Ad Code

3డీ ముక్కు, చెవులను రూపొందించనున్న శాస్త్రవేత్తలు?


అవయవాలు లేకుండా జన్మించడం, కాలిన గాయాల వల్ల ముఖంపై మచ్చలు అనేది చికిత్సలేని సమస్యలు. వీటివల్ల ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. అలాంటివారికి యూకేలోని వేల్స్‌లోగల స్వాన్నీ వర్సిటీ శాస్త్రవేత్తలు మానవ కణాలను ఉపయోగించి ఓ కొత్తరకం చికిత్సను కనుగొన్నారు. విశ్వవిద్యాలయంలో నిర్వహించిన అధ్యయనంలో భాగంగా శాస్త్రవేత్తలు మానవ కణాలు, మొక్కల ఆధారిత పదార్థాలతో 3డీ ముక్కు, చెవి మృదులాస్థిని అభివృద్ధిపరచనున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే భవిష్యత్తులో శరీర భాగాలు లేకుండా జన్మించిన వ్యక్తులకు లేదా కాలిన గాయాలు, గాయం లేదా క్యాన్సర్ కారణంగా ముఖంపై మచ్చలు ఏర్పడ్డవారికి చికిత్స చేయవచ్చు. త్వరలోనే కణాల ఆదర్శ కలయిక వల్ల చెవి మృదులాస్థి అభివృద్ధి చేసి, ఫేసియల్ రీకన్‌స్ట్రక్షన్‌పై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నారు. స్వాన్సీలో ప్లాస్టిక్ సర్జరీ ప్రొఫెసర్ ఇయాన్ విటేకర్ మాట్లాడుతూ, 3డీ ప్రింటర్లను ఉపయోగించడంవల్ల ఆపరేషన్లు తగ్గుతాయి, రోగులకు ఖర్చుతోపాటు ప్రయాస తగ్గుతుందన్నారు. రాబోయే 2-5 ఏళ్లలో దీనిపై స్వాన్సీలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.


Post a Comment

0 Comments

Close Menu