Ad Code

15న మార్కెట్లోకి షియోమి 12 సిరీస్ విడుదల


షియోమి 12 సిరీస్​ మార్చి 15న భారత మార్కెట్​లోకి అందుబాటులోకి రానుంది. ఈ సిరీస్​లో షియోమి 12, షియోమి 12 ప్రో రెండు ఫోన్లు ఉండనున్నాయి. కాగా, గతేడాది డిసెంబర్‌లోనే ఈ రెండు ఫోన్లు చైనా మార్కెట్​లోకి విడుదలయ్యాయి. అక్కడ, భారీ స్పందన రావడంతో ఇప్పుడు భారత్​లో సహా ఇతర దేశాల్లో లాంచింగ్​కు కంపెనీ సిద్దమవుతోంది. షియోమి12 సిరీస్ గ్లోబల్ లాంచింగ్​ జరగనుంది.  షియోమి 12 స్పెసిఫికేషన్లను ఇంకా వెల్లడించలేదు. షియోమి 12, షియోమి 12 ఫోన్లు ఇప్పటికే చైనా, యూరప్​ మార్కెట్లలో రిలీజయ్యాయి. ఐరోపాలో షియోమి12 ధర €899 (దాదాపు రూ. 75,450), షియోమి 12 ప్రో ధర €1,099 (దాదాపు రూ. 92,200) వద్ద విడుదలయ్యాయి. దాదాపు ఇవే ఫీచర్లు, ధర వద్ద భారత మార్కెట్​లోకి షియోమి 12 సిరీస్​ రానుంది షియోమి 12 సిరీస్​ స్నాప్​డ్రాగన్​ 8 జెన్​ 1 SoC ప్రాసెసర్​పై పనిచేస్తుంది. షియోమి 12 డిస్‌ప్లే ఫుల్​ హెచ్​డీ+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.28 -అంగుళాల AMOLED ప్యానెల్‌ను కలిగి ఉంటుంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంటుంది. ఇక, కెమెరా విషయానికి వస్తే.. దీని వెనుక వైపు 50MP సోనీ IMX766 ప్రైమరీ కెమెరా సెన్సార్, 13MP అల్ట్రావైడ్ కెమెరా, 5MP టెలి-మాక్రో కెమెరాలను అందించింది. సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరాను చేర్చింది. ఈ ఫోన్ 4500 mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీ 67W వేగవంతమైన ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇది 50W వైర్‌లెస్ ఛార్జింగ్, 10W రివర్స్ ఛార్జింగ్ కెపాసిటీని కూడా కలిగి ఉంటుంది. ప్రో స్నాప్‌డ్రాగన్ 8 జెన్​ 1 SoC ప్రాసెసర్​పై పనిచేస్తుంది. షియోమి 12 ప్రో 6.73 -అంగుళాల 2K+ E5 AMOLED డిస్​ప్లేతో వస్తుంది. 4,600 mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 120W వేగవంతమైన ఛార్జింగ్‌తో పాటు 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇక, కెమెరా విషయానికి వస్తే.. దీని ట్రిపుల్​ రియర్​ కెమెరా సెటప్​ కలిగి ఉంటుంది. దీనిలో 50MP సోనీ IMX707 ప్రైమరీ కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా సెన్సార్ కెమెరాలను అందించింది. ఇక, సెల్ఫీల కోసం ప్రత్యేకంగా 32MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను చేర్చింది.

Post a Comment

0 Comments

Close Menu