53వేలకే NIJ ఎలక్ట్రిక్‌ స్కూటర్ ?


ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగిపోవడం, కర్బన ఉద్గారాల వలన ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు. ఇటువంటి తరుణంలో మార్కెట్లోకి ప్రతి ఒక్క కంపెనీ తమ ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తూ ఉంది. వివిధ కంపెనీలు విడుదల చేసే ఎలక్ట్రిక్ వాహనాలకు వివిధ రేంజ్ లో  ఉంటున్నాయి.  ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనేందుకు ప్రభుత్వం రాయితీలను కూడా అందిస్తోంది. దీంతో కూడా చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలు కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఒక్క సారి చార్జ్ చేస్తే 181 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తుంది. కానీ ఇప్పుడు ఇందుకు పోటీగా మరో కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ ఓలా బైక్ కంటే ఎక్కువగా ఉండడం విశేషం. అదే NIJ కంపెనీ. ఈ కంపెనీ స్కూటర్ ఓలా కంటే ఎక్కువ రేంజ్ లో ఉండడం కూడా ఈ కంపెనీ స్కూటర్ కు ఇంతగా మైలేజ్ రావడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. NIJ ఎలక్ట్రిక్ స్కూటర్ మనకు మూడు రకాల బ్యాటరీ వేరియంట్లతో లభ్యమవుతుంది. మనం ఎంచుకునే బ్యాటరీ రకాన్ని బట్టి ఈ స్కూటర్ రేటు మారుతూ ఉంటుంది. ఈ స్కూటర్ లో మనకు లభ్యమయ్యే ఎకో మోడల్ బ్యాటరీలో మనకు ఒక్కసారి బ్యాటరీని చార్జ్ చేస్తే దాదాపు 190 కి.మీ వరకు వస్తుంది. అదే సిటీలో తిరిగితే దాదాపు 120 కి.మీ మేర చార్జ్ వస్తుంది. దీని ధర కూడా  రూ. 53 వేల నుంచే స్టార్ట్ కావడం ప్రత్యేకత.

Post a Comment

0 Comments