Ad Code

రెడ్ మీ నోట్ 11 ప్రో సిరీస్ రేపు విడుదల


షియోమీ ఇండియాలో రెడ్ మీ నోట్ 11 ప్రో సిరీస్ నుండి కొత్త ఫోన్లను విడుదల చేస్తోంది. ఈ ఫోన్స్ కోసం అమెజాన్ ఇప్పటికే ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ను కూడా అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ల యొక్క కొన్ని కీలకమైన ప్రత్యేకతలు మరియు ఫీచర్లను కూడా వెల్లడించింది. ఈ ఫోన్లను 67W సూపర్ సోనిక్ 3.0 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి మరిన్ని భారీ ఫీచర్ల గురించి టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ యొక్క రివీల్డ్ మరియు అంచనా స్పెక్స్ క్రింద చూడవచ్చు. ఈ సిరీస్ నుండి తీసుకురానున్న ఫోన్ల యొక్క కొన్ని కీలకమైన వివరాలను షియోమీ అందించిన టీజర్ ద్వారా వెల్లడించింది. వీటి ద్వారా మరిన్ని స్పెక్స్ ను అంచనా వేస్తున్నారు. టీజర్ ప్రకారం, ఈ సిరీస్ ఫోన్లను FHD+ సూపర్ AMOLED డిస్ప్లేతో అందించినట్లు తెలిపింది. అంతేకాదు ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది మరియు 1200 నైట్స్ గరిష్ట బ్రైట్నెస్ అందిస్తుంది. అలాగే, ఈ డిస్ప్లే ప్రొటక్షన్ కోసం గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అందించే అవకాశం ఉంది. ఫోన్లలో 108MP ప్రధాన కెమెరా గురించి ఇప్పటికే ప్రకటించింది. అయితే, రెండు ఫోన్ల కెమెరా సెటప్ లో ఉండే మైన్ కెమెరాలో అంతరం ఉంటుంది. 108 MP మైన సెన్సార్ Pro+ వేరియంట్ తో రావచ్చు. ఈ ఫోన్లలో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా వుంది మరియు డ్యూయల్ స్టెరో స్పీకర్ల గురించి కూడా టీజ్ చేస్తోంది. ఇంటర్నల్ స్పెక్స్ లోకి వెళితే, ప్రో ఎడిషన్లో హీలియో G96 ప్రోసెసర్ ఉండవచ్చు మరియు Pro+ డైమెన్సిటీ 920 5G ప్రాసెసర్ని కలిగి ఉండవచ్చు. నోట్ 11 ప్రో+ వేరియంట్ 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఉంటే, నోట్ 11 ప్రో+ మాత్రం ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఉండవచ్చు. అలాగే, నోట్ 11 ప్రో ప్లస్ 5000mAh బ్యాటరీతో రావచ్చు, అయితే ప్రో మాత్రం చిన్న 4500mAh బ్యాటరీ తో ఉండవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu