Ad Code

ఐక్యూ జెడ్​ 6 ఫోన్ విడుదల !


స్మార్ట్​ఫోన్ తయారీ సంస్థ ఐక్యూ తన జెడ్​ సిరీస్ నుంచి ఐక్యూ జెడ్​ 6 5G ఫోన్​ను భారతీయ మార్కెట్​లోకి విడుదల చేసింది. జెడ్​ సిరీస్‌లో ఇది అత్యంత సరసమైన స్మార్ట్‌ఫోన్. దీనిలో స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించింది. ఈ స్మార్ట్​ఫోన్ రూ. 20 వేల ధరలోనే లభిస్తున్న​ పోకో M4 ప్రో, శామ్​సంగ్ గెలాక్సీ F23, రియల్​మీ 9 5G ఫోన్లకు గట్టి పోటీనివ్వనుంది. ఐక్యూ Z6 5G ఫోన్ 4 GB RAM వేరియంట్ రూ. 15,999 ధర వద్ద లభిస్తుంది. ఇక, 6 GB RAM వేరియంట్ రూ. 16,999 వద్ద, 8 GB RAM కలిగిన టాప్ వేరియంట్ రూ. 17,999 ధర వద్ద అందుబాటులో ఉంటాయి. మరోవైపు, పోకో M4 ప్రో 6 GB RAM, 64 GB స్టోరేజ్ వేరియంట్ రూ. 14,999 వద్ద అందుబాటులో ఉంటుంది. దీని 6 GB RAM, 128 GB స్టోరేజ్ వేరియంట్​ రూ. 16,499 వద్ద లభిస్తుంది. టాప్​ 8 GB RAM, 256 GB స్టోరేజ్ వేరియంట్ రూ. 17,999 వద్ద అందుబాటులో ఉంటుంది. కాగా, శామ్​సంగ్ గెలాక్సీ F23 రెండు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.17,499 వద్ద లభిస్తుంది. 6GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్​ రూ.18,499 వద్ద అందుబాటులో ఉంటుంది. రియల్​మీ 9 5G 4GB RAM, 64GB స్టోరేజ్ వేరియంట్​ రూ.14,999 వద్ద, 6GB RAM, 128GB స్టోరేజ్ మోడల్ రూ.17,499 వద్ద అందుబాటులో ఉంటాయి. కెమెరా విషయానికి వస్తే, ఐక్యూ Z6 ట్రిపుల్ రియర్​​ కెమెరా సెటప్​ను కలిగి ఉంటుంది. ఇందులో 50-మెగా పిక్సెల్ ప్రైమరీ, 2-మెగాపిక్సెల్ మాక్రో, 2-మెగాపిక్సెల్ బోకె కెమెరా సెన్సార్లను అందించింది. సెల్ఫీల కోసం ఫోన్ ముందు భాగంలో 16- మెగాపిక్సెల్ శామ్​సంగ్​ 3P9 కెమెరా సెన్సార్​ను చేర్చింది. మరోవైపు, పోకో M4 ప్రో 5Gలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇది 64 -మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 -మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 2 -మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. శామ్​సంగ్​ గెలాక్సీ F23 5Gలో మూడు వెనుక కెమెరాలు ఉన్నాయి. ఇందులో 50 మెగాపిక్సెల్‌ ప్రైమరీ లెన్స్​, 8 మెగాపిక్సెల్స్ అల్ట్రా-వైడ్, 2 మెగాపిక్సెల్స్ మాక్రో కెమెరాలను అందించింది. సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ కెమెరాను చేర్చింది. రియల్​మీ 9 5G 48MP ప్రైమరీ, 2MP మాక్రో, 2MP పోర్ట్రెయిట్ కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్​తో వస్తుంది. ఈ ఫోన్‌లో 16MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంటుంది. 6.58 -అంగుళాల ఫుల్​ హెచ్​డీ ప్లస్​ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. పోకో M4 ప్రో 5G 6.43 -అంగుళాల ఫుల్​ హెచ్​డీ ప్లస్​ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. శామ్​సంగ్​ గెలాక్సీ F23 5G కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్​ గల 6.6 -అంగుళాల పూర్తి హెచ్​డీ ప్లస్​ ఇన్ఫినిటీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. రియల్​మీ 9 5G 90Hz రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్‌తో 6.5 -అంగుళాల 1080p డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 8GB RAM, 128GB స్టోరేజీ వేరియంట్​ ఆక్టా-కో స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీని స్టోరేజ్​ను మైక్రో ఎస్​డీ కార్డ్ సహాయంతో 1TB వరకు విస్తరించుకునే అవకాశం ఉంది. పోకో M4 ప్రో 5G ఆక్టా-కోర్ మీడియాటెక్​ హీలియో G96 SoC ప్రాసెసర్​తో వస్తుంది. ఇది 8GB RAMని కలిగి ఉంటుంది. ఈ ర్యామ్‌ను 11GB వరకు విస్తరించడానికి అనుమతిస్తుంది. ఇక, శామ్​సంగ్​ గెలాక్సీ F23 5G ఫోన్ స్నాప్‌డ్రాగన్ 750G ప్రాసెసర్​పై పనిచేస్తుంది. 6GB ర్యామ్,6GB వరకు వర్చువల్ ర్యామ్​తో పాటు 128GB స్టోరేజ్​ను కలిగి ఉంటుంది. రియల్​మీ 9 5G 6GB RAM, 128GB స్టోరేజ్​తో మీడియాటెక్​ డైమెన్సిటీ 810 చిప్ ద్వారా పనిచేస్తుంది. 5,000mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇక, పోకో M4 ప్రో 5000mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌కు మద్దతిస్తుంది. ఈ ఫోన్‌ను 61 నిమిషాల్లో 0 నుండి 100 వరకు ఛార్జ్ చేస్తుంది. శామ్​సంగ్​ గెలాక్సీ F23 5G 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5000mAh బ్యాటరీతో వస్తుంది. రియల్​మీ 9 5G 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5000mAh బ్యాటరీతో వస్తుంది. స్మార్ట్‌ఫోన్ ఫన్​టచ్​ OS 12 లేయర్డ్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్​ అవుతుంది. పోకో M4 ప్రో 5G ఆండ్రాయిడ్​ 11 పై రన్​ అవుతుంది. శామ్​సంగ్ గెలాక్సీ F23 ఆండ్రాయిడ్​ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. రియల్​మీ 9 5G ఆండ్రాయిడ్​ 11 ఆధారిత రియల్​మీ UI 2.0 పై రన్​ అవుతుంది.

Post a Comment

0 Comments

Close Menu