Ad Code

ఆపిల్ నుంచి 20-అంగుళాల ఫోల్డబుల్ డిస్‌ప్లే డివైజ్?


ఆపిల్ కంపెనీ 20-అంగుళాల భారీ ఫోల్డబుల్ డిస్‌ప్లేతో కూడిన డివైజ్ ను మార్కెట్‌లోకి తీసుకు రావడానికి ప్రయత్నిస్తుంది. డిస్ ప్లే సప్లై చైన్ కన్సల్టెంట్స్ విశ్లేషకుడు రాస్ యంగ్ నుండి వచ్చిన నివేదిక ఇంతకు ముందు ఆపిల్ పెద్ద, ఫోల్డబుల్ స్క్రీన్‌తో డివైజ్ ని డెవలప్ చేయడానికి ప్లాన్ చేస్తుందని సూచించింది. ఇప్పుడు, బ్లూమ్‌బెర్గ్ నివేదిక 2026 నాటికి పరికరం రావచ్చని తెలిపింది.ఇక అది "ఐప్యాడ్/మ్యాక్‌బుక్ హైబ్రిడ్" అని పేర్కొనడం అనేది జరిగింది. ఇక ఈ యాపిల్ డివైజ్ అనేది డ్యూయల్-స్క్రీన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇంకా అలాగే అది ఫిజికల్ కీబోర్డ్ ఇంకా అలాగే ట్రాక్‌ప్యాడ్‌ను వదిలివేస్తుంది. ఇంకా అలాగే టచ్‌స్క్రీన్ వినియోగదారులకు నావిగేట్ చేయడానికి అలాగే పరికరంలో టైప్ చేయడానికి కూడా బాగా సహాయపడుతుంది. Lenovo కంపెనీ థింక్‌ప్యాడ్ X1 ఫోల్డ్ 13-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది, అది టచ్‌స్క్రీన్ ల్యాప్‌టాప్‌గా మారడానికి మధ్యలో ఫోల్డ్ చేయబడింది. ఆపిల్ తన ఫోల్డబుల్ ఐఫోన్‌ను 2025 వ సంవత్సరం వరకు రావచ్చని  గత వారం నివేదికలు వెలువడ్డాయి, ఎందుకంటే కంపెనీ ఫోల్డబుల్ మ్యాక్‌బుక్స్ వైపు ఫోకస్ పెట్టడం జరిగింది. apple ఇంకా ఫోల్డబుల్ ఐఫోన్‌ను లాంచ్ చేయలేదు కానీ అలాంటి డివైజ్ త్వరలో లాంచ్ అవుతుందని నివేదికలు వచ్చాయి. అయితే, ఫోల్డబుల్ ఐఫోన్ ఆలస్యమైందని కొత్త నివేదిక సూచిస్తుంది. apple కంపెనీ ఫోల్డబుల్ ఐఫోన్ 2025 వ సంవత్సరం వరకు ఆలస్యమవుతుందని యంగ్ సూచించాడు. దీనికి కారణం కంపెనీ మొత్తం స్క్రీన్ ఫోల్డబుల్ మ్యాక్‌బుక్‌లను సెర్చ్ చెయ్యడం. కంపెనీ ఇప్పుడు మ్యాక్‌బుక్స్‌పై పూర్తిగా తన ఫోకస్ ని పెట్టింది. ఇంకా అలాగే ఆల్-స్క్రీన్ ఫోల్డబుల్ నోట్‌బుక్‌ను అందించే అవకాశాన్ని కూడా డెవలప్ చెయ్యడానికి ట్రై చేస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu