శామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 22 సిరీస్ పై ఆఫర్లు!


స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి ఎన్ని కంపెనీలు వచ్చినా శామ్ సంగ్ మాత్రం తన స్థానాన్ని కోల్పోవడం లేదంటేనే ఈ కంపెనీ ఎంతగా జనాల్లో పాతుకుపోయిందో మనం  అర్థం చేసుకోవచ్చు. ఈ కంపెనీవి కేవలం స్మార్ట్ ఫోన్లే కాకుండా అనేక రకాల పరికరాలు కూడా మనకు అందుబాటులో ఉంటున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఏ ఫీచర్లు కొత్తగా ఉంటే శామ్ సంగ్  కంపెనీ ఆ ఫీచర్లతో ఫోన్ ను రిలీజ్ చేస్తూ సందడి చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం  ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లలో ఫ్లాగ్ షిప్ ఫోన్ల హవా నడుస్తోంది. ప్రముఖ కంపెనీలన్నీ తమ ఫ్లాగ్ షిప్ ఫోన్లను వరుసగా విడుదల చేస్తున్నాయి. ఈ తరుణంలోనే శామ్ సంగ్ కూడా తన ఫ్లాగ్ షిప్ ఫోన్ గెలాక్సీ ఎస్ 22 ని రిలీజ్ చేసింది. ఎస్ 22 సిరీస్ ఫోన్లన్నీ ఫ్లాగ్ షిప్ ఫోన్లే కావడం విశేషం. ఈ సిరీస్ లో సామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 22, సామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 22+, సామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 22 అల్ట్రా వంటి ఫోన్లను కంపెనీ అమ్మకానికి ఉంచింది. అంతే కాకుండా ఈ ఫోన్ల మీద కళ్లు చెదిరే ఆఫర్లను కూడా అందుబాటులో ఉంచింది. ఈ ఫోన్ల ధరల విషయానికి వస్తే వివిధ స్టోరేజీలకు వివిధ రకాల ధరలను కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్లు అమెజాన్ ఆన్ లైన్ స్టోర్లలో మరియు సామ్ సంగ్ ఆన్ లైన్, ఆఫ్ లైన్ స్టోర్లలో లభించనున్నాయి. ఈ ఫోన్లను కొనే వినియోగదారుల కోసం కంపెనీ పలు ఆఫర్లను కూడా ప్రకటించింది. హెచ్ డీ ఎఫ్ సీ క్రెడిట్ కార్డుతో ఈ ఫోన్ ను కొనుగోలు చేస్తే రూ. 5,000 తక్షణ క్యాష్ బ్యాక్ లభించనుంది. అంతే కాకుండా రూ. 11,999 విలువైన శామ్ సంగ్ బర్డ్స్ కూడా లభించనున్నాయి.

Post a Comment

0 Comments