Ad Code

సిరీస్ 3 స్మార్ట్​వాచ్ ప్రొడక్షన్ ను నిలిపివేసిన యాపిల్ ?


యాపిల్​కు చెందిన అత్యంత పాపులర్​ స్మార్ట్​వాచ్​గా పేరొందిన వాచ్ సిరీస్ 3​ని నిలిపివేసే ఆలోచనలో ఉంది. యాపిల్ వాచ్​ 3 సిరీస్​లో ఉపయోగించే హార్డ్‌వేర్ ఇకపై కొత్త ఫీచర్లకు అప్‌గ్రేడ్ అవ్వదు. అందుకే, ఈ మోడల్​ను నిలిపివేసే యోచనలో ఉంది. అయితే దీని బదులు కొత్త యాపిల్​ వాచ్ మోడల్‌ను పరిచయం చేసే అవకాశం ఉంది. ఈ వివరాలను యాపిల్ విశ్లేషకుడు మింగ్-చి కువో వినియోగదారులతో పంచుకున్నారు. ''రాబోయే వాచ్‌ ఓఎస్‌కి మరింత కంప్యూటింగ్ శక్తి అవసరం. అయితే, ఇప్పుడు మార్కెట్​లో ఉన్న యాపిల్ వాచ్​ సిరీస్​ 3 మోడల్ ఈ ఓఎస్​కు మద్దతివ్వదు. కాబట్టి యాపిల్​ వాచ్ సిరీస్ 3 స్మార్ట్​వాచ్​ అమ్మకాలను త్వరలోనే నిలిపివేయనున్నాం. దీని బదులు సరికొత్త యాపిల్ వాచ్​ను మార్కెట్​లోకి విడుదల చేస్తాం." అని మింగ్​చి కువో తాజా ట్వీట్​లో పేర్కొన్నారు. యాపిల్ వాచ్ సిరీస్ 3 ఐదేళ్లుగా మార్కెట్​లో ఉంది. దీనికి మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పుడు అకస్మాత్తుగా యాపిల్ వాచ్​ సిరీస్​ 3 నిలిపివేస్తుండటంతో ఇప్పటికే ఉన్న యాపిల్​ వాచ్​ సిరీస్​ 3 కొన్న వారు అయోమయంలో పడ్డారు. అయితే, నిజంగానే యాపిల్​ వాచ్ 3ని నిలిపివేస్తే.. ఆయా యూజర్లు యాపిల్ వాచ్​ ఎస్​ఈ వెర్షన్‌కి లేదా యాపిల్​ ఈ సంవత్సరం చివర్లో ప్రకటించే ఏదైనా కొత్త మోడల్‌కి మారాల్సి ఉంటుంది.

Post a Comment

0 Comments

Close Menu