Ad Code

ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో రియల్‌మీ జీటీ 3


రియల్‌మీ జీటీ నియో 3 పేరుతో తీసుకురానున్న ఈ ఫోన్‌లో మార్చి 22న మార్కెట్లో విడుదలైంది. తొలుత చైనాలో విడుదలైన ఈ ఫోన్‌ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే స్మార్ట్‌ఫోన్‌ ఇండస్ట్రీ చరిత్రలోనే అత్యంత ఫాస్టెస్ట్‌ ఛార్జింగ్‌ స్మార్ట్‌ఫోన్‌గా Realme GT Neo 3 నిలుస్తుందని కంపెనీ వెల్లడించింది. 150 W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సరిపోర్టు చేయడం దీని ప్రత్యేకత. కేవలం 5 నిమిషాల్లోనే 50 శాతం బ్యాటరీ ఛార్జ్‌ చేయనుంది. గత సంవత్సరం చైనా దిగ్గజం షావోమీ 120 W ఛార్జింగ్‌ సపోర్టుతో Xiaomi 11i హైపర్‌ ఛార్జ్‌ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు పోటీగా రియల్‌ మీ తన జీటీ నియో 3 స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్‌లో ఎన్నో అత్యాధునిక ఫీచర్స్‌ను జోడించింది. థర్మల్‌ మేనెజ్‌మెంట్‌ కోసం డైమండ్‌ ఐస్‌ కోర్‌ కూలింగ్‌ ప్లస్‌ ఫీచర్‌ను జోడించింది. రెండు రకాల బ్యాటరీ సామర్థ్యాలతో రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. 150W ఫాస్ట్‌ఛార్జింగ్‌తో పాటు బ్యాటరీ సామర్థ్యం 4,500mAh ఉంది. ఇక 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీ సామర్థ్యంతో ఉండనుంది. ఈ ఫోన్‌లలో గరిష్టంగా 12GB ర్యామ్‌, 256 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో వస్తోంది. రియల్‌మీ జీటీ నియో 3 ఫోన్‌లో 50 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాను అందించనున్నట్లు తెలుస్తోంది. సోనీ IMX766 సెన్సార్​ కెమెరా ఈ ఫోన్‌ ప్రత్యేకగా చెబుతున్నారు.ఇందులో మీడియాటెక్​ డైమెన్సిటీ 8100 చిప్‌సెట్‌ను అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డిస్‌ప్లే విషయానికొస్తే ఇందులో 120 హెడ్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో కూడిన 6.5 ఇంచెస్‌ అమోఎల్‌ఈడీ ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లేతో వస్తోంది. ఈ ఫోన్‌కు డాల్బీ ఆట్మోస్‌ స్పీకర్‌ను అందిస్తోంది కంపెనీ రెండు వేరియంట్లలో విడుదలైన ఈ ఫోన్‌ ధర వరుసగా దాదాపు రూ.24,000, రూ.27,500, రూ.31,200గా ఉంది. ఇందులో 6GB ర్యామ్‌+128GB స్టోరేజీ, 8GB ర్యామ్‌+256GB స్టోరేజీ, 12GB ర్యామ్‌ +256GB ఇంటర్నల్‌ స్టోరేజీతో వస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu