Header Ads Widget

దేశంలో టాప్-5 యూట్యూబర్స్ !


ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉండడం, తక్కువ ధరకే ఇంటర్నెట్ వస్తుండడంతో.. కోట్లాది జనం యూట్యూబ్‌ని వీక్షిస్తున్నారు. అందుకే యూట్యూబ్‌లో వీడియోలు చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఆ వీడియోలతో భారీగా డబ్బులు సంపాదిస్తున్నారు. కొందరికైతే ఏకంగా కోట్లల్లో ఆదాయం వస్తోంది. 

అజయ్ నాగర్: ఫరీదాబాద్‌కు చెందిన అజయ్ నాగర్‌కు క్యారిమినాటి అనే యూట్యూబ్ ఛానెల్ ఉంది. ఆయన ఛానెల్‌కు మూడున్నర కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. కేవలం 22 ఏళ్ల వయసున్న అజయ్ ఆస్తుల విలువ దాదాపు 30 కోట్ల రూపాయలు. ఈయన హాస్యనటుడు, రాపర్, గేమర్. అజయ్ నాగర్ కామెడీ వీడియోలను యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తుంటారు. ఇక తన రెండవ ఛానెల్ CarryisLiveలో గేమింగ్ లైవ్ స్ట్రీమింగ్ చేస్తాడు.

అమిత్ భదానా: అమిత్ భదానాకు 26 ఏళ్లు. యూట్యూబ్‌లో చాలా పాపులర్. అమిత్ యూట్యూబ్ ఛానెల్‌కు దాదాపు 24 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌ల ఉన్నారు.2021 గణాంకాల ప్రకారం.. అతని మొత్తం ఆస్తులు దాదాపు 48 కోట్ల రూపాయలు. అమిత్ లా చదివాడు. మొదట్లో స్నేహితులతో కలిసి వీడియోలు చేసి డబ్‌స్మాష్‌లో అప్‌లోడ్ చేసేవాడు. అలా తన యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించాడు.

ఆశిష్ చంచ్లానీ: 26 ఏళ్ల ఆశిష్ చంచ్లానీ నికర విలువ దాదాపు 30 కోట్ల రూపాయలు. ఆశిష్ చంచ్లానీ వైన్స్‌ పేరుతో యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్నాడు. ఇతడు సినిమా రివ్యూలు చెస్తాడు. ఆశిష్ 2009లో యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించాడు. అతని ఛానెల్‌కి ఇప్పుడు దాదాపు 26 మిలియన్ల మంది సభ్యులు ఉన్నారు.

నిషా మధులిక నిషా మధులిక స్వస్థలం యూపీ. ఆమె చెఫ్, రెస్టారెంట్ కన్సల్టెంట్ , యూట్యూబర్ . నిషా మధులిక యూట్యూబ్ ఛానెల్‌కు 1.25 కోట్ల మంది సభ్యులు ఉన్నారు. ఆమె మొత్తం ఆస్తులు 33 కోట్లు. నిషా మధులిక తన యూట్యూబ్ ఛానెల్‌ని 2009లో ప్రారంభించారు.

గౌరవ్ చౌదరి 'టెక్నికల్ గురూజీ' అనే యూట్యూబ్ ఛానెల్ చాలా పాపురల్. దీనిని 31 ఏళ్ల గౌరవ్ చౌదరి నడుపుతున్నారు. ఇందులో మొబైల్ రివ్యూలతో సహా టెక్నాలజీకి సంబంధించిన అన్ని ముఖ్యమైన సమాచారాన్ని అందజేస్తారు. అతని ఛానెల్‌కు ప్రస్తుతం 22 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. గౌరబ్ చౌదరి అనే మరో యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. దీనికి 5 మిలియన్ల మంది సభ్యులు ఉన్నారు. యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా ఇతడు నెలకు ఒకటిన్నర నుండి రెండు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. గౌరబ్ చౌదరి మొత్తం ఆస్తులు దాదాపు 326 కోట్లు. 

Post a Comment

0 Comments