Ad Code

7,948 సిమ్ కార్డ్‌లను బ్లాక్ చేసిన విఐ !


దేశంలో ఒకప్పుడు ప్రభంజనం సృష్టించిన ఐడియా ప్రస్తుతం చతికిలా పడిపోయి వోడాఫోన్ తో జత కట్టి విఐగా మారింది. ఈ నెట్వర్క్ లో చాలామంది దొంగ సర్టిఫికెట్ తో సిమ్ కార్డులు తీసుకున్నారని త్వరలో నకిలీ గుర్తింపు రుజువులపై జారీ చేసిన సిమ్ కార్డులను బ్లాక్ చేయాలని మధ్యప్రదేశ్ సైబర్ పోలీసులు వివిధ టెలికాం కంపెనీలను ఆదేశించారని తెలుస్తోంది. దీంతో దాదాపు 8,000 సిమ్ కార్డులను బ్లాక్ చేసిందని సీనియర్ అధికారి తెలిపారు. 2020లో ఫేస్‌బుక్‌లో ఒక ప్రకటన ద్వారా కారు కొనుగోలు చేస్తానని ప్రలోభపెట్టి 1.75 లక్షల రూపాయలు మోసం చేసిన వ్యక్తి ఫిర్యాదుపై చర్య తీసుకున్న సైబర్ సెల్ గ్వాలియర్ విభాగం దర్యాప్తు ప్రారంభించింది. ఫిర్యాదు దారున్ని మోసం చేయడానికి నేరస్తులు ఉపయోగించిన నంబర్‌ను కనుగొన్నారు. ఆ యొక్క నెంబర్ వేరే వ్యక్తి గుర్తింపుపై జారీ చేయబడింది. మోసగాళ్లు ఉపయోగించిన నంబర్‌ను వేరే వ్యక్తి గుర్తింపు పత్రం ఆధారంగా టెలికాం కంపెనీ జారీ చేసింది. తరువాత, నేరంలో పాల్గొన్న వారికి సిమ్ కార్డును జారీ చేయడంలో 8 మంది వ్యక్తులు పాల్గొన్నట్లు తేలిందని గ్వాలియర్ సైబర్ జోన్ పోలీసు సూపరింటెండెంట్ సుధీర్ అగర్వాల్ తెలిపారు. ఈ విషయంపై విస్తృతమైన దర్యాప్తు తర్వాత, సైబర్ పోలీసులు ఈ సిమ్ కార్డులను ఉపయోగించి ప్రజలను మోసగించడానికి మోసగాళ్ళు 20,000 వేర్వేరు నంబర్‌లను ఉపయోగించినట్లు తెలియజేశాడు. సిమ్‌కార్డు జారీ చేసిన 8 మందిపై ఏడాది కాలంగా పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకున్నారని తెలిపారు. విచారణ తర్వాత, సైబర్ యూనిట్ ఈ నంబర్ల రీ-వెరిఫికేషన్ కోసం వోడాఫోన్, ఐడియా, ఎయిర్‌టెల్, బిఎస్ఎన్ఎల్ సహా వివిధ టెలికాం కంపెనీలకు నోటీసులు జారీ చేసిందని ఆయన చెప్పారు. ఈ నోటీసుపై వేగంగా చర్య తీసుకున్న వోడాఫోన్ ఐడియా ఇటీవల రికార్డుల రీ-వెరిఫికేషన్ తర్వాత 7,948 సీమ్ కార్డ్‌లను బ్లాక్ చేసిందని అధికారి తెలిపారు. నేరస్తుల చేతిలో మోసపోకుండా అమాయక ప్రజలను కాపాడేందుకు టెలికాం కంపెనీ ఇన్ని నంబర్లను బ్లాక్ చేయడం బహుశా దేశంలోనే మొదటిసారి అని అగర్వాల్ పేర్కొన్నారు. ఇతర కంపెనీలు కూడా అలాంటి సిమ్ కార్డులను బ్లాక్ చేసినందుకు తమ రికార్డులను మళ్లీ వెరిఫై చేస్తున్నాయని ఆయన తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu