Ad Code

10 వేలలోపే ఒప్పో కొత్త ఫోన్!


ఒప్పో ఏ16ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. గతేడాది లాంచ్ అయిన ఒప్పో ఏ16కు టోన్ డౌన్ వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఇందులో వాటర్ డ్రాప్ నాచ్ తరహా డిస్‌ప్లేను అందించారు. 64 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉంది. మూడు కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. దీని డిస్‌ప్లే యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,990గా ఉంది. ఇక 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,990గా ఉంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత కలర్ఓఎస్ 11.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.52 ఇంచుల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కూడా ఇందులో ఉంది. డిస్‌ప్లే యాస్పెక్ట్ రేషియో 20:9గానూ, పిక్సెల్ డెన్సిటీ 269పీపీఐగానూ ఉంది. 4 జీబీ వరకు ర్యామ్, 64 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 4230 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో ఉంది.ఇందులో వెనకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, మైక్రో యూఎస్‌బీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఇందులో ఉన్నాయి. యాక్సెలరోమీటర్, మ్యాగ్నెటోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్లను ఇందులో అందించారు. దీని మందం 0.78 సెంటీమీటర్లు కాగా... బరువు 175 గ్రాములుగా ఉంది.

Post a Comment

0 Comments

Close Menu