Ad Code

రెనో క్విడ్ 2022 మోడల్ విడుదల


ఫ్రాన్స్ కు చెందిన కార్ల తయారీ సంస్థ రెనో ఇండియన్ సబ్సిడరీపై మరింత దృష్టి పెట్టింది. భారత్ లో చిన్న కార్ల మార్కెట్ పై ఇప్పటికే పట్టుసాధించిన రెనో సంస్థ ఆ సెగ్మెంట్ లో కొత్త వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. అందులో భాగంగా సంస్థ నుంచి తయారై, అత్యధిక సేల్స్ నమోదు చేస్తున్న “క్విడ్” చిన్న కారుకు మరింత మెరుగులు దిద్దుతూ మార్కెట్లోకి విడుదల చేసింది రెనో. “క్విడ్ 2022” మోడల్ భారత్ లో విడుదలైంది. కొత్తగా కారు కొనాలనుకునేవారు, వ్యక్తిగత కారు కావాలనుకునేవారు లేదా కుటుంబానికి మరో కారు అవసరమున్న వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఈ 2022 క్విడ్ మోడల్ ను విడుదల చేసినట్లు సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. చిన్న కార్ల సెగ్మెంట్ లో ఇప్పటికే లాయల్ కస్టమర్లను సొంతం చేసుకున్న రెనో ఇకపై మరింత లోతుగా మార్కెట్ లోకి వెళ్లేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం విడుదలైన క్విడ్ కారులో కొన్ని కాస్మొటిక్ మార్పులు చేసింది. ఎక్స్టీరియర్ విషయానికొస్తే, క్విడ్ ఇప్పుడు కొత్త మెటల్ మస్టర్డ్ మరియు ఐస్ కూల్ వైట్ ఎక్ట్సీరియర్ కలర్స్‌తో సరికొత్తగా వస్తుంది. ఇక టాప్ వేరియంట్ క్లైంబర్ ఎడిషన్‌ లో బ్లాక్ రూఫ్ కలిగిన డ్యూయల్-టోన్ ఫ్లెక్స్ వీల్స్‌ ను అమర్చారు. క్విడ్ లో ఇప్పటివరకు ఉన్న మూన్‌లైట్ సిల్వర్ మరియు జన్స్కార్ బ్లూ మోనోటోన్ రంగులను కూడా కొనసాగించనున్నారు. కొత్త రంగులతో పాటు ఎలక్ట్రికల్‌గా అడ్జస్ట్ చేసుకోగలిగే ORVMలు, LED DRLలు, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. ఇంటీరియర్ విషయానికొస్తే ముందు భాగంలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎనిమిది అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సరికొత్త ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్యాబ్రిక్ సీట్లు ఉన్నాయి. 0.8 లీటర్, 1.0 లీటర్ అనే రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో క్విడ్ అందుబాటులో ఉంది. వీటిలో 0.8 లీటర్ ఇంజిన్ 53bhp మరియు 72Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంటే, 1.0 లీటర్ ఇంజిన్ 67bhp మరియు 91Nm గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. వీటిలో మాన్యువల్ తో పాటుగా ఆటోమేటిక్ గేర్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. రెనో క్విడ్ సరాసరి 22.25 kmpl మైలేజ్ ఇస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఈ 2022 మోడల్ క్విడ్ ప్రారంభ ధర రూ.4.49 లక్షలుగా  రెనో సంస్థ నిర్ణయించింది.

Post a Comment

0 Comments

Close Menu