Ad Code

ఆండ్రాయిడ్ 13 లో మరో ఫీచర్!


గతేడాది విడుదల చేసిన ఆండ్రాయిడ్ 12 పూర్తిస్థాయిలో యూజర్లకు  అందుబాటులోకి రాకముందే ఆండ్రాయిడ్ 13కు సంబంధించిన రెండో డెవలపర్‌ ప్రివ్యూని విడుదల చేసింది. ఇందులో 'నోటిఫికేషన్ పర్మిషన్, సపోర్ట్ ఫర్ బ్లూటూత్ LE ఆడియో' వంటి సరికొత్త ఫీచర్లు ఉన్నాయి. అయితే గూగుల్ అధికారికంగా లాంచ్ చేసినప్పుడే ఇవి కస్టమర్లకు అందుబాటులోకి రానున్నాయి. మరో ఫీచర్‌ను పరిచయం చేసింది ఆండ్రాయిడ్13 డీపీ2. ఏదైనా ఒక యాప్ బ్యాక్ గ్రౌండ్‌లో బ్యాటరీ ఫవర్‌ను అధికంగా వినియోగిస్తుంటే వినియోగదారులను హెచ్చరిస్తుంది. Android డెవలపర్ పేజీలో గూగుల్ పేర్కొన్నట్లు, ఏదైనా ఒక యాప్ 24 గంటల్లో భారీగా బ్యాటరీ పవర్‌ను వినియోగించినప్పుడు Android 13 సిస్టమ్ నోటిఫికేషన్‌ను జారీ చేస్తుంది. యాప్ అధిక బ్యాటరీ వినియోగాన్ని సిస్టమ్ గుర్తిస్తే యాప్ ఫోర్‌గ్రౌండ్ సర్వీస్‌తో నోటిఫికేషన్‌ను సెండ్ చేస్తుంది. వినియోగదారులు ఆ నోటిఫికేషన్‌ను డిలిట్ చేసే వరకు లేదా ఫోర్ గ్రౌండ్ సర్వీస్‌ను ఫినిష్ చేసే వరకు అది అలానే ఉంటుంది. ఒక యాప్ 24 గంటల వ్యవధిలో బ్యాక్‌గ్రౌండ్‌లో పెద్ద మొత్తంలో బ్యాటరీని వినియోగిస్తోందని Android 13 గుర్తిస్తే వినియోగదారులను హెచ్చరిస్తుంది. ఈ నోటిఫికేషన్ చూసిన తరువాత సమస్య పరిష్కారం కోసం ఫోర్ గ్రౌండ్ సర్వీస్ టాస్క్ మేనేజర్ ను యాక్సెస్ చేయమని కస్టమర్‌ను ఆహ్వానిస్తుంది. దీంతో కస్టమర్ ఆ నోటిఫికేషన్‌ను సరిచేయవచ్చు లేదా తొలగించవచ్చు. ఒకసారి డిలిట్ చేసిన తరువాత మరో 24 గంటల వరకు ఆనోటిఫికేషన్‌ను చూపదు. కొన్ని యాప్‌లను బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ చేయాల్సిన పరిస్థితి ఉంటే Google అందుకు కొన్ని మినహాయింపులు ఇచ్చింది. సిస్టమ్ యాప్‌లు, సిస్టమ్-బౌండ్ యాప్‌లు, కంపానియన్ డివైజ్ యాప్‌లు, డెమో మోడ్‌ డివైజ్‌లో రన్ అవుతున్న యాప్‌లు, డివైస్ ఓనర్ యాప్‌లు, ప్రొఫైల్ ఓనర్ యాప్‌లు, నిరంతర యాప్‌లు, VPN యాప్‌లు, ROLE_DIALER వంటి యాప్‌ల రన్ కోసం pps సిస్టమ్ సెట్టింగ్‌లలో "unrestricted" ఆఫ్షన్ గూగుల్ కల్పించింది. Android OS గత అనుభవాలను బట్టి డివైజ్ బ్యాటరీ లైఫ్‌ను మెరుగుపరచడం కోసం Google స్థిరంగా పనిచేస్తోంది. ఆండ్రాయిడ్ 8 ఓరియో రోల్ అవుట్‌ పేరుతో గూగుల్ ఇదే విధమైన హెచ్చరికను ప్రవేశపెట్టింది. ఏప్రిల్‌లో ఆండ్రాయిడ్ 13 బీటా 1ను, మేలో బీటా 2ను, బీటా 3ని జూన్‌లో, బీటా 4ను జులైలో యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. పూర్తిస్థాయి ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌ను ఆగస్టు నెలలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. యాప్‌ల వినియోగానికి సంబంధించి 'నియర్‌బై వైఫై డివైజెస్‌' పేరుతో గూగుల్ సరికొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. దీంతో యాప్‌లు లొకేషన్‌ అనుమతి లేకుండానే దగ్గర్లోని వైఫై పాయింట్లను గుర్తించి వాటి ద్వారా డివైజ్‌లకు కనెక్ట్ అవుతాయి. మొబైల్‌ యాప్‌లలో యూజర్లు తమకు నచ్చిన భాషను ఎంచుకునేలా పర్‌-యాప్‌ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్‌ పేరుతో మరో ఫీచర్‌ను అప్‌డేట్ చేసింది.

Post a Comment

0 Comments

Close Menu