది 6GB RAM, 128GB అంతర్గత మెమరీతో వస్తుంది. ఫోన్ 13MP ప్రైమరీ సెన్సార్, 2MP సెన్సార్‌తో కూడిన డ్యూయల్ కెమెరాతో వస్తుంది. 5MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని కలిగి ఉంది. 5000mAh బ్యాటరీ సపోర్ట్‌తో వస్తుంది. వెనుక వైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. Redmi స్మార్ట్‌ఫోన్ మూడు స్టోరేజ్ వేరియంట్‌లలో వస్తుంది. 4GB RAM + 64GB, 4GB RAM + 128GB, 6GB RAM + 128GB. స్మార్ట్‌ఫోన్ ధర సుమారు రూ. 7,700 వద్ద ప్రారంభమవుతుంది. షాడో బ్లాక్, స్మోక్ బ్లూ, మూన్‌లైట్ సిల్వర్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది.

నోకియా నుంచి Nokia CO1 Plus సిరీస్‌


నోకియా నుంచి Nokia CO1 Plus సిరీస్‌ సరికొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ 32GB ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌తో భారత మార్కెట్లో లాంచ్ అయింది. కాన్ఫిగరేషన్‌ విషయానికి వస్తే నోకియా C01 ప్లస్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ప్రముఖ ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లు, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు, Nokia.comలో వరుసగా రూ. 6,299, రూ. 6,799 ధరతో Nokia C01 Plus స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది. ఈ నోకియా CO1 Plus సిరీస్ స్మార్ట్ ఫోన్ JioExclusive ఆఫర్‌ ద్వారా సొంతం చేసుకోవచ్చు. కస్టమర్‌లు కొనుగోలు ధరపై రూ. 600 ఇన్ స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ రెండు వేరియంట్లపై వరుసగా రూ. 5,699, రూ. 6,199 చెల్లించాల్సి ఉంటుంది. గత రెండు ఏళ్లుగా వినియోగదారులకు అనేక ఫీచర్ మోడళ్లను అందించడంలో నోకియా పోర్ట్‌ఫోలియోను రూపొందించింది. తక్కువ-బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం పెరుగుతున్న డిమాండ్‌కు తగినట్టుగా నోకియా C-Series ప్రవేశపెట్టింది. ఎక్కువ కాలం మన్నిక అనేది నోకియా డివైజ్‌లపై యూజర్లలో మరింత విశ్వాసాన్ని పెంచింది. నోకియా C01 Aplus గత ఏడాదిలో ప్రారంభమైనప్పుడు మా యూజర్ల నుంచి చాలా మంచి ఆదరణ పొందిందని HMD గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ సన్మీత్ సింగ్ కొచ్చర్ ఒక ప్రకటనలో తెలిపారు. స్పెసిఫికేషన్ల విషయానికొస్తే నోకియా C01 ప్లస్ 5.45-అంగుళాల HD+ స్క్రీన్‌తో వస్తోంది. డివైజ్ పైన కింద అంచుల భాగంలో మందపాటి బెజెల్స్‌తో వస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లో 2MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఉంది. వెనుకవైపు.. 5MP HDR కెమెరాతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లోని రెండు కెమెరాలు ప్రత్యేక LED ఫ్లాష్‌తో వచ్చాయి. ఇక స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ 1.6GHz Unisoc SC9863A ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 2GB RAM, 32GB ఇంటర్నల్ స్టోరేజీతో వచ్చింది. మైక్రో SD కార్డ్‌ని ఉపయోగించి స్టోరేజీ కెపాసిటీని పెంచుకోవచ్చు. నోకియా C01 ప్లస్ 3000mAh బ్యాటరీతో వచ్చింది. ఛార్జింగ్ ఒకసారి పెడితే ఆ రోజుంతా ఉంటుంది.

ఫోన్ లోనే ఆధార్ కార్డ్ అప్డేట్ !


మీరు ఆధార్ కేంద్రానికి వెళ్లకుండానే మీ అడ్రెస్స్ ను ఆన్ లైన్లో అప్డేట్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు ఇంటర్నెట్ కనెక్షన్ మరియు ప్రభుత్వం యొక్క గుర్తింపు పొందిన ఐడెండిటీ ప్రూఫ్ ఏదైనా ఒకటి ఒకటి కలిగి ఉంటే సరిపోతుంది. ముందుగా మీ ఫోన్ లో అధికారిక ఆధార్ వెబ్సైట్ uidai.gov.in ని తెరవండి. ఇక్కడ మీకు మైన్ పేజ్ లో మూడవ అప్షన్ 'Update Address In Your Aadhaar' కనిపిస్తుంది. దీని పైన క్లిక్ చెయ్యగానే కొత్త పేజ్ కి మళ్ళించబడతారు. ఇక్కడ మీకు కనిపించే క్యాప్చా ను సరిగా నింపి OTP అప్షన్ పైన నొక్కండి. మీకు మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ పైన OTP అందించబడుతుంది. మీరు OTP ని ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే మరొక కొత్త పేజ్ తెరుచుకుంటుంది. ఇక్కడ Change/Update కోసం Adress అప్షన్ పైన నొక్కండి. ఇక్కడ మీరుమీ వివరాలను నింపి, మీ ఐడెండిటీ ప్రూఫ్ ను సబ్మిట్ చేయాలి. తరువాత, మీరు మీ మొబైల్ నంబర్ పైన మరొక OTP అందుకుంటారు. OTP ఎంటర్ చేసి Save అప్షన్ పైన నొక్కండి. మీరు మీ అడ్రెస్ చేంజ్ రిక్వెస్ట్ కోసం అప్లై చేకున్నట్లే. మీరు మీ అడ్రస్ చేంజ్ రిక్వెస్ట్ ప్రాసెస్ అయిందో లేదో తెలుసుకోవడానికి Update Request Number అనే ఆప్షన్ ను ఉపయోగించవచ్చు. 

ఐఫోన్ స్టోరేజ్ నుండి డేటా & సెట్టింగ్‌లను శాశ్వతంగా తొలగించడం ఎలా?


ఐఫోన్ లోని ఏదైనా డేటాను తొలగించడం వలన డేటా శాశ్వతంగా తొలగించబడదు. ఆపిల్ హ్యాండ్‌సెట్ నుండి డిలీట్ చేసినా అది ఐఫోన్ స్టోరేజ్ లోనే ఉంటుంది. మొత్తం డేటాను శాశ్వతంగా డిలీట్ చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి. మొదటిది ఐఫోన్ నుండి మీ డేటాను తొలగించవచ్చు.రెండవది మీ iPhone నుండి మొత్తం డేటా మరియు సెట్టింగ్‌లను తొలగించడానికి  Mac లేదా Windows PCని ఉపయోగించవచ్చు. సెట్టింగ్‌లు > జనరల్ > ట్రాన్సఫర్ లేదా రీసెట్ ఐఫోన్‌ విభాగంకు వెళ్లి మొత్తం కంటెంట్ మరియు సెట్టింగ్‌లను తొలగించు ఎంపిక మీద నొక్కాలి.  Mac లేదా Windows PCని ఉపయోగించి iPhone స్టోరేజ్ డేటాను శాశ్వతంగా తొలగించే విధానం : ఐఫోన్ నుండి మీ డేటా మరియు సెట్టింగ్‌లను శాశ్వతంగా తొలగించడానికి Mac లేదా Windows PCని కూడా ఉపయోగించవచ్చు. మీరు ఐఫోన్‌లో సెట్టింగ్‌లను ఓపెన్ చేయలేకపోతే ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. Mac లేదా Windows PCని ఉపయోగించి iPhone స్టోరేజ్ నుండి డేటాను శాశ్వతంగా తొలగించడానికి ఐఫోన్ మరియు కంప్యూటర్‌ను కేబుల్‌తో కనెక్ట్ చేయండి.  Macలోని ఫైండర్ సైడ్‌బార్‌లో మీ ఐఫోన్‌ను ఎంచుకుని విండో ఎగువన ఉన్న జనరల్‌ని క్లిక్ చేసి ఆపై రిస్టోర్ ఐఫోన్‌ ఎంపిక మీద క్లిక్ చేయండి. Windows PCలోని iTunes యాప్‌లో: iTunes విండో ఎడమవైపు ఎగువన ఉన్న iPhone బటన్‌ను క్లిక్ చేసి, సమ్మరీ మీద క్లిక్ చేసి, ఆపై రిస్టోర్ ఐఫోన్‌ ఎంపిక మీద క్లిక్ చేయండి.

Tuesday, March 29, 2022

సామ్ సంగ్ గెలాక్సీ A73 5G విడుదల !


సామ్ సంగ్ గెలాక్సీ A73 5G మరియు గెలాక్సీ A33 5G స్మార్ట్‌ఫోన్లు నేడు భారతదేశంలో గెలాక్సీ A సిరీస్‌ విభాగంలో గ్రాండ్ గా లాంచ్ చేయబడ్డాయి. సామ్ సంగ్ గెలాక్సీ A73 5G ఫోన్ 108-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా మరియు 120Hz సూపర్ AMOLED+ డిస్‌ప్లే ఫీచర్లతో వస్తుంది. గెలాక్సీ A33 5G ఈ నెల ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించబడింది. క్వాడ్ రియర్ కెమెరా, 90Hz AMOLED డిస్ప్లే మరియు స్టీరియో స్పీకర్ల టాప్ ఫీచర్లను కలిగి ఉంది. గెలాక్సీ A33 5G మరియు గెలాక్సీ A73 5G రెండూ IP67-రేటెడ్ బిల్డ్‌ను కలిగి ఉండి దుమ్ము మరియు నీటి నిరోధకతను కలిగి ఉన్నాయి. సామ్ సంగ్ గెలాక్సీ A73 5G స్మార్ట్‌ఫోన్‌ గ్రే, మింట్ మరియు వైట్ కలర్లలో మరియు సామ్ సంగ్ గెలాక్సీ A33 5G ఫోన్ బ్లాక్, బ్లూ, పీచ్ మరియు వైట్ కలర్ లలో అందుబాటులో ఉంటుంది. గెలాక్సీ A73 5G రాబోయే రోజుల్లో Samsung.com, ప్రముఖ రిటైల్ స్టోర్‌లు మరియు ఎంపిక చేసిన ఆన్‌లైన్ పోర్టల్‌ల ద్వారా ప్రీ-బుకింగ్‌ల కోసం అందుబాటులో ఉంటుంది అని కంపెనీ తెలిపింది. ఇది 8GB RAM + 128GB స్టోరేజ్ మరియు 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వంటి రెండు విభిన్న వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అయితే ఫోన్ యొక్క ఖచ్చితమైన లభ్యత మరియు ధర ఇంకా వెల్లడి కాలేదు. భారతదేశంలో Samsung Galaxy A33 5G ధర మరియు లభ్యత ఇంకా ప్రకటించబడలేదు. Samsung Galaxy A73 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12లో వన్ UI 4.1తో నడుస్తుంది మరియు నాలుగు సంవత్సరాల వరకు ఆండ్రాయిడ్ OS అప్‌గ్రేడ్‌లు అలాగే ఐదేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందుకోవచ్చని వాగ్దానం చేయబడింది. ఇది 6.7-అంగుళాల పూర్తి-HD+ ఇన్ఫినిటీ-O సూపర్ AMOLED+ డిస్‌ప్లేను కలిగి ఉంది, ఇది 800 nits గరిష్ట ప్రకాశం మరియు 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్యానెల్ ద్వారా కూడా రక్షించబడింది. హుడ్ కింద, Galaxy A73 5G ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778G SoCని కలిగి ఉంది, ఇది గరిష్టంగా 8GB RAMతో జత చేయబడింది. ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌ని ఉపయోగించి దాని అంతర్నిర్మిత ర్యామ్‌ను 16GB వరకు విస్తరించే RAM ప్లస్ ఫీచర్‌తో ఫోన్ కూడా వస్తుంది. ఫోటోలు మరియు వీడియోల కోసం ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) మద్దతుకు మద్దతు ఇచ్చే 108-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్‌తో వస్తుంది. వెనుక కెమెరా చిత్రాల నుండి వస్తువులను తీసివేయడానికి ఆబ్జెక్ట్ ఎరేజర్, పాత ఫోటోలను రీటచ్ చేయడానికి AI ఫోటో రీమాస్టర్ మరియు మెరుగుపరచబడిన ప్రొఫైల్ ఫోటోల కోసం పోర్ట్రెయిట్ మోడ్‌తో సహా ఫీచర్లకు కూడా మద్దతు ఇస్తుంది. వెనుక కెమెరా సెన్సార్ల ఖచ్చితమైన గణన ఇంకా వెల్లడి కాలేదు. అలాగే ముందు భాగంలో 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కూడా అందించింది. కంటెంట్ స్టోరేజ్ పరంగా, Samsung Galaxy A73 5G మైక్రో SD కార్డ్ (1TB వరకు) ద్వారా విస్తరణకు మద్దతు ఇచ్చే 256GB వరకు ఆన్‌బోర్డ్ నిల్వతో వస్తుంది. Samsung Galaxy A73 5G స్టీరియో స్పీకర్‌లతో వస్తుంది మరియు 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. అయితే ఇది మద్దతు ఉన్న ఛార్జర్‌తో బండిల్ చేయబడదు. Samsung Galaxy A33 5G స్మార్ట్‌ఫోన్ 6.4-అంగుళాల పూర్తి HD + సూపర్ AMOLED ఇన్ఫినిటీ U డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఇది ఆక్టా-కోర్ SoC ప్రాసెసర్‌తో ఆధారితమైనది మరియు Android 12 ఆధారిత One UI 4.1తో వస్తుంది. ఇది 8GB RAM మరియు 256GB ఇంటర్-స్టోరేజ్ కెపాసిటీని కలిగి ఉంది. ఇంకా, మైక్రో SD కార్డ్ ద్వారా నిల్వ సామర్థ్యాన్ని 1TB వరకు పొడిగించవచ్చు. ఫోన్‌లో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇది ప్రధాన కెమెరా 48-మెగాపిక్సెల్ సెన్సార్, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్‌తో రెండవ కెమెరా, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో మూడవ కెమెరా మరియు 5-మెగాపిక్సెల్ మాక్రో షూటర్‌తో నాల్గవ కెమెరా. ఇందులో 13 మెగాపిక్సెల్ సెన్సార్ సామర్థ్యం ఉన్న సెల్ఫీ కెమెరా సెన్సార్ ఉంది. ఇది 5,000mAh కెపాసిటీ బ్యాటరీని కూడా కలిగి ఉంది.

గర్ల్ ఫ్రెండ్ లొకేషన్ ట్రాక్ చేస్తున్న బాయ్‌ఫ్రెండ్ అరెస్ట్ !


అమెరికాలోని టేనస్సీలోని నాష్‌విల్లేలో తన గర్ల్ ఫ్రెండ్ లొకేషన్ ట్రాక్ చేసేందుకు లారెన్స్ వెల్చ్ ఆపిల్ వాచ్ వినియోగించాడు. ఆపిల్ వాచ్ లో ఇన్ స్టాల్ చేసిన థర్డ్ పార్టీ యాప్ ద్వారా తన ప్రియురాలు ఎక్కడ ఉంటుందో ప్రతిరోజూ ట్రాక్ చేస్తున్నాడు. ఈ విషయం తెలిసిన ప్రియురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతన్ని అరెస్ట్ చేశారు. ఆపిల్ వాచ్‌లో Life 360 Location Tracker అనే థర్డ్ పార్టీ ఫీచర్ ఇందుకోసం వినియోగించాడు. ఈ యాప్ ద్వారా ఆపిల్ వాచ్ ధరించిన వ్యక్తి ఎక్కడ ఉన్నా లొకేషన్ ట్రాక్ చేయొచ్చు. ఇలాంటి ఆధునాతన టెక్నాలజీని మోసపూరిత చర్యలకు అధికంగా వినియోగిస్తున్నారు. లారెన్స్ వెల్చ్ (29) ఏళ్ల యవకుడు కూడా ఆపిల్ వాచ్‌లో Life 360 ట్రాకింగ్ యాప్ సాయంతో తన గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ ఉందో ట్రాక్ చేసినందుకు అరెస్ట్ అయ్యాడు. తన ప్రియురాలి లొకేషన్ ట్రాక్ చేసేందుకు లారెన్స్ వెల్చ్ ఆపిల్ వాచ్ లోని Life 360 Tracking Feature వినియోగించాడు. ఆపిల్ వాచ్ గర్ల్ ఫ్రెండ్ వాడే కారు చక్రానికి అటాచ్ చేశాడు. అలా ఆమె ప్రతి రోజు ఎక్కడికి వెళ్తుందో ట్రాక్ చేస్తూ వచ్చాడు. చివరికి ఆ విషయం ఆమెకు తెలియడంతో పోలీసులను ఆశ్రయించింది. అంతేకాదు… తన ప్రియుడు తనను చంపేస్తానని పలుమార్లు బెదిరించినట్టు కూడా పోలీసులకు ఫిర్యాదుచేసింది. తాను ఎక్కడికి వెళ్లిందో లొకేషన్ షేర్ చేయమని తనను వేధించేవాడని వాపోయింది. తనకు అనుమానం వచ్చి ట్రాకింగ్ ఆఫ్ చేసినప్పుడు.. తన లొకేషన్ చెప్పమంటూ మెసేజ్ లు పంపేవాడని, అసభ్య పదజాలతో దూషించేవాడని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు లారెన్స్ వెల్చ్‌ను అరెస్ట్ చేశారు. అంతకుముందు.. అతడు కారు చక్రానికి అటాచ్ చేసిన ఆపిల్ వాచ్ తొలగించేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన పోలీసులు ఆపిల్ వాచ్‌ను గుర్తించారు. ఈ వాచ్ ఎవరిదని పోలీసులు ప్రశ్నించగా తనదేనని వెల్చ్ అన్నాడు. వెల్చ్.. Life360 అనే యాప్ ద్వారా ప్రియురాలిని ట్రాక్ చేసినట్టు తెలిపాడు. బాధితురాలు తన Life360 యాప్‌ను ఆఫ్ చేసినప్పుడు.. వెల్చ్ తన వెర్షన్‌ను Apple వాచ్‌లో యాక్టివ్‌గా ఉంచాడు. దాంతో ఆమె యాప్ యాక్టివేట్ చేయనప్పుడు కూడా ప్రియురాలు లొకేషన్‌ను ట్రాక్ చేయడానికి ఈ యాప్‌ ఉపయోగించాడు. గతంలోనూ ఆపిల్ కంపెనీకి Airtags కు సంబంధించి అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఇటీవలే ఆపిల్ ఎయిర్ ట్యాగ్ ల కోసం యాంటీ స్టాకింగ్ ఫీచర్ రిలీజ్ చేసింది. అయితే, ఆపిల్ ఈ ఎయిర్ ట్యాగ్ ట్రాకింగ్ లపై లిమిట్ తగ్గించాలని భావిస్తోంది.

ఏప్రిల్ 1 నుండి ధరలు పెంచిన కార్ల కంపెనీలు !


జర్మనీ  కి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎమ్‌డబ్ల్యూ తన అన్ని కార్​ మోడళ్లపై ఏకంగా 3.5 శాతం మేర ధరల పెంపును ప్రకటించింది. ఏప్రిల్ 1 నుండి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని తెలిపింది. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులు, పెరిగిన మెటీరియల్, లాజిస్టిక్స్ ఖర్చులను దృష్టిలో పెట్టుకొని ధరలు పెంచుతున్నట్లు తెలిపింది. ఇదే క్రమంలో మరో లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ ఇండియా కూడా కార్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్​ నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయని తెలిపింది. మెర్సిడెస్​ బెంజ్​ ఇండియా తన అన్ని మోడళ్లపై 3 శాతం ధర పెంపును ప్రకటించింది. లాజిస్టిక్స్​ రేట్ల పెరుగుదలతో పాటు ఇన్‌పుట్ ఖర్చుల పెరుగుదల కారణంగా అన్ని కారు​ మోడళ్లపై ధర పెంచుతున్నట్లు ప్రకటించింది. మరోవైపు, జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి సైతం భారతదేశం  లో తన అన్ని మోడళ్లపై 3% వరకు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చుల కారణంగా ధరల పెంపు అనివార్యత ఏర్పడిందని పేర్కొంది. ఈ కొత్త రేట్లు ఏప్రిల్ 01, 2022 నుండి అమలులోకి వస్తాయని తెలిపింది. ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ మాట్లాడుతూ, "భారత్​ మాకు గణనీయమైన మార్కెట్ గల దేశం. ఇక్కడ​ మేము స్థిరమైన వ్యాపార నమూనాను నిర్వహించడానికి కట్టుబడి ఉన్నాము. అయితే, పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, మారుతున్న ఫారెక్స్ రేట్ల కారణంగా మా అన్ని మోడళ్లపై 3% వరకు ధరలను పెంచాలని నిర్ణయించాం."అని తెలిపింది. ఆడి ఇండియా ప్రస్తుత లైనప్‌లో ఉన్న ఆడి A4, ఆడి A6, ఆడి A8 L, ఆడి Q2, ఆడి Q5 మోడళ్లతో పాటు ఇటీవల ప్రారంభించిన ఆడి Q7, ఆడి Q8, ఆడి S5 స్పోర్ట్‌బ్యాక్, ఆడి ఆర్​ఎస్​ 5 స్పోర్ట్‌బ్యాక్, ఆడి ఆర్​ఎస్​ 7 స్పోర్ట్‌బ్యాక్, అద్భుతమైన ఆడి ఆర్​ఎస్​ Q8 మోడళ్లపై ధరల పెంపును ప్రకటించింది. మరోవైపు, భారతీయ ఆటోమొబైల్​ దిగ్గజం టాటా మోటార్స్ సైతం తన వాణిజ్య వాహనాల ధరలను పెంచింది. కొన్ని పాపులర్​ మోడళ్లపై 2 నుంచి -2.5% ధర పెంపును ప్రకటించింది. వ్యక్తిగత మోడల్, వేరియంట్ ఆధారంగా 1 ఏప్రిల్ 2022 నుండి ఈ కొత్త రేట్లు అమలులోకి వస్తాయని తెలిపింది. ఉక్కు, అల్యూమినియం,యు ఇతర విలువైన లోహాల వంటి వస్తువుల ధరల పెరుగుదల, ఇతర ముడి పదార్థాల అధిక ధరల కారణంగా వాణిజ్య వాహనాల ధరల పెంపును అనివార్యత ఏర్పడింది. మొత్తం ఇన్‌పుట్ ఖర్చులు బాగా పెరగడం వలన ధరలు పెంచామని టాటా మోటార్స్ ప్రకటించింది.

ఇంటెల్ కోర్-i9 -12900KS డెస్క్‌టాప్ ప్రాసెసర్


ప్రముఖ చిప్ మేకర్ ఇంటెల్ ఎట్టకేలకు తన కొత్త 12వ జెన్ ఇంటెల్ కోర్ i9-12900KS గురించి వివరాలను వెల్లడించింది. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన డెస్క్‌టాప్ ప్రాసెసర్ అని పేర్కొంది. ఈ చిప్ మేకర్ కొత్త SoC యొక్క స్పెసిఫికేషన్స్ మరియు లభ్యత వివరాలను కూడా ప్రకటించింది. ఇది 5.5 GHz గరిష్ట టర్బో ఫ్రీక్వెన్సీని అందిస్తుంది. అలాగే ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ లలో ఇంటెల్ థర్మల్ వెలాసిటీ బూస్ట్ మరియు ఇంటెల్ అడాప్టివ్ బూస్ట్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంటెల్ సంస్థ కొత్తగా తయారుచేసిన 12వ జెన్ ఇంటెల్ కోర్ i9-12900KS ప్రాసెసర్ కస్టమర్లకు $739 (దాదాపు రూ.56,200) సిఫార్సు చేసిన ధర వద్ద అందుబాటులోకి రానున్నది. ఈ ప్రాసెసర్ ఏప్రిల్ 5 నుండి అందుబాటులోకి రానున్నది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న రిటైలర్‌ల వద్ద బాక్స్‌డ్ ప్రాసెసర్‌గా అందుబాటులోకి రానున్నదని మరియు ఇంటెల్ ఛానెల్ మరియు OEM భాగస్వాముల నుండి సిస్టమ్‌లలో విలీనం చేయబడిందని కంపెనీ పేర్కొంది. అన్‌లాక్ చేయబడిన i9-12900KS ప్రాసెసర్ "వేగవంతమైన ప్రాసెసర్ అందుబాటులో ఉండాలనుకునే" గేమర్‌ల కోసం నిర్మించబడిందని ఇంటెల్ పేర్కొంది. SoC 16 కోర్లు మరియు 24 థ్రెడ్‌లు మరియు 5.5 GHz గరిష్ట టర్బో ఫ్రీక్వెన్సీ, 150W ప్రాసెసర్ బేస్ పవర్ మరియు 30MB ఇంటెల్ స్మార్ట్ కాష్‌తో మరింత ఎక్కువ గేమింగ్ పవర్ మరియు పనితీరు కోసం వస్తుంది.

పాస్‌పోర్టు ఉంటే ఎన్ఆర్ఐలు కూడా ఆధార్‌ కార్డు పొందవచ్చు!


సాధారణ భారతీయ పౌరుల మాదిరిగానే ఎన్ఆర్ఐలు కూడా ఆధార్ కార్డును పొందవచ్చని కేంద్రం తెలిసింది. ఆగస్టు 2021 వరకు ఎన్ఆర్ఐలు ఆధార్ కార్డు పొందాంటే 182 రోజుల సమయం పట్టేది. కానీ ప్రస్తుత పరిస్థితిలో ఆ సమయ వ్యవధిని తొలగించింది. ఆధార్‌ కార్డు పొందేందుకు ఆధార్‌ సెంటర్‌కు వెళ్లాలి. ఈ కార్డు కోసం వారి వద్ద తప్పనిసరిగా భారతీయ పాస్‌పోర్టు ఉండాలి. ఆధార్‌ సెంటర్‌లో నింపే దరఖాస్తులు పూర్తి వివరాలు నమోదు చేయాలి. అలాగే దరఖాస్తులు ఇమెయిల్‌ తప్పనిసరిగ్గా ఉండాలి. అయితే భారతీయ పౌరుల దరఖాస్తుతో పోల్చితే ఎన్‌ఆర్‌ఐల దరఖాస్తు కొంత భిన్నంగా ఉంటుంది. పాస్‌పోర్టు ఫోటో కాఫీని ఈ దరఖాస్తుతో పాటు సమర్పించాల్సి ఉంటుంది. ఇతర అవసరమైన డాక్యుమెంట్లను ఇవ్వాలి. పూర్తి వివరాలు నింపిన తర్వాత బయోమెట్రిక్‌ సమాచారాన్ని క్యాప్చర్‌ చేస్తారు. దరఖాస్తులో ఇచ్చిన సమాచారమంతా కంప్యూటర్‌లో నమదు చేస్తారు. తర్వాత మీకు రిజిస్ట్రేషన్‌ స్లిప్‌ ఇస్తారు. దీనిలో 14 అంకెల ఎన్‌రోల్‌మెంట్‌ ఐడీ, తేదీ, సమయం అన్ని రికార్డు అయి ఉంటాయి. ఆధార్‌ పొందాలంటే భారత మొబైల్‌ నెంబర్‌ తప్పనిసరిగ్గా ఉండాలి. ఆధార్‌ కార్డుకు ఇంటర్నేషనల్‌ మొబైల్‌ నెంబర్లను అనుమతించరు. అలాగే ఎన్‌ఆర్‌ఐ పిల్లలకు ఆధార్‌ కావాలంటే వారి భారత పాస్‌పోర్టును సమర్పించాలి. ఒక వేళ పిల్లలకు ఇండియా పాస్‌పోర్టు లేకపోతే తల్లిదండ్రులు తమ సంబంధం తెలుపుతూ డాక్యుమెంట్లను సమర్పించాలి. తల్లిదండ్రుల్లో ఒకరు అప్రూవల్‌ ఇవ్వాల్సి ఉంటుంది.

Monday, March 28, 2022

జియో నుంచి అన్‌లిమిటెడ్ డేటా, వాయిస్ కాల్స్‌


రిలయెన్స్ జియో నుంచి సరికొత్త రీచార్జ్ ప్లాన్ ప్రారంభం అయింది. దీనికి జియో క్యాలెండర్ మంత్ వాలిడిటీ అనే పేరు పెట్టింది. రూ.259 చెల్లిస్తే ఈ రీచార్జ్ ప్లాన్ ప్రకారం సరిగ్గా నెల రోజుల పాటు అంటే క్యాలెండర్ నెల వరకు అన్‌లిమిటెడ్ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌ను అందిస్తున్నారు. సాధారణంగా జియోలో రీచార్జ్ ప్లాన్స్ 28 రోజులకే ఉంటాయి. కానీ.. రూ.259తో క్యాలెండర్ నెలలో ఉండే రోజులకు ఈ ప్లాన్‌ను వర్తింపజేస్తారన్నమాట. ఉదాహరణకు ఏప్రిల్ 5న రూ.259తో రీచార్జ్ చేసుకుంటే.. మే 5 వరకు వాలిడిటీ ఉంటుంది. మే 5న మళ్లీ చేసుకుంటే.. జూన్ 5 వరకు ఉంటుంది. రోజుకు 1.5 జీబీ డేటా, అల్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, జియో యాప్స్‌కు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్స్ చేసుకోవచ్చు. రూ.259 ప్లాన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే.. ప్రతి నెల ఒకే రోజు యూజర్లు రీచార్జ్ చేసుకునేలా ఈ ప్లాన్‌ను జియో తీసుకొచ్చింది. ఒకసారి ఈ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే.. ప్రతి నెల ఆ ప్లాన్ ఆటోమెటిక్‌గా రెన్యువల్ అవుతుంది. గత వారం జియో.. రూ.555, రూ.2999 ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్స్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్లాన్స్‌తో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను జియో ఉచితంగా అందిస్తోంది.


సింగిల్ ఛార్జ్‌తో 499 కిలోమీటర్లు


ఓ వైపు ఇంధన ధరల పెంపు, మరోవైపు పర్యావరణ కాలుష్యం కారణంగా ఎలక్ట్రిక్​ వాహనాలకు డిమాండ్​ పెరిగింది. దీంతో, ప్రముఖ కార్ల తయారీ సంస్థలు ఎలక్ట్రిక్​ వాహనాల తయారీపై దృష్టి పెడుతున్నాయి. ఇప్పటికే అనేక కార్ల తయారీ సంస్థలు ఎలక్ట్రిక్​ మార్కెట్​లోకి అడుగు పెట్టాయి. దీంతో, దక్షిణ కొరియా కియా మోటార్స్​ అతి త్వరలోనే తన తొలి ఎలక్ట్రిక్ వాహనాన్ని విడుదల చేసేందుకు సిద్దమవుతోంది. ప్రస్తుత సమాచారం ప్రకారం, ఈ సంవత్సరం భారతదేశంలో కియా మోటార్స్​ తన EV6 ఎలక్ట్రిక్ క్రాస్‌ ఓవర్‌ను విడుదల చేయనుంది. జూన్ 2022 మొదటి వారంలో ఈ వాహనం భారత మార్కెట్​లోకి వచ్చే అవకాశం ఉంది. కియా ఈవీ6 ఎలక్ట్రిక్​ కారును 2021లో సంస్థ ప్రకటించింది. ఇది కియాకు చెందిన మొదటి ఎలక్ట్రిక్ కారు. ఎలక్ట్రిక్​ వాహనాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఎలక్ట్రిక్-గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి పనిచేస్తుంది. కంపెనీ చాలా సంవత్సరాలుగా సోల్, నిరో వంటి ఆల్-ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తుంది. అయితే, ఇవి భారత్​లో ఇంకా అందుబాటులోకి రాలేదు. కాగా, భారత మార్కెట్​లోకి వచ్చే మొదటి కియా ఎలక్ట్రిక్​ కారు EV6 కావడం విశేషం. అయితే, కియా ఈవీ6 ఫ్లాగ్​షిప్​ లైనప్‌లోనే లభించే అవకాశం ఉంది. ఇది అత్యంత ఖరీదైనదిగా మార్కెట్​లోకి రానుంది. అయినప్పటికీ, దీనికి మంచి డిమాండ్ లభించే అవకాశం ఉందని ఆటో రంగానికి చెందిన నిపుణులు​ చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా EV6 మొత్తం రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. 58 kWh బ్యాటరీ ప్యాక్, 77.4 kWh బ్యాటరీ ప్యాక్ -ఆప్షన్లలో లభిస్తుంది. తొలుత కియా EV6 కేవలం 77.4 kWh బ్యాటరీ ప్యాక్‌తో రిలీజయ్యే అవకాశం ఉంది. ఈ బ్యాటరీ 222 bhp, 350 Nm మోటారుతో వస్తుంది. సింగిల్ ఛార్జ్‌తో 499 కిమీల దదూరం ప్రయాణిస్తుంది. కియా EV6 TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌కు ఆనుకుని పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో అందుబాటులోకి వస్తుంది. అయితే.. సెంటర్ కన్సోల్, డ్యాష్‌బోర్డ్ ఈవీ లోపల స్పష్టమైన అప్పీల్ కోసం కొన్ని ఫిజికల్ స్విచ్‌లను అందించింది. ఈవీ6లో ఆగ్మెంటెడ్ రియాలిటీ హెడ్-అప్ డిస్‌ప్లే, ఎల్​ఈడీ లైటింగ్, హీటెడ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆన్‌బోర్డ్ పవర్ జనరేటర్ వంటి అదిరిపోయే ఫీచర్లను ఉండనున్నాయి.

రూ.1.45 లక్షలకే బ్యాటరీ కారు


హర్యానా రాష్ట్రానికి చెందిన గ్రీన్ మాస్టర్స్ అనే ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఈ వింటేజ్ ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తోంది. చాలా సింపుల్‌గా కనిపించే ఈ ఎలక్ట్రిక్ వాహనాలు అంతే సింపుల్ ఫీచర్లను కలిగి ఉంటాయి. వీటిని రోడ్లపై నడపడానికి రిజిస్ట్రేషన్, లైసెన్స్ వంటివి అవసరం లేదు. వీటి గరిష్ట వేగం గంటకు 45 కిలోమీటర్లు మాత్రమే. అయితే, ఈ ఎలక్ట్రిక్ వాహనాలను హైవేపై నడపటానికి అనుమతి లేదు. కేవలం సిటీ రోడ్లపై అర్బన్/రూరల్ రోడ్లపై వినియోగించుకోవచ్చు. గ్రీన్ మాస్టర్స్ ఈ ఎలక్ట్రిక్ వాహన తయారీలో మనకు బాగా పరిచయం ఉన్న మారుతి సుజుకి ఆల్టో 800 మరియు రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ మోటార్‌ సైకిళ్లలో వాడే అనేక భాగాలను ఉపయోగించారు. ఈ కారు యొక్క తాళం చెవి, సైడ్ మిర్రర్స్, వీల్స్ వంటి వాటిని రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌ సైకిళ్లలో కూడా మనం గమనించవచ్చు. అలాగే, డ్రైవ్‌ట్రైన్ లోని కొన్ని కీలక భాగాలను ఆల్టో కార్లలో ఉపయోగించే పరికరాల నుండి సేకరించారు. కాబట్టి, కారును కొన్న తర్వాత విడిభాగాలకు సంబంధించి ఏదైనా సమస్య వచ్చినా చింతించాల్సిన అవసరం లేదు. గ్రీన్ మాస్టర్స్ అందిస్తున్న ఈ క్లాసిక్ ఎలక్ట్రిక్ కారు ధరలు రూ.1.45 లక్షల నుండి ప్రారంభం అవుతాయి. వీటికి రిజిస్ట్రేషన్, లైసెన్స్ వంటివి అవసరం లేవు కాబట్టి, కస్టమర్లు జిఎస్‌టి మాత్రం చెల్లిస్తే సరిపోతుంది. అయితే, షిప్పింగ్ చార్జీలు అదనంగా ఉంటాయి. ఖచ్చితమైన షిప్పింగ్ చార్జీల కోసం కంపెనీని సంప్రదించాల్సి ఉంటుంది. ఇందులోని బేస్ మోడల్ 2-సీటర్ వేరియంట్ రూపంలో వస్తుంది. ఇది మెరూన్ మరియు గ్రే కలర్లలో అందుబాటులో ఉంటుంది. ఈ బేస్ వేరియంట్ పూర్తి చార్జ్ పై గరిష్టంగా 50-60 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇందులో లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, దీనిని పూర్తిగా చార్జ్ చేయడానికి కనీసం 4-5 గంటల సమయం పడుతుంది. ఈ బ్యాటరీ ప్యాక్ పై కంపెనీ 1 ఏడాది వారంటీని అందిస్తుంది. దీని టాప్-స్పీడ్ గంటకు 40-45 కిలోమీటర్లుగా ఉంటుంది. ఇందులో స్పోక్ వీల్స్ లభిస్తాయి, కానీ స్పేర్ టైర్ లభించదు. ఇది 2.74 మీ పొడవు, 1.37 మీ ఎత్తు, 450 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్, 200 కేజీల బరువు మరియు 70 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉంటుంది. గ్రీన్ మాస్టర్స్ ఈ 2-సీటర్ మోడల్‌లో ఓ టాప్-ఎండ్ వేరియంట్‌ను కూడా విక్రయిస్తోంది. దీని ధర రూ.2.45 లక్షలుగా ఉంటుంది. పెరిగిన ధరకు తగినట్లుగా ఇందులో అదనపు ఫీచర్లు కూడా లభిస్తాయి. ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 90-100 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. పెరిగిన రేంజ్‌కు తగినట్లుగా ఇందులో పెద్ద లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీని చార్జింగ్ సమయం కూడా 4-5 గంటలు పడుతుంది. కాకపోతే, కంపెనీ ఈ బ్యాటరీ ప్యాక్‌పై గరిష్టంగా మూడేళ్ల వారంటీని అందిస్తుంది. ఇది ఆరు రంగులో లభిస్తుంది. గ్రీన్ మాస్టర్స్ తమ వింటేజ్ ఎలక్ట్రిక్ వాహన శ్రేణిలో ఓ 4-సీటర్ మోడల్ ను కూడా అందిస్తుంది. ఇందులో వెనుక భాగంలో స్టోరేజ్ స్పేస్ స్థానంలో రియర్ ఫేసింగ్ బెంచ్ సీట్ ఉంటుంది. ఇది కూడా పూర్తి చార్జ్ పై గరిష్టంగా 90 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుంది. అధిక సీటింగ్ సామర్థ్యం కారణంగా, కంపెనీ ఇందులో మరింత శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటారును ఉపయోగిస్తుంది. ఈ బ్యాటరీ ప్యాక్‌పై గరిష్టంగా మూడేళ్ల వారంటీని అందిస్తుంది. ఇది కూడా ఆరు రంగులో లభిస్తుంది. ఇందులో స్టైలిష్ అల్లాయ్ వీల్స్, ప్రీమియం లెథరెట్ అప్‌హోలెస్ట్రీతో కూడిన సీట్లు కూడా ఉంటాయి. గ్రీన్ మాస్టర్స్ ప్రోడక్ట్ లైనప్‌లో చివరిది యూటివి మోడల్. చూడటానికి ఆల్-టెర్రైన్ వెహికల్ కనిపించే ఈ ఎలక్ట్రిక్ వాహనం ఓ ఫన్ టూ రైడ్ యూటివిగా ఉంటుంది. దీని ధర 4-సీటర్ వింటేజ్ కారు ధరతో సమానంగా ఉంటుంది. అల్లాయ్ వీల్స్, స్పోర్టీ సీట్లు, డైమండ్ ప్యాటర్న్ సైడ్ మిర్రర్స్, మెటల్ కేజ్ బాడీ వంటి ఫీచర్లు దీని సొంతం. ఇందులో కూడా లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ను ఉపయోగించారు. ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 100 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుంది. పైన తెలిపిన అన్ని మోడళ్ల టాప్ స్పీడ్ కూడా గరిష్టంగా గంటకు 40-45 కిమీ ఉంటుంది. మరిన్ని వివరాల కోసం గ్రీన్ మాస్టర్స్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

రైతుల కోసం పోర్టబుల్ కోల్డ్ స్టోరేజ్!


దేశంలో టెక్నాలజీని వాడుకోని ప్రొడక్షన్ పెంచడం సులువుగా మారింది. కానీ పంటని నిల్వచేయడం మాత్రం పెద్ద సవాలుగా మారింది. ఈ క్రమంలో రైతులు పండించిన పంటను తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తోంది.ఇక ఒక్కోసారి అయితే నిల్వ చేయాడానికి సరైన మార్గం లేక పంట మొత్తం కూడా నాశనమవుతోంది. ఈ సమస్య చిన్న ఇంకా అలాగే సన్నకారు రైతులు చాలా తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. కానీ ఇప్పుడు అలాంటి రైతులందరూ కూడా తక్కువ ఖర్చుతో తమ పంటలను నిల్వ చేసుకునే ఛాన్స్ వచ్చింది. ఇది పోర్టబుల్ సోలార్ కోల్డ్ స్టోరేజీతో ఇది సాధ్యమవుతుంది. గోవింద్ బల్లభ్ పంత్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ  పంత్‌నగర్‌లో గురువారం నుంచి నాలుగు రోజుల పాటు కిసాన్ మేళా కండక్ట్ చేస్తుంది. ఇందులో భాగంగా పోర్టబుల్ సోలార్ కోల్డ్ స్టోరేజీని పెర్ఫార్మ్ చేశారు.ఈ టెక్నాలజీ రైతులకు బాగా నచ్చింది. యూనివర్శిటీ డీన్ అయిన డాక్టర్ అలకనంద అశోక్, ప్రొఫెసర్ డాక్టర్ ఆర్ ఎన్ పటారియా మాట్లాడుతూ.. చిన్న ఇంకా అలాగే సన్నకారు రైతుల కోసం దీనిని అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడిన సోలార్ సిస్టమ్ ఆధారిత పోర్టబుల్ కోల్డ్ స్టోరేజీ అని ఇంకా అలాగే ఇది సౌరశక్తితో పాటు నేచురల్ నైట్ కూలింగ్ సిస్టమ్ టెక్నాలజీ ద్వారా కూడా పనిచేస్తుందని చెప్పారు. దీన్ని నడపడానికి విద్యుత్ కూడా అవసరం లేదన్నారు.పోర్టబుల్ కోల్డ్ స్టోరేజీలో రైతులు పుట్టగొడుగులు, పండ్లు ఇంకా అలాగే కూరగాయలు వంటి పంటలను ఎక్కువ కాలం భద్రపరుచుకోవచ్చని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఈ కోల్డ్ స్టోరేజీని 8 అడుగుల వెడల్పు ఇంకా అలాగే 8 అడుగుల పొడవు ఉన్న స్థలంలో సులభంగా అమర్చవచ్చని పేర్కొన్నారు. ఇది చాలా తేలికగా ఉంటుందని ఇంకా దీనిని నడపడానికి విద్యుత్తు అవసరం లేదని సూచించారు. దీనిని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చని మెట్ట ప్రాంతాల చిన్న రైతులకు ఇది చాలా ఉపయోగపడుతుందని వివరించారు. ఈ సందర్భంగా ఉల్లి ఆకులను కోయడానికి ఆనియన్ డిగ్గర్ టాపింగ్ యూనిట్ మెషిన్ గురించిన సమాచారాన్ని కూడా వారు అందించారు.

వాట్సాప్ లో 2GB మీడియా ఫైల్‌లను పంపవచ్చు?


మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం అనేక కొత్త ఫీచర్లు మరియు అప్‌డేట్‌లను విడుదల చేస్తోంది. 2GB వరకు మీడియా ఫైల్‌లను షేర్ చేసే సౌలభ్యం కల్పించే పనిలో వుంది. ప్రస్తుతానికి అర్జెంటీనా వంటి ఎంపిక చేసిన మార్కెట్‌లలోని యాప్ యొక్క బీటా వినియోగదారులు మాత్రమే ఈ ఫీచర్‌ని ఉపయోగించగలరు. ఇప్పటికే, వాట్సాప్ ప్రత్యర్థి - టెలిగ్రామ్ గత రెండు సంవత్సరాలుగా 2GB వరకు గల మీడియా ఫైల్‌లను షేర్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఈ కొత్త ఫీచర్ కోసం ఎదురుచూస్తున్న వాట్సాప్ వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పటి వరకు, వాట్సాప్ 100MB వరకు మీడియా ఫైల్‌లను మాత్రమే షేర్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. అలాగే, దాని ఫైల్-షేరింగ్ పరిమితి లేదా సంబంధిత ఫీచర్ల పెంపునకు సంబంధించి కంపెనీ నుండి ఎటువంటి అధికారిక ధృవీకరణ లేదు. ఇప్పుడు, అర్జెంటీనాకు చెందిన వాట్సాప్ బీటా టెస్టర్ 2GB వరకు మీడియా ఫైల్ షేరింగ్ పరిమితి ఉంటుందని చూపించే స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశారు.

Sunday, March 27, 2022

డీజిలాకర్‌లో డ్రైవింగ్‌ లైసెన్స్‌ను ఎలా జోడించాలి ?


డిజిటల్ ఇండియా చొరవతో భారత ప్రభుత్వం డిజిలాకర్ సౌకర్యాన్ని ప్రారంభించింది. ఇది దేశంలోని పౌరులు తమ ముఖ్యమైన డాక్యుమెంట్లను భౌతికంగా కాగితాలతో ఇబ్బంది లేకుండా డిజిటల్‌ గా సురక్షితమైన రూపంలో నిల్వ చేయడానికి అనుమతిస్తుంది. డిజిలాకర్ పత్రాలను ప్రతిచోటా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మన వద్ద ఉండే డాక్యుమెంట్లలో ఒకటి డ్రైవింగ్ లైసెన్స్ వాహనం తీసుకుని బయటకు వెళ్లామంటే ఎప్పుడు, ఎక్కడ ట్రాఫిక్‌ పోలీసులు నిలుపుతారో తెలియని పరిస్థితి. ప్రస్తుతం నిబంధనలు కఠినతరం చేయడంతో డ్రైవింగ్ లైసెన్స్‌, ఇతర పత్రాలు తప్పనిసరి ఉండాల్సి ఉంటుంది. కొన్నిసార్లు డ్రైవింగ్ లైసెన్స్ దగ్గర ఉండకపోతే భారీ చలాన్లకు దారి తీస్తుంది. డిజిలాకర్ యొక్క అధికారిక వెబ్‌సైట్ ని ఓపెన్ చేసి ఫోన్ నంబర్‌ని ఉపయోగించి సైన్ అప్ చేయండి. మీ మొబైల్‌కు వచ్చే OTP నమోదు చేయాలి. దీని తర్వాత మీరు ఖాతా కోసం వినియోగదారు పేరు, పాస్‌వర్డ్‌ను సృష్టించవచ్చు. మీరు MPINని కూడా సెట్ చేయవచ్చు. ఇది భవిష్యత్తులో లేదా మీరు మీ డాక్యుమెంట్‌లను చాలా త్వరగా సోర్స్ చేయాల్సిన కొన్ని సందర్భాల్లో ఫాస్ట్ లాగిన్‌ని సులభతరం చేస్తుంది. ఖాతాను సృష్టించిన తర్వాత మీ డిజిలాకర్ ఖాతాతో మీ ఆధార్ కార్డ్‌ని లింక్ చేయాలి. యాప్‌లోని ‘పుల్ పార్ట్‌నర్స్ డాక్యుమెంట్స్’ విభాగాన్ని యాక్సెస్ చేసి,  డ్రైవింగ్ లైసెన్స్ నంబర్‌ను నమోదు చేసుకోవచ్చు. ‘పుల్ డాక్యుమెంట్’ని ఎంచుకున్న తర్వాత, మీరు పత్రాన్ని ఎవరి ఏ విభాగంలో ఉంచాలనుకుంటున్నారో ఎంపిక చేసుకోవాలి. డాక్యుమెంట్ టైప్‌లో డ్రైవింగ్ లైసెన్స్‌ గుర్తించి దానిపై నొక్కండి. మీరు మీ పేరు, చిరునామాతో సహా అవసరమైన అన్ని వివరాలను పూరించిన తర్వాత, పత్రాన్ని సేకరించి యాప్‌లో నిల్వ చేస్తుంది. ప్రతి యాప్ వినియోగదారు వారి పత్రాలను నిల్వ చేయడానికి 1 GB స్టోరేజీ పొందుతారు. డిజిలాకర్ ద్వారా చూపించిన పత్రాలు సరైనవిగా గుర్తించాలని, ఏదైనా ప్రభుత్వ ప్రక్రియ కోసం ఉపయోగించాలని అన్ని ప్రభుత్వ శాఖలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

జెకె నుంచి పంక్చర్ గార్డ్ టైర్స్!


భారతదేశంలో టైర్ మార్కెట్‌ శరవేగంగా విస్తరిస్తుంది. మనదేశంలో ముడి రబ్బరు లభ్యత సంవృద్ధిగా ఉండటంతో ఇక్కడ తయారైన టైర్లు విదేశాలకు కూడా ఎగుమతి చేయబడుతున్నాయి. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఇప్పుడు కొత్త రకం టైర్లు కూడా మార్కెట్లోకి వస్తున్నాయి. ప్రముఖ దేశీయ టైర్ తయారీ సంస్థ జెకె టైర్ అండ్ ఇండస్ట్రీస్ సరికొత్త పంక్చర్ గార్డ్ టెక్నాలజీతో కూడిన టైర్లను మార్కెట్లో విడుదల చేసింది. జెకె టైర్ నాలుగు చక్రాల వాహనాలలో ఉపయోగించే భారతదేశపు మొట్టమొదటి పంక్చర్ గార్డ్ టైర్ ను పరిచయం చేసింది. ఈ పంక్చర్ గార్డ్ టైర్లు భారతీయ రహదారి పరిస్థితులకు అనుకూలంగా ఉండే అధిక పనితీరు గల టైర్లు అని కంపెనీ తెలిపింది. టైర్ల తయారీలో అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో పనిచేసే జెకె టైర్, మార్కెట్లో అందుబాటులో ఉన్న కొత్త తరం కార్ల కోసం ఈ పంక్చర్ గార్డ్ టైర్లతో పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. జెకె పంక్చర్ గార్డ్ టైర్ లోపలి భాగం ప్రత్యేకంగా రూపొందించబడిన సెల్ఫ్ హీలింగ్ ఎలాస్టోమర్ కోటింగ్‌తో వస్తుంది. ఈ సాంకేతికతతో టైర్ 6 మిమీ వ్యాసం కలిగిన పదునైన వస్తువుల వల్ల కలిగే పంక్చర్‌ లను దానంతట అదే ఆటోమేటిక్ గా రిపేరు చేయగలదు. ఇలా ఒకటి లేదా రెండు కాదు, ఒకేసారి అనేక పంక్చర్లను కూడా రిపేర్ చేయగలదు. అన్ని రకాల రోడ్లపై సురక్షితమైన ప్రయాణాన్ని నిర్ధారించడానికి, కంపెనీ భారతీయ ఆన్-రోడ్ మరియు ఆఫ్-రోడ్ పరిస్థితులలో ఈ పంక్చర్ గార్డ్ టైర్‌ ను పరీక్షించింది. ఈ టైర్లను మార్కెట్లో లాంచ్ చేసే సమయంలో కూడా కంపెనీ డెమోగా టైర్లను మ్యాన్యువల్ గా పంక్చర్ చేసి చూపించింది. ఆ సమయంలో టైర్లలో ఎన్ని మేకులు గుచ్చుకున్నప్పటికీ, టైర్ల నుండి గాలి మాత్రం బయటకు రాలేదు. పంక్చర్ గార్డ్ టెక్నాలజీతో కూడిన టైర్లు, సదరు టైరు యొక్క జీవితకాలం ముగిసే వరకు ఎలాంటి అవాంతరాలు లేని రైడ్‌ ను అందిస్తుందని, దీని వలన టైర్లలో కూడా గాలి కూడా తగ్గిపోదని కంపెనీ తెలిపింది. గడచిన 2020లో స్మార్ట్ టైర్ టెక్నాలజీని మరియు ఇప్పుడు పంక్చర్ గార్డ్ టైర్ టెక్నాలజీని ప్రవేశపెట్టడం ద్వారా తాము తమ కస్టమర్‌ లకు అధునాతన మొబిలిటీ సొల్యూషన్‌లను అందించాలనే నిబద్ధతకు కట్టుబడి ఉన్నామని, ఈ లేటెస్ట్ టెక్నాలజీ వాహన యజమానులకు అత్యున్నత స్థాయి భద్రత మరియు సౌకర్యాన్ని అందిస్తుందని జెకె టైర్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ రఘుపతి సింఘానియా తెలిపారు.

రూ.13 వేలలోనే ఐకూ యూ 5 ఎక్స్!


ఐకూ కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. ఈ బడ్జెట్ 4జీ స్మార్ట్ ఫోన్‌లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌ను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.5 అంగుళాల ఎల్సీడీ ప్యానెల్‌ను అందించారు. వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. చైనాలో ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 899 యువాన్లుగా (సుమారు రూ.10,700) ఉంది. ఇక 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఉన్న వేరియంట్ ధరను 1,099 యువాన్లుగా (సుమారు రూ.13,100) నిర్ణయించారు. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌ను అందించారు. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గా ఉంది. కెమెరాల విషయానికి వస్తే... ఐకూ యూ5ఎక్స్‌లో వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. పాలీ కార్బనేట్ బాడీతో ఈ స్మార్ట్ ఫోన్‌ను రూపొందించారు. పవర్ బటన్‌ను ఫోన్ కుడివైపు అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇందులోనే ఉంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో మైక్రో యూఎస్‌బీ పోర్టును అందించారు. 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఇందులో ఉంది. బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 25.8 రోజుల బ్యాటరీని ఇది అందించనుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 10 గంటల పాటు ఇందులో నాన్ స్టాప్‌గా గేమింగ్ చేయవచ్చని కంపెనీ అంటోంది.

కారు ప్రయాణం మరింత సురక్షితం !


అక్టోబర్ 1 నుండి రహదారి భద్రత కు సంబంధించిన ఈ నియమ నిబంధనలు అమలులోకి వస్తాయని రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కారీ తెలిపారు. కొత్త నిబంధనల ప్రకారం ఎయిర్‌ బ్యాగ్స్‌ల సంఖ్య పెంచడంతో కార్ల కంపెనీలు కార్ల ధరలను కూడా పెంచుతాయి. భారతదేశంలో భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించడం ముఖ్యమైనది. ఇది పెద్ద కార్లలో 6 ఎయిర్‌ బ్యాగ్‌లతో వాహనాలు ఉండనున్నాయి. ఇలా ఎయిర్‌బ్యాగ్స్‌ అన్ని సీట్లకు ఉండటం వల్ల ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఉన్నవారంత సురక్షితంగా బయటపడవచ్చు. 8 సీట్ల వాహనాల్లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి చేయాలనే ప్రతిపాదనకు ఇటీవల ఆమోదం లభించింది. అన్ని ప్యాసింజర్ వాహనాలకు కనీసం రెండు ఎయిర్‌ బ్యాగ్‌లు ఉండాలని ప్రభుత్వం ఇప్పటికే తప్పనిసరి చేసింది. డ్రైవర్‌కు ఎయిర్‌బ్యాగ్‌ తప్పనిసరి చేస్తూ జూలై 2019 నుండి అమలు చేయబడింది. అయితే జనవరి 1, 2022 నుండి ముందు సీట్లో కూర్చున్న ప్రయాణీకులకు ఇది తప్పనిసరి చేయబడింది. ఎదురెదురుగా వాహనాలు ఢీకొనడం, పక్కపక్కనే ఢీకొనడం వంటి వాటి ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రయాణికులను సురక్షితంగా ఉంచేందుకు వాహనాల్లో  కేంద్ర రవాణా శాఖ మరో నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేసింది. వెనుక సీట్లలో రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, రెండు ట్యూబ్ ఎయిర్‌బ్యాగ్‌లు ఉండటం వల్ల ప్రయాణికులందరికీ ప్రయాణం సురక్షితంగా ఉంటుంది. భారతదేశంలో కారు ప్రయాణాన్ని సురక్షితంగా మార్చే దిశగా ఇదొక ముందడుగు అని గడ్కరీ అన్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2020లో హైవేపై మొత్తం 1.16 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగగా, ఇందులో 47,984 మంది మరణించారు.

ట్విట్టర్ ప్లాట్‌ఫామ్‌కు పోటీగా ఎలన్ మస్క్ కొత్త సోషల్ మీడియా?


ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజమైన ట్విట్టర్ ప్లాట్‌ఫామ్‌కు పోటీ ఇచ్చేందుకు ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలన్ మస్క్ సిద్ధమయినట్లు తెలుస్తోంది. ప్రస్తుత సోషల్ మీడియా వేదికలపై పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన కొత్త సోషల్ మీడియాను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఇటీవల ఓ ట్వి్ట్టర్ యూజర్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విషయంపై సీరియస్‌గా ఆలోచిస్తున్నట్టు చెప్పడం వైరల్‌గా మారింది. స్వేచ్ఛ భావ వ్యక్తీకరణకు అవకాశం ఉండి, అసత్య ప్రచారాలకు ఆస్కారం లేకుండా ఉండే ఓ వేదికను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. అంతేగాక, ఎలన్ మస్క్ ఇటీవలే ట్విట్టర్‌లో ఓ పోల్ నిర్వహించారు. ప్రజాస్వామ్యానికి వాక్ స్వాతంత్ర్యం అత్యంత కీలకం అని, ట్విట్టర్ ఆ భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుతున్నదని భావిస్తున్నారా? అంటూ పోల్ పెట్టారు. అంతేకాక, కొత్తగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ నిర్మించడానికి తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు వివరించారు. ట్విట్టర్ ప్రజలకు చాలా చేరువైందని, కానీ, ప్రజాస్వామ్యానికి పునాదిగా ఉండే భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాస్తున్నదన్నారు. ఈ తరుణంలోనే ఆయన 26వ తేదీన ఒక కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అవసరం ఉన్నదా? అని అడిగారు. కొత్త ప్లాట్‌ఫామ్ నిర్మించడానికి ఎలన్ మస్క్ నిర్ణయం తీసుకున్నట్టయితే.. ఇప్పటికే ఈ రంగంలో అడుగుపెడుతున్న టెక్ కంపెనీల జాబితాలో చేరతారు. అవి కూడా ఫ్రీ స్పీచ్ ప్రధానంగా పుట్టుకొస్తున్నవే కావడం గమనార్హం. అవే కార్యరూపం దాలిస్తే.. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ యూజర్లను లాగేసుకునే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

ఏప్రిల్ 2న శాంసంగ్ గెలాక్సీ M33 5G విడుదల !


ఏప్రిల్ 2న మధ్యాహ్నం 12 గంటలకు శాంసంగ్ గెలాక్సీ M33 5G స్మార్ట్ ఫోన్  ఇండియా లో విడుదల కానున్నది. ఈ కొత్త గెలాక్సీ M33 5G స్మార్ట్ ఫోన్ ఈ-కామర్స్ దిగ్గజమైన అమెజాన్ ప్లాట్ ఫాంపై సేల్ లో అందుబాటులో ఉండనుంది. మిడ్ రేంజ్ ఆఫర్ అందిస్తున్న ఈ గెలాక్సీ M33 మోడల్ హ్యాండ్‌సెట్ 5nm ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో వస్తోంది. 25W ఛార్జింగ్‌కు సపోర్టుతో 6,000mAh బ్యాటరీని అందిస్తోంది. Samsung Galaxy M33 5G 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. శాంసంగ్ నుంచి రాబోయే ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ అందిస్తోంది. Galaxy M33 5G భారత మార్కెట్లో ఎంత ఉంటుంది అనేది వివరాలు రివీల్ చేయలేదు. కానీ, అమెజాన్ వెబ్ సైట్లో ఈ ఫోన్ విక్రయానికి సంబంధించి డేట్ మాత్రమే ధ్రువీకరించింది. ఆసక్తిగల కొనుగోలుదారులు స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చినప్పుడు నోటిఫై చేసేందుకు అమెజాన్‌లో ‘Notify Me’ అనే బటన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది. Amazon వెబ్‌సైట్ ప్రకారం.. Samsung Galaxy M33 5G ఫోన్ కిందిభాగంలో 5nm ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను అందిస్తోంది. స్మార్ట్‌ఫోన్ రెండు RAM, స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో వచ్చింది. 6GB + 128GB, 8GB + 128GB వేరియంట్లలో రానుంది. Samsung Galaxy M33 5G 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు 6,000mAh బ్యాటరీతో రానుందని అమెజాన్ లిస్టులో కనిపిస్తోంది. Samsung Galaxy M33 5G ఫోన్ కు సంబంధించి స్పెసిఫికేషన్‌లు ఈ నెల ప్రారంభంలోనే టిప్‌స్టర్ ద్వారా లీక్ అయ్యాయి. Samsung Galaxy A13, Samsung Galaxy A23, Samsung Galaxy M23 5Gలతో పాటు ప్రపంచ మార్కెట్‌లలో Samsung Galaxy M33 5G కూడా అదే ఫీచర్లు ఉన్నాయి

గూగుల్ నుండి మరో కొత్త ఫీచర్


గూగుల్ తన వినియోగదారులకు మరో  కొత్త ఫీచర్‌ను పరిచయం చేస్తోంది. ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ ద్వారా కార్డియోవాస్కులర్ హెల్త్ మరియు కంటి ఆరోగ్య సమస్యలను ట్రాక్ చేయగలుగుతారు. కొత్త ప్లాన్‌పై పని చేస్తున్నట్టు గూగుల్ ప్రకటించింది. దీనివల్ల లక్షలాది మంది ఆండ్రాయిడ్ మొబైల్ వినియోగదారులు ఇంట్లో కూర్చొని తమ యొక్క ఆరోగ్య స్థితిని తనిఖీ చేయడం సులభం అవుతుంది. స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా కంటికి సంబందించిన మరియు గుండెకు సంబందించిన ఆరోగ్య సమస్యలను తనిఖీ చేసేందుకు కొత్త పథకం అమలలోకి తీసుకొనిరానున్నది. మీరు మీ ఫోన్‌ను ఛాతీపై ఉంచినప్పుడు గుండె శబ్దాలను రికార్డ్ చేయడానికి ఇంటర్‌బిల్ట్ మైక్రోఫోన్‌లను ఉపయోగించాలని యోచిస్తున్నట్లు గూగుల్ తెలిపింది. స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా గుండె యొక్క సమస్యలను గుర్తించడానికి మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు గూగుల్ కృషి చేస్తోంది. స్టెతస్కోప్‌తో ఒకరి గుండె యొక్క సౌండ్స్ ని వినడం అనేది శారీరక పరీక్షలో కీలకమైన భాగం అని గూగుల్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది. అయినప్పటికీ గుండె సంబంధ స్టెనోసిస్ కోసం స్క్రీనింగ్‌కు స్టెతస్కోప్ లేదా అల్ట్రాసౌండ్ అలాగే వ్యక్తిగత అంచనా వంటి ప్రత్యేక సాధనాలు అవసరం. ఇందుకోసం గూగుల్ స్మార్ట్ ఫోన్ ద్వారా గుండె ఆరోగ్యాన్ని కొలిచేందుకు చూస్తోంది. స్మార్ట్‌ఫోన్‌లో మైక్రోఫోన్లు వాడుకలో ఉన్నాయని చెప్పారు. మా తాజా పరిశోధనలో భాగంగా స్మార్ట్‌ఫోన్ హృదయ స్పందన రేటును గుర్తించగలదా అని పరీక్షిస్తోంది. మేము ప్రస్తుతం క్లినికల్ స్టడీ యొక్క ప్రారంభ దశలో ఉన్నాము. కానీ మా బ్లాగ్ పోస్ట్‌లో అందుబాటులో ఉన్న ఆరోగ్య అంచనా కోసం స్మార్ట్‌ఫోన్‌ను అదనపు సాధనంగా ఉపయోగించడానికి వ్యక్తులను శక్తివంతం చేస్తుందని మేము ఆశిస్తున్నామని, అంతేకాకుండా కంటికి సంబందించిన వ్యాధులను గుర్తించడానికి స్మార్ట్‌ఫోన్ కెమెరాలను ఉపయోగించి తీసిన ఫోటోలను ఉపయోగించాలని గూగుల్ యోచిస్తోంది. మీ స్మార్ట్‌ఫోన్‌లో తీసిన ఫోటోలు డయాబెటిస్ మరియు నాన్-డయాబెటిక్ వ్యాధులను గుర్తించడంలో సహాయపడతాయా అని గూగుల్ యోచిస్తుంది. క్లినికల్ రీసెర్చ్‌లో EyePACS మరియు చాంగ్ గుంగ్ మెమోరియల్ హాస్పిటల్ వంటి భాగస్వాములతో కలిసి పని చేయాలని Google ప్లాన్ చేస్తోంది. దీని వల్ల ప్రజలు తమ వైద్యుల సహాయంతో ఇళ్లలో కూర్చొని ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందని గూగుల్ భావిస్తోంది. ప్రస్తుతం కంపెనీ AI ఆధారిత ARDA అల్గారిథమ్‌పై పరిశోధనలు జరుగుతున్నాయని గూగుల్ తన ప్రకటనలో తెలిపింది. గూగుల్ తన వినియోగదారులకు ఆరోగ్య-కేంద్రీకృత ఫీచర్లను కూడా పరిచయం చేసింది. అదేవిధంగా మీరు గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు డాక్టర్ అపాయింట్‌మెంట్ అందుబాటులో ఉంటుంది. దీని కోసం టెక్ దిగ్గజం CVS, మినిట్ క్లినిక్ మరియు ఫీచర్స్ స్టార్టప్ రోల్ కోసం మోస్ట్ అపాయింట్‌మెంట్ షెడ్యూలర్‌తో చేతులు కలిపింది. ఈ ఫీచర్‌లు రాబోయే వారాల్లో అందుబాటులోకి వస్తాయి మరియు మొదట్లో ఆంగ్లంలో మాత్రమే అందుబాటులో ఉంటాయి.

ట్రూ కాలర్ లో సరికొత్త ఫీచర్స్


ట్రూకాలర్ సరికొత్తగా మరొక నాలుగు ఫీచర్లను తీసుకువచ్చింది 

స్మార్ట్ కార్డ్ షేరింగ్: ఈ ఫీచర్ సహాయంతో మెసేజ్ లోని సమాచారాన్ని ఇతరులకు ఒక ఇమేజ్ రూపంలో మనం పంపించుకోవచ్చు.. ఇందులో స్మార్ట్ కార్డ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక ఆ తర్వాత మెసేజ్ ను సెలెక్ట్ చేస్తే చాలు ఆ టెక్స్ట్ మొత్తం ఫోటో రూపంలో మారిపోతుండటం.

అర్జెంట్ మెసేజెస్: మనం పంపించే మెసేజ్ ఏదైనా సరే అవతల వ్యక్తి చూడాలి అనుకుంటే ఈ ఫీచర్ ను ఉపయోగిస్తే సరిపోతుందట. అది ఎలాగంటే మనం పంపించిన మెసేజ్ అవతలి వ్యక్తి చూసే వరకు వారి ఫోన్ స్క్రీన్ పై నే ఇది కనిపిస్తూ ఉంటుంది.

స్మార్ట్ ఎస్ఎంఎస్ : మన ఫోన్ లో ఇన్ బాక్స్ లో వచ్చే మెసేజ్ లు... అవసరమైన వాటి కంటే ఎక్కువ మెసేజ్లు వస్తూ ఉంటాయి. దీంతో చాలా మంది ఆ మెసేజ్లు చదవడాన్ని మానేస్తుంటారు. దీంతో ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు ఈ సరికొత్త ఫ్యూచర్ ను తీసుకువచ్చారు.

ఎడిట్ చాట్ మెసేజ్: మనం అవతలి వ్యక్తికి మెసేజ్ పంపిన తర్వాత కూడా వాటిని ఎడిట్ చేసుకునే అవకాశాన్ని ఈ ఫీచర్ ను ట్రూ కాలర్ మనకు అందిస్తోంది. అయితే మనం పంపించిన వ్యక్తి కి మెసేజ్ చూసిన కూడా వీటిని ఎడిట్ చేసుకోవచ్చట.

Saturday, March 26, 2022

వన్‌ప్లస్ నుంచి మొట్ట మొదటి ప్యాడ్?


మొట్ట మొదటిసారిగా వన్‌ప్లస్ ట్యాబ్లెట్‌ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. రియల్‌మీ, ఒప్పో, వివో కంపెనీలు ఇప్పటికే తమ ట్యాబ్లెట్లను లాంచ్ చేశాయి. ప్రస్తుతం వన్‌ప్లస్ కూడా అదే బాటలో నడుస్తున్నట్లు తెలుస్తోంది. వన్‌ప్లస్ ప్యాడ్ పేరుతో ఈ ట్యాబ్లెట్ మార్కెట్లో లాంచ్ కానుందని సమాచారం. ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ దీనికి సంబంధించిన వివరాలను లీక్ చేశారు. ఈ ట్యాబ్లెట్ మాస్ ప్రొడక్షన్ కూడా యూరోపియన్ దేశాల్లో ప్రారంభం అయింది. ఈ సంవత్సరం ప్రథమార్థంలోనే ఇది లాంచ్ అయ్యే అవకాశం ఉంది. వన్‌ప్లస్ ట్యాబ్లెట్‌కు సంబంధించిన అధికారిక సమాచారాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. అయితే దీనికి సంబంధించిన వివరాలు త్వరలో బయటకు వస్తాయి. వన్‌ప్లస్ 2022 స్మార్ట్ ఫోన్ లైనప్ వివరాలు కూడా లీకయ్యాయి. వీటి ప్రకారం... వన్‌ప్లస్ 10 ప్రో ఈ నెలలో లాంచ్ కానుంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ ఏప్రిల్‌లో లాంచ్ కానుంది. వన్‌ప్లస్ నార్డ్ 2టీ ఏప్రిల్ నెలాఖరులో కానీ, మే ప్రారంభంలో కానీ లాంచ్ కానుంది.

అద్దెకు యాపిల్ డివైజ్‌లు?


యాపిల్ సంస్థ ఇప్పటికే యాపిల్ మ్యూజిక్, యాపిల్ టీవీ+, ఐక్లౌడ్+ వంటి అనేక డిజిటల్ సబ్‌స్క్రిప్షన్ సేవలను యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా కొత్తగా హార్డ్‌వేర్ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్‌ పరిచయం చేసేందుకు సిద్ధమవుతోందని ఓ లేటెస్ట్ నివేదిక వెల్లడించింది. బ్లూమ్‌బెర్గ్‌ రిపోర్ట్ ప్రకారం, యాపిల్ సంస్థ హార్డ్‌వేర్ సబ్‌స్క్రిప్షన్‌లలోకి అడుగుపెట్టాలని యోచిస్తోంది. ఆ నివేదిక ప్రకారం, యాపిల్ సంస్థ ప్రస్తుతం ఐఫోన్, ఇతర హార్డ్‌వేర్ ప్రొడక్ట్స్ కోసం ఓ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్‌పై పని చేస్తోంది. ఐఫోన్‌ను వాడాలనుకుంటే దాన్ని కొనుగోలు చేసే బదులు జస్ట్ సబ్‌స్క్రిప్షన్‌ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది.  ఐఫోన్‌ను ఒక నిర్దిష్ట సమయం వరకు లీజు లేదా రెంట్ లాగా తీసుకోవచ్చు. ఆ సమయం వరకు సబ్‌స్క్రిప్షన్‌ ఫీజు చెల్లించి తర్వాత ఐఫోన్‌ను రిటర్న్ చేస్తే సరిపోతుంది. ప్రస్తుతం యాపిల్ సబ్‌స్క్రిప్షన్ లాంటి ఐఫోన్ అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్‌ను అందుబాటులో ఉంచింది. ఇది పాత ఐఫోన్ ఇచ్చి కొత్త ఐఫోన్ సొంతం చేసుకోవడానికి 12 నెలల వ్యవధిలో నెలనెలా కొంత డబ్బులు చెల్లించడానికి అనుమతిస్తుంది. అయితే ఈ ఇన్‌స్టాల్‌మెంట్ పద్ధతి వేరు, ఇప్పుడు యాపిల్ తీసుకురావాలని అనుకుంటున్న సర్వీస్ వేరు. ఈ సర్వీసులో ఐఫోన్ ధరను విభజించి నెలకి ఇంత కట్టాలి అని కాకుండా.. జస్ట్ సబ్‌స్క్రిప్షన్ ఫీజు మాత్రమే వసూలు చేస్తారు. అయితే యాపిల్ ఒక నెలకు సబ్‌స్క్రిప్షన్ ఫీజుని ఎంతగా నిర్ణయిస్తుందో తెలియాల్సి వుంది. యూజర్లు సెలెక్ట్ చేసుకునే మోడల్ ని బట్టి నెలవారీ ఫీజు నిర్ణయించవచ్చని తెలుస్తోంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, కొత్త సబ్‌స్క్రిప్షన్ మోడల్ అందుబాటులోకి వస్తే.. ఇది ఆటోమేటిక్‌గా రికరింగ్ సేల్స్ కి అతిపెద్ద పుష్‌ ఇస్తుంది. దీనివల్ల యాపిల్ బాగా లాభపడే అవకాశం ఉంది. అంతేకాదు యూజర్లు మొదటిసారి హార్డ్‌వేర్ ప్రొడక్ట్స్ కు సబ్‌స్క్రిప్షన్ పొందేలా చేస్తుంది.

జియో T20 ధన్ ధనా ధన్ ఆఫర్ !


రిలయన్స్ జియో ఐపీఎల్ క్రికెట్ అభిమానుల కోసం ఆకర్షణీయమైన ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది ఐపీఎల్ 2022 సీజన్ సందర్భంగా రెండు సరికొత్త ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. జియో యూజర్లు ఐపీఎల్ 2022 టోర్నమెంట్‌ను ఉచితంగా చూసేందుకు వీలుగా రెండు కొత్త మొబిలిటీ ప్లాన్‌లను ప్రారంభించింది. ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ డిస్నీ+ హాట్‌స్టార్ (Disney+ Hotstar) భాగస్వామ్యంతో రూ. 555 రూ. 2999 ధరలతో సరసమైన ధరకే ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. జియో T20 ధన్ ధనా ధన్ ఆఫర్ కింద ఈ ఐపీఎల్ క్రికెట్ ప్రియులకు సరికొత్త ప్లాన్లు, రివార్డ్‌లు అఫర్ చేస్తోంది. ఈ రెండు ప్లాన్లను యాక్టివేట్ చేసుకుంటే చాలు ఎలాంటి అదనపు రీఛార్జ్ చేయకుండానే Disney+ Hotstar సబ్ స్ర్కిప్షన్ పొందవచ్చు. ఈ కొత్త రూ. 555 రూ. 2999 ప్లాన్‌లు జియో ప్రస్తుత క్రికెట్ ప్లాన్‌ల జాబితాకు యాడ్ ఆన్ ప్లాన్లుగా అందిస్తోంది. ఇప్పటి వరకూ జియో అందించే క్రికెట్ ప్లాన్ల జాబితాలోని చౌకైన ప్లాన్ ధర రూ. 499 నుంచి రూ. 3119 వరకు అందిస్తోంది. అయితే ఈ కొత్త రూ. 555, రూ. 2999 ప్లాన్‌లను గత 28 రోజులుగా ఏదైనా జియో యాక్టివ్ ప్లాన్‌లో కొనసాగుతున్న యూజర్లు మాత్రమే పొందే అవకాశం ఉంది. జియో ప్రీపెయిడ్ సబ్‌స్క్రైబర్‌లకు ఈ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. రూ. 555 జియో ప్లాన్ ప్రాథమికంగా డేటా-ఆన్ ప్లాన్ అందిస్తోంది. అంటే మీ ప్రస్తుత ప్లాన్‌‍పై అదనపు డేటాను అందిస్తుంది. ఈ యాడ్ ఆన్ ప్లాన్లపై వాయిస్ కాలింగ్ లేదా SMS బెనిఫిట్స్ పొందలేరు. జియో ఈ ప్లాన్లను ప్రధానంగా జియో ఐపీఎల్ క్రికెట్ వీక్షించే యూజర్ల కోసం ప్రవేశపెట్టింది. ఈ యాడ్ ఆన్ ప్లాన్లను పొందాలంటే ముందుగా మీరు ఇదివరకే ఏదైనా క్రికెట్ ప్లాన్ లో ఉండాలి. అప్పుడే ఈ యాడ్ ఆన్ ప్లాన్లను యాక్టివేట్ చేసుకోవచ్చు.

స్మార్ట్‌ఫోన్ కు కవర్‌ని ఉపయోగిస్తున్నారా?


ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లకు సంబంధించి బ్యాక్ కవర్, ఫ్లిప్ కవర్, హార్డ్-కేస్, బంపర్ కవర్, హోల్‌స్టర్ మొబైల్ కవర్ వంటి అనేక రకాల మొబైల్ కవర్లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ కవర్లన్నీ మొబైల్‌ను పూర్తిగా కవర్ చేస్తాయి. స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జ్‌లో ఉంచినప్పుడు, కొన్నిసార్లు అది వేడెక్కుతుండటాన్ని మీరు గమనించేవుంటారు. దానికి కవర్ ఉండటం వలన ఫోన్ వేడెక్కే అవకాశాలను పెంచుతుంది. అలాగే ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది. మీ స్మార్ట్‌ఫోన్‌లో అధిక కరెంట్ సరఫరా కారణంగా ఇలా జరుగుతుంది. ఫోన్ వేడెక్కడం వల్ల బ్యాటరీ లైఫ్ క్రమంగా తగ్గుతుంది. స్మార్ట్‌ఫోన్ సిగ్నల్ రేడియో తరంగాల ఆధారంగా పనిచేస్తుంది. ఫోన్ ఎంత ఎక్కువ కవర్ అయితే దాని కారణంగా సెల్యులార్ నెట్‌వర్క్, జీపీఎస్, బ్లూటూత్, ఎన్ఎఫ్సీ, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి రేడియో సిగ్నల్స్ బలహీనంగా మారుతాయి. దీని కారణంగా నెట్‌వర్క్ సమస్యలను ఎదుర్కోవలసిరావచ్చు. మొబైల్‌ను కవర్ లేకుండానే ఉపయోగించడం మంచిది.  డబ్బును ఆదా చేయడమే కాకుండా, పలు సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. 

దేశంలో టాప్-5 యూట్యూబర్స్ !


ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉండడం, తక్కువ ధరకే ఇంటర్నెట్ వస్తుండడంతో.. కోట్లాది జనం యూట్యూబ్‌ని వీక్షిస్తున్నారు. అందుకే యూట్యూబ్‌లో వీడియోలు చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఆ వీడియోలతో భారీగా డబ్బులు సంపాదిస్తున్నారు. కొందరికైతే ఏకంగా కోట్లల్లో ఆదాయం వస్తోంది. 

అజయ్ నాగర్: ఫరీదాబాద్‌కు చెందిన అజయ్ నాగర్‌కు క్యారిమినాటి అనే యూట్యూబ్ ఛానెల్ ఉంది. ఆయన ఛానెల్‌కు మూడున్నర కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. కేవలం 22 ఏళ్ల వయసున్న అజయ్ ఆస్తుల విలువ దాదాపు 30 కోట్ల రూపాయలు. ఈయన హాస్యనటుడు, రాపర్, గేమర్. అజయ్ నాగర్ కామెడీ వీడియోలను యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తుంటారు. ఇక తన రెండవ ఛానెల్ CarryisLiveలో గేమింగ్ లైవ్ స్ట్రీమింగ్ చేస్తాడు.

అమిత్ భదానా: అమిత్ భదానాకు 26 ఏళ్లు. యూట్యూబ్‌లో చాలా పాపులర్. అమిత్ యూట్యూబ్ ఛానెల్‌కు దాదాపు 24 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌ల ఉన్నారు.2021 గణాంకాల ప్రకారం.. అతని మొత్తం ఆస్తులు దాదాపు 48 కోట్ల రూపాయలు. అమిత్ లా చదివాడు. మొదట్లో స్నేహితులతో కలిసి వీడియోలు చేసి డబ్‌స్మాష్‌లో అప్‌లోడ్ చేసేవాడు. అలా తన యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించాడు.

ఆశిష్ చంచ్లానీ: 26 ఏళ్ల ఆశిష్ చంచ్లానీ నికర విలువ దాదాపు 30 కోట్ల రూపాయలు. ఆశిష్ చంచ్లానీ వైన్స్‌ పేరుతో యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్నాడు. ఇతడు సినిమా రివ్యూలు చెస్తాడు. ఆశిష్ 2009లో యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించాడు. అతని ఛానెల్‌కి ఇప్పుడు దాదాపు 26 మిలియన్ల మంది సభ్యులు ఉన్నారు.

నిషా మధులిక నిషా మధులిక స్వస్థలం యూపీ. ఆమె చెఫ్, రెస్టారెంట్ కన్సల్టెంట్ , యూట్యూబర్ . నిషా మధులిక యూట్యూబ్ ఛానెల్‌కు 1.25 కోట్ల మంది సభ్యులు ఉన్నారు. ఆమె మొత్తం ఆస్తులు 33 కోట్లు. నిషా మధులిక తన యూట్యూబ్ ఛానెల్‌ని 2009లో ప్రారంభించారు.

గౌరవ్ చౌదరి 'టెక్నికల్ గురూజీ' అనే యూట్యూబ్ ఛానెల్ చాలా పాపురల్. దీనిని 31 ఏళ్ల గౌరవ్ చౌదరి నడుపుతున్నారు. ఇందులో మొబైల్ రివ్యూలతో సహా టెక్నాలజీకి సంబంధించిన అన్ని ముఖ్యమైన సమాచారాన్ని అందజేస్తారు. అతని ఛానెల్‌కు ప్రస్తుతం 22 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. గౌరబ్ చౌదరి అనే మరో యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. దీనికి 5 మిలియన్ల మంది సభ్యులు ఉన్నారు. యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా ఇతడు నెలకు ఒకటిన్నర నుండి రెండు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. గౌరబ్ చౌదరి మొత్తం ఆస్తులు దాదాపు 326 కోట్లు. 

ఆధార్ కార్డ్ హిస్టరీని తనిఖీ ఎలా చేయడం ?


భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ  జారీ చేసిన ఆధార్ కార్డులో పౌరుల బయోమెట్రిక్ మరియు జనాభా సమాచారం నమోదు చేయబడి ఉంటుంది. ప్రతి భారతీయుడి బ్యాంక్ అకౌంట్ వారి ఆధార్ కార్డుతో లింక్ చేయబడినందున డబ్బు లావాదేవీలకు కూడా దీనిని ఉపయోగించవచ్చు. అయితే ఈ రోజుల్లో ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్నందున ఆధార్ దుర్వినియోగం గురించి చాలా మంది ఆందోళన చెందుతూ ఉంటారు. UIDAI వెబ్‌సైట్‌ని ద్వారా గత ఆరు నెలల్లో మీ ఆధార్ యొక్క ప్రమాణీకరణను ఎక్కడ ఉపయోగించబడిందో మీరు తనిఖీ చేయవచ్చు. వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసి ఆధార్ ప్రామాణీకరణ హిస్టరీపై క్లిక్ చేయండి. 12 అంకెల ఆధార్ నంబర్ మరియు నాలుగు అంకెల సెక్యూరిటీ కోడ్‌ను నమోదు చేయండి. జనరేట్ OTPపై క్లిక్ చేయండి. దీని తర్వాత మీ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. దానిని నమోదు చేసిన తరువాత  వెబ్‌సైట్‌లో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ప్రమాణీకరణ రకాన్ని నమోదు చేయండి. తేదీ పరిధి, రికార్డుల సంఖ్య మరియు OTPని ఎంచుకోండి. డ్రాప్-డౌన్ మెనుకి వెళ్లి ఆల్ ఆప్షన్స్ ఎంచుకోండి. ఆ తర్వాత పేజీలో తేదీ పరిధిని ఎంచుకోండి. ఇక్కడ మీరు ఆరు నెలల క్రితం సమాచారాన్ని మాత్రమే సేకరించగలరు. ఇప్పుడు సబ్మిట్ బటన్‌ను నొక్కి, అవసరమైన మొత్తం సమాచారాన్ని పూరించండి. వెంటనే మీ ఆధార్ కార్డును ఎక్కడ ఉపయోగించారనే సమాచారం మీ ముందుకు ప్రత్యక్షమవుతుంది. 

ఫ్లిప్‌కార్ట్ లో సెకండ్ హ్యాండ్ సెల్ ఫోన్స్ సేల్ !


సెల్ ఫోన్ ప్రియుల కోసం ఫ్లిప్‌కార్ట్ సరికొత్త డీల్స్ తీసుకువచ్చింది. ఎక్కువ రేటు పెట్టి ఖరీదైన కొత్త ఫోన్లను కొనుగోలుచేయలేని వినియోగదారుల కోసం సెకండ్ హ్యాండ్ సెల్ ఫోన్స్ ను అందుబాటులోకి తెచ్చింది. Refurbished మొబైల్ ఫోన్స్ గా పిలిచే ఈ ఫోన్లను డిస్కౌంట్ లో అందిస్తుంది. యాపిల్, ఎంఐ, శాంసంగ్, మోటోరోలా వంటి బ్రాండ్లకు చెందిన refurbished ఫోన్లను అతి తక్కువ ధరకే వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. వీటిలో యాపిల్ ఐఫోన్ 6s మోడల్ ధర రూ.8,799లకే లభిస్తుంది. 128జీబీ యాపిల్ ఐఫోన్ 7 మోడల్ రూ.15,499లకే లభిస్తుంది. వీటితో పాటుగా mi ఫోన్లలో కనిష్టంగా రెడ్మీ 5A రూ.4190లకే లభిస్తుండగా..రెడ్మీ 7 ప్రో రూ.8790కే అందుబాటులో ఉంది. గూగుల్ పిక్సెల్ సిరీస్ లో 3A మోడల్ కనిష్టంగా రూ.10,490లకే లభిస్తుండగా..పిక్సెల్ 3 128జీబీ మోడల్ గరిష్టంగా రూ.13,999కె అందుబాటులో ఉంది. శాంసంగ్ ఫోన్లు సైతం ఈ ఆఫర్లో ఉన్నాయి. సెకండ్ హ్యాండ్ Refurbished మోడల్స్ అయినప్పటికీ ఈ ఫోన్ల క్వాలిటీని ప్రత్యేకంగా నిపుణులు పరీక్షిస్తారు. ఈ ఫోన్లపై 12 నెలల వారంటీ, 7 రోజుల్లో రిప్లేసెమెంట్, ఒరిజినల్ యాక్సిస్సోరీస్ తో కలిపి ఇస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ సంస్థ పేర్కొంది. అయితే ప్రస్తుతం స్టాక్ ఉన్నంతవరకే ఈ ఆఫర్ ఉంటుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. సెకండ్ హ్యాండ్ మొబైల్స్ పై వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్ ను బట్టి ఇలా refurbished మొబైల్స్ ను డిస్కౌంట్ లో అందిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.

Friday, March 25, 2022

వన్‌ప్లస్ నుంచి కొత్త టీవీ ?


వన్‌ప్లస్ 10 ప్రో స్మార్ట్ ఫోన్ తో పాటు వై1ఎస్ స్మార్ట్ టీవీ కూడా  31వ తేదీన లాంచ్ చేయనున్నాదని వార్తలు వస్తున్నాయి. టీవీ వై1ఎస్‌లో 4కే డిస్‌ప్లే ఉండనుంది. ఇందులో 24W స్పీకర్లు ఉండనున్నాయి. డాల్బీ అట్మాస్ సపోర్ట్‌ను కూడా ఈ టీవీ అందించనుండటం విశేషం. 2 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్ ఇందులో ఉండనుంది. ఆండ్రాయిడ్ టీవీ 10 ఆపరేటింగ్ సిస్టంపై ఈ టీవీ పనిచేయనుంది. గూగుల్ అసిస్టెంట్, అలెక్సాలను ఇది సపోర్ట్ చేయనుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై, మూడు హెచ్‌డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్‌బీ పోర్టులు కూడా ఇందులో ఉన్నాయి. క్రోమ్‌కాస్ట్, మిరాకాస్ట్, వన్‌ప్లస్ కనెక్ట్ 2.0ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత కలర్ఓఎస్ 12.1 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. ఇందులో 6.7 అంగుళాల క్యూహెచ్‌డీ+ కర్వ్‌డ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని డిస్‌ప్లే యాస్పెక్ట్ రేషియో 20.1:9గా ఉంది. డైనమిక్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఫీచర్‌ను వన్‌ప్లస్ ఇందులో అందించింది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ కూడా ఇందులో ఉంది. డిస్‌ప్లే ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్యానెల్‌ను కూడా ఇందులో అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌పై వన్‌ప్లస్ 10 ప్రో పనిచేయనుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరాగా 48 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్789 సెన్సార్‌ను అందించారు. దీంతోపాటు 50 మెగాపిక్సెల్ శాంసంగ్ ఐసోసెల్ జేఎన్1 సెన్సార్‌ను అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాగానూ, మరో 8 మెగాపిక్సెల్ టెలిఫొటో షూటర్‌ను కూడా ఇందులో అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్615 కెమెరాను ఇందులో అందించారు. ఈ ఫోన్ 8కే వీడియో రికార్డింగ్‌ను కూడా సపోర్ట్ చేయనుంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 80W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‌ను, 50W వైర్‌లెస్ చార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.85 సెంటీమీటర్లు కాగా, బరువు 200.5 గ్రాములుగా ఉంది. ఇందులో స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. డాల్బీ అట్మాస్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది.


గబ్బిలాలు తలక్రిందులుగా ఎందుకు నిద్రపోతాయి?


గబ్బిలాలు క్షీరద జాతికి చెందినవి. క్షీరదాలలో ఎగరగలిగినది గబ్బిలం ఒక్కటే. ఇవి వేటకి వెళ్ళేటప్పుడు తమ పిల్లలను పొట్టకి కరుచుకుని ఎగురుతుంది. మిగిలిన పక్షులు ఎగరగలిగినా, అవి కావాలంటే నడవగలవు. కానీ గబ్బిలాలు నడవలేవు. ఆఖరికి వాటి కాళ్ళ మీద అవి నిలబడలేవు. అందుకే గబ్బిలలకి ఎగరడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. కాసేపు ఆగాలంటే వాటి రెక్కలకి ఉన్న గోళ్ళతో ఏ చెట్టుకొమ్మనో, గోడ పగులునో పట్టుకొని తలకిందులుగా వేలాడతాయి. గబ్బిలానికి ఉండే రెక్కలకీ, మిగిలిన పక్షులకి ఉండే రెక్కలకీ చాలా తేడా ఉంటుంది. మిగిలిన పక్షుల రెక్కల్లా గబ్బిలానికి ఈకలు ఉండవు. వీటి వేళ్ళ మధ్యని గొడుగు బట్టలాగా సాగదీసిన చర్మంతో చేసిన రెక్కలు ఉంటాయి. దాని వేళ్ళల్లో బొటనవేలు తప్ప మిగిలిన అన్ని వేళ్ళూ గొడుగు ఊచల్లాగా పనిచేస్తాయి. బొటన వేలు మాత్రం పైకి పొడుచుకు వచ్చినట్టుగా ఉండి  చెట్టు కొమ్మనో పట్టుకుంటుంది. నిద్ర పోయేటప్పుడు కూడా ఆ పట్టు జారిపోదు. అయితే గబ్బిలాలు ఎప్పుడు చూసినా అవి తలకిందులుగా నిద్రపోతుంటాయి. అంటే తలలు దించుకుని గోళ్లలోంచి దేన్నైనా పట్టుకుని నిద్రపోతుంటాయి. గబ్బిలాలకు ఉండే కండరాలు ప్రత్యేక నిర్మాణం కలిగి ఉంటాయి. గబ్బిలాల వెనుక, పాదాలు కండరాలకు ఎదురుగా పని చేస్తాయి. మోకాళ్లు వీపులా ఉంటాయి. దీనితో పాటు, అవి విశ్రాంతిగా ఉన్నప్పుడు ప్రత్యేకమైన కండరాలు కాలి, కాలి వేళ్ళను పట్టుకుంటాయి. దీని కారణంగా అవి వేలాడుతున్నప్పుడు ఎటువంటి శక్తిని ప్రయోగించాల్సిన అవసరం లేదు. తలక్రిందులుగా వేలాడుతున్నప్పుడు కూడా అవి విశ్రాంతిగా ఉంటాయి. మానవుడు తలక్రిందులుగా వేలాడదీసినప్పుడు అతని తలలో రక్తం ఆగిపోతుంది. దీని కారణంగా ప్రతి ఒక్కరికి కొంత సమయం వరకు మాత్రమే తలక్రిందులుగా ఉంటారు. తర్వాత వారు ఇబ్బంది పడతారు. కానీ గబ్బిలాల విషయంలో అలాంటివి ఉండవు. అలాంటి సమయంలో గబ్బిలాలకు రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంటుంది. అమెరికా రెడ్‌క్రాస్ సంస్థ ప్రకారం మనిషిలో దాదాపు 7.5 లీటర్ల రక్తం ఉంటుంది. గబ్బిలాలు చాలా తేలికగా ఉంటాయి. అందుకే వాటికి గురుత్వాకర్షణ, రక్త ప్రసరణలో పెద్దగా సమస్యలు ఉండవు. దీని కారణంగా గబ్బిలాలు తమను తాము తలక్రిందులుగా ఉండగలుగుతాయి. వాటి ప్రత్యేక పద్ధతిలో నిద్రించడం వల్ల అవి కూడా బాగా ఎగరగలుగుతాయి. గబ్బిలం చనిపోయిన తర్వాత కూడా అది తలక్రిందులుగానే ఉంటుంది.

12 రూపాయలకే ఆకాశయానం?


గాల్లో ప్రయాణం కూడా చౌక కాబోతోంది. కేవలం రూ. 12 ఖర్చు చేస్తే చాలు.. గాల్లో ప్రయాణించవచ్చు. ఈ ప్రయాణం విమానంలోనో, హెలికాప్టర్ లోనో కాదు.  ఇదో కొత్త తరహా ప్రయాణం నగరాల్లో 4 సీట్ల డ్రోన్లు నడిపేందుకు సన్నాహాలు ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్‌లో 'ఈవీటోల్స్‌' సేవలు అందుంచేందుకు జెట్‌ సెట్‌ గో ఏవియేషన్‌ సంస్థ ప్రయత్నిస్తోంది. ఈ విషయాన్ని ఆ సంస్థ సీఈఓ కనికా టేక్రివాల్‌ వివరించారు. ఈ సంస్థకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ స్టార్టప్‌లో క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌, పారిశ్రామికవేత్త పునీత్‌ దాల్మియా కూడా పెట్టుబడులు పెట్టారట!. ఈ జెట్‌సెట్‌గో ఏవియేషన్‌ సంస్థ తన విస్తరణ కార్యకలాపాల కోసం నిధులు సమీకరిస్తోంది. కనీసం రూ.1500 కోట్ల నిధులు సమీకరించాలని ప్లాన్ చేస్తున్నారు. నగరాల్లో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారం కోసం ఈవీ టోల్స్‌ సేవలు అందించేందుకు ఈ సంస్థ ప్రయత్నిస్తోంది. ఈ భారీ డ్రోన్లలో పైలట్‌ అంటూ ఎవరూ ఉండరు. ప్రస్తుతం కెమేరా డ్రోన్లు ఎలా పని చేస్తున్నాయో.. ఇవీ అలాగే.. కాకపోతే ఇవి సైజ్‌లో భారీగా ఉంటాయన్నమాట. ఈ భారీ డ్రోన్లలో ఒకేసారి నలుగురు ప్రయాణించే సదుపాయం ఉంది. వీటినే ఈవీ టోల్స్‌ అంటున్నారు. ఈ భారీ డ్రోన్లను ఓసారి ఛార్జింగ్‌ చేస్తే 40 కిలోమీటర్లు ప్రయాణించవచ్చట. అంటే ఒక కిలోమీటరుకు ఒక్కో వ్యక్తికి రూ.12 ఖర్చు అవుతుందట. ఇదేదో బావుంది కదా. ఎయిర్‌బస్‌ వంటి కొన్ని సంస్థలు ఈ డ్రోన్లను తయారు చేస్తున్నాయి. వీటి సేవలను త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభించేందుకు ఈ సంస్థ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతోంది. 

రొమ్ము క్యాన్సర్ కి ఈ బ్రాతో చెక్


నైజీరియన్ కంపెనీ నెక్స్ట్‌వేర్ టెక్నాలజీ బ్రెస్ట్ క్యాన్సర్ ని తగ్గించే స్మార్ట్ బ్రాను తయారు చేసింది. ఇందులో చిన్న అల్ట్రాసౌండ్ సెన్సార్లు ఉన్నాయి. ఈ సెన్సార్లు అనేవి బ్యాటరీ ఆధారంగా పనిచేస్తాయి. ఈ సెన్సార్లు బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధ పడేవారి రొమ్మును స్కాన్ చేస్తాయి. స్కానింగ్ సమయంలో కణితి ఉంటే వెంటనే కనిపెట్టేస్తాయి. ఈ పరికరం సహాయంతో బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పద్ధతిని మరింత మెరుగ్గా చేయవచ్చని దీన్ని రూపొందించిన పరిశోధన టీం స్పష్టంగా చెబుతోంది.ఇక ఈ బ్రా ఒక యాప్‌కి లింక్ చేయబడుతుంది. రొమ్ములో ఉన్న కణితి క్యాన్సర్‌ కారకమా? లేదా? అనేది పరీక్షల వలన తెలుస్తుంది. టెస్ట్‌ల తర్వాత ఇంకా ఆ ఫలితాలు వినియోగదారు మొబైల్ యాప్‌కు పంపబడతాయి. అలా క్యాన్సర్‌ను ప్రాథమిక దశలో గుర్తించి ఆ తరువాత చికిత్స అందించవచ్చునని పరిశోధకులు చెబుతున్నారు. అయితే, రొమ్ము క్యాన్సర్‌ కణితులను గుర్తించడానికి మహిళలు ఈ బ్రాను ఒక 30 నిమిషాల పాటు ధరించాలని దీని పరిశోధకులు చెబుతున్నారు. ఇక దీని ఫలితాలను మొబైల్‌లో చూసి ఆ తరువాత డాక్టర్ లను సంప్రదించడం ద్వారా క్లారిటీ పొందవచ్చునని వారు చెబుతున్నారు. ఈ బ్రాని డెవలప్ చేసిన రోబోటిక్స్ ఇంజనీర్ కెమిసోలా బొలారినోవా మాట్లాడుతూ.. ''2017లో బ్రెస్ట్ క్యాన్సర్ వలన మా అమ్మ చనిపోయింది. రొమ్ము క్యాన్సర్‌ని ఆలస్యంగా గుర్తించడమే ఆమె చనిపోవడానికి కారణం. ఆమె అడ్మిట్ అయిన హాస్పిటల్‌లోని వార్డులో అమ్మాయిల నుండి వృద్ధుల వరకు కూడా అందరూ బ్రెస్ట్ క్యాన్సర్ బాధతో బాధపడుతున్నారు. ఇక ఈ వ్యాధితో పోరాడేందుకు నా వంతు పాత్ర పోషించాలని అప్పుడే అనుకున్నాను. ప్రస్తుతం, మహిళలు రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం డాక్టర్ వద్దకు వెళ్లవలసి ఉంటుంది. కానీ ఇప్పుడు స్మార్ట్ బ్రాల సహాయంతో ఇంట్లో కూడా సురక్షితమైన ఇంకా అలాగే సౌకర్యవంతమైన పరీక్ష అందుబాటులో ఉంటుంది.'' అని చెప్పుకొచ్చారు. ఈ స్మార్ట్ బ్రా సాయంతో ప్రారంభ దశలో క్యాన్సర్‌ను గుర్తించడం ద్వారా మరణాల సంఖ్యను ఈజీగా తగ్గించవచ్చు. స్మార్ట్ బ్రా 70 శాతం దాకా కచ్చితమైన ఫలితాలను ఇస్తుందని విచారణలో వెల్లడైందని అన్నారు. ఇక ఫలితాలు 95 నుండి 97 శాతం దాకా ఖచ్చితమైనవిగా ఉండేలా తమ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వారు తెలిపారు. ఇక ఈ సంవత్సరం జూలై నాటికి ఈ బ్రా మార్కెట్‌లో అందుబాటులోకి రావచ్చునని వారు తెలిపారు.

మార్చి 31న మార్కెట్ లోకి వన్ ప్లస్ 10 ప్రో 5జీ


భారతదేశంలో మార్చి 31 న వన్ ప్లస్ 10 ప్రో 5జి విక్రయించబడుతుందని సంస్థ తెలిపింది. బడ్స్ ప్రో రేడియంట్ సిల్వర్ వెర్షన్ అదే రోజు భారతదేశం, యూరప్ మరియు ఉత్తర అమెరికాలో అందుబాటులో ఉంటుంది. వాస్తవానికి జనవరిలో చైనాలో రిలీజ్ అయ్యింది. ఈ సంవత్సరం ప్రారంభంలో, Snapdragon 8 Gen 1 SoC ద్వారా ఆధారితమైన OnePlus 10 Pro చైనాలో విడుదలైంది. Motorola Edge 30 Pro, Galaxy S22 సిరీస్ మరియు iQoo 9 Proతో సహా అనేక Android పరికరాలతో ఈ ఫోన్ పోటీపడుతుంది. సాఫ్ట్‌వేర్ అనుభవం మినహా, భారతదేశం-నిర్దిష్ట మోడల్ చైనా-నిర్దిష్ట మోడల్‌తో సమానమైన స్పెక్స్‌ను కలిగి ఉంటుందని అంచనా వేయబడింది. OnePlus Bullets Wireless Z2ని కూడా ప్రకటించింది. ఇది వేగవంతమైన ఛార్జింగ్, ఎక్కువ బ్యాటరీ లైఫ్ మరియు ఎక్కువ సౌండ్ క్లారిటీ మరియు బాస్ కోసం పెద్ద డ్రైవర్‌లను కలిగి ఉంటుంది. వన్ ప్లస్ 10 ప్రో 5జి లో 6.7-అంగుళాల QHD+ LTPO డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1,300 nits గరిష్ట ప్రకాశాన్ని కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 చిప్‌సెట్ గరిష్టంగా 12GB RAM మరియు 256GB అంతర్గత నిల్వతో అందుబాటులో ఉంది. ఇది 80W వేగవంతమైన ఛార్జింగ్ మరియు 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,000mAh బ్యాటరీతో కూడా వస్తుంది. Hasselblad-ఆధారిత వెనుక కెమెరా సెటప్‌లో 48-మెగాపిక్సెల్ Sony IMX789 ప్రైమరీ షూటర్, 50-మెగాపిక్సెల్ Samsung ISOCELL JN1 సెన్సార్ మరియు వెనుకవైపు 8-మెగాపిక్సెల్ టెలిఫోటో షూటర్ ఉన్నాయి. సెల్ఫీలు తీసుకోవడానికి 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.

Thursday, March 24, 2022

7,948 సిమ్ కార్డ్‌లను బ్లాక్ చేసిన విఐ !


దేశంలో ఒకప్పుడు ప్రభంజనం సృష్టించిన ఐడియా ప్రస్తుతం చతికిలా పడిపోయి వోడాఫోన్ తో జత కట్టి విఐగా మారింది. ఈ నెట్వర్క్ లో చాలామంది దొంగ సర్టిఫికెట్ తో సిమ్ కార్డులు తీసుకున్నారని త్వరలో నకిలీ గుర్తింపు రుజువులపై జారీ చేసిన సిమ్ కార్డులను బ్లాక్ చేయాలని మధ్యప్రదేశ్ సైబర్ పోలీసులు వివిధ టెలికాం కంపెనీలను ఆదేశించారని తెలుస్తోంది. దీంతో దాదాపు 8,000 సిమ్ కార్డులను బ్లాక్ చేసిందని సీనియర్ అధికారి తెలిపారు. 2020లో ఫేస్‌బుక్‌లో ఒక ప్రకటన ద్వారా కారు కొనుగోలు చేస్తానని ప్రలోభపెట్టి 1.75 లక్షల రూపాయలు మోసం చేసిన వ్యక్తి ఫిర్యాదుపై చర్య తీసుకున్న సైబర్ సెల్ గ్వాలియర్ విభాగం దర్యాప్తు ప్రారంభించింది. ఫిర్యాదు దారున్ని మోసం చేయడానికి నేరస్తులు ఉపయోగించిన నంబర్‌ను కనుగొన్నారు. ఆ యొక్క నెంబర్ వేరే వ్యక్తి గుర్తింపుపై జారీ చేయబడింది. మోసగాళ్లు ఉపయోగించిన నంబర్‌ను వేరే వ్యక్తి గుర్తింపు పత్రం ఆధారంగా టెలికాం కంపెనీ జారీ చేసింది. తరువాత, నేరంలో పాల్గొన్న వారికి సిమ్ కార్డును జారీ చేయడంలో 8 మంది వ్యక్తులు పాల్గొన్నట్లు తేలిందని గ్వాలియర్ సైబర్ జోన్ పోలీసు సూపరింటెండెంట్ సుధీర్ అగర్వాల్ తెలిపారు. ఈ విషయంపై విస్తృతమైన దర్యాప్తు తర్వాత, సైబర్ పోలీసులు ఈ సిమ్ కార్డులను ఉపయోగించి ప్రజలను మోసగించడానికి మోసగాళ్ళు 20,000 వేర్వేరు నంబర్‌లను ఉపయోగించినట్లు తెలియజేశాడు. సిమ్‌కార్డు జారీ చేసిన 8 మందిపై ఏడాది కాలంగా పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకున్నారని తెలిపారు. విచారణ తర్వాత, సైబర్ యూనిట్ ఈ నంబర్ల రీ-వెరిఫికేషన్ కోసం వోడాఫోన్, ఐడియా, ఎయిర్‌టెల్, బిఎస్ఎన్ఎల్ సహా వివిధ టెలికాం కంపెనీలకు నోటీసులు జారీ చేసిందని ఆయన చెప్పారు. ఈ నోటీసుపై వేగంగా చర్య తీసుకున్న వోడాఫోన్ ఐడియా ఇటీవల రికార్డుల రీ-వెరిఫికేషన్ తర్వాత 7,948 సీమ్ కార్డ్‌లను బ్లాక్ చేసిందని అధికారి తెలిపారు. నేరస్తుల చేతిలో మోసపోకుండా అమాయక ప్రజలను కాపాడేందుకు టెలికాం కంపెనీ ఇన్ని నంబర్లను బ్లాక్ చేయడం బహుశా దేశంలోనే మొదటిసారి అని అగర్వాల్ పేర్కొన్నారు. ఇతర కంపెనీలు కూడా అలాంటి సిమ్ కార్డులను బ్లాక్ చేసినందుకు తమ రికార్డులను మళ్లీ వెరిఫై చేస్తున్నాయని ఆయన తెలిపారు.

Popular Posts