17న రెడ్​మీ 10 సిరీస్​ విడుదల


ప్రముఖ చైనా స్మార్ట్​ఫోన్​ దిగ్జజం షియోమి సబ్​బ్రాండ్​ రెడ్​మీ వరుస స్మార్ట్​ఫోన్ల లాంచింగ్​తో భారత్​లో దూసుకుపోతుంది. ఈ నెల ప్రారంభంలో రెండ్​మీ నోట్​ 11 ప్రో సిరీస్​ను ఆవిష్కరించిన కంపెనీఇప్పుడు రెడ్​మీ 10 సిరీస్​ లాంచింగ్​కు సిద్దమవుతోంది. ఈ సిరీస్​ను ఈ నెల 17న విడుదల రెడీఅవుతోంది. షియోమి అధికారికంగా పంచుకున్న వివరాల ప్రకారం, రెడ్​మీ10 సిరీస్‌ను మార్చి 17న మార్కెట్​లోకి తీసుకురానుంది. రెడ్‌మి 10 సిరీస్​ లాంచింగ్​ను కన్ఫర్మ్​ చేస్తూ ఓ టీజర్​ను కూడా రిలీజ్చేసింది. రెడ్​మీ నోట్​ 11 ప్రో ఫోన్​లో అందించే కెమెరా, డిస్‌ప్లే, అతిపెద్ద​ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్​పై టీజర్​లో స్పష్టతనిచ్చింది. ఈ వివరాలను బట్టి, రెడ్​మీ 10 సిరీస్ అదిరిపోయే డిజైన్​తో వస్తుంది. దీనిలో స్నాప్‌డ్రాగన్ 680 చిప్‌సెట్‌ను ఉపయోగించనున్నట్లు టీజర్​లో పేర్కొంది. రెడ్​మీ స్మార్ట్‌ఫోన్​కు సంబంధించిన ఖచ్చితమైన వివరాలు మాత్రం వెల్లడించలేదు. కానీ ఫాస్ట్ ఛార్జింగ్, బ్యాటరీ బ్యాప్​, అల్ట్రా-ఫాస్ట్ స్టోరేజ్ అందించనున్నట్లు తెలిపింది. అంటే, రెడ్​మీ 10 సిరీస్​ 5000mAh బ్యాటరీతో వచ్చే అవకాశం ఉంది. ఈ స్మార్ట్​ఫోన్​ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్​తో రానుందని స్పష్టమవుతోంది. ఇది UFS 2.2 స్టోరేజ్‌కి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. టీజర్‌లోని ఇతర వివరాలను పరిశీలిస్తే.. టెక్స్‌చర్ బ్యాక్ ప్యానెల్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్​ను అందించనుంది. ఈ కెమెరా సెటప్​లో డెప్త్, AI సెన్సార్‌తో పాటు 50 -మెగాపిక్సెల్ సెన్సార్‌ కెమెరాతో రానుంది. రెడ్​మీ 10 గ్లోబల్ వేరియంట్ 90Hz డిస్ప్లేతో వస్తుంది. ఇది మీడియాటెక్​ హీలియో G88 SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది. దీనిలో 50 -మెగాపిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా మాడ్యూల్‌ను అందించనుంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5000mAh బ్యాటరీతో వస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా బడ్జెట్ ఫోన్లకు డిమాండ్​ విపరీతంగా పెరిగింది. దీంతో చాలా కంపెనీలు బడ్జెట్ ధరలో ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి. వీటిలో అతి తక్కువ ధరకే ప్రీమియం రేంజ్ ఫీచర్స్ అందిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. దీంతో షియోమి 10 సిరీస్​ను కూడా బడ్జెట్​ రేంజ్​లోనే తీసుకురావాలని కంపెనీ తొలుత భావిస్తోంది. అయితే, ప్రస్తుతం మొబైల్​ మార్కెట్​ను చిప్‌సెట్ కొరత వేధిస్తోంది. అంతేకాదు, ప్రస్తుత ప్రపంచ ఆర్థిక పరిస్థితి ధర స్థాయిని మరింత పెరిగేలా చేస్తుంది. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని, రెడ్​మీ 10 బేస్​ వేరియంట్ భారతదేశంలో సుమారు రూ. 10,999కి లాంచ్ అవుతుందని టెక్​ వర్గాలు భావిస్తున్నాయి.

Post a Comment

0 Comments