Ad Code

పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు?


ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంకు పై భారత రిజర్వ్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో కొన్ని మెటీరియల్ సూపర్ వైజరీ సమస్యల కారణంగా ఆర్బీఐ పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై తాత్కాలిక నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో విజయ్ శేఖర్ శర్మ నేతృత్వంలోని పేటీఎం పేమెంట్స్ బ్యాంకు లిమిటెడ్ సంస్థకు కొత్త కస్టమర్లను తీసుకోవద్దంటూ ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. పేటీఎం ఐటీ సిస్టమ్స్ పై సమగ్ర సిస్టమ్ ఆడిట్ పూర్తి చేసేంతవరకు ఐటీ అడిట్ సంస్థను ఏర్పాటు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. పేటీఎం బ్యాంకులో సూపర్ వైజరీ సమస్యలు ఉన్నాయని ఆర్బీఐ దృష్టికి వచ్చింది. పేటీఎం  పేమెంట్స్ బ్యాంకులో శర్మ సొంతంగా 51శాతం వాటాను కలిగి ఉన్నారు. అందుకే దీనిపై పూర్తి స్థాయిలో ఆడిట్ నిర్వహించేందుకు తాత్కాలిక నిషేధం విధిస్తున్నట్టు ఆర్బీఐ ఒక ప్రకటలో వెల్లడించింది. ఈ క్రమంలోనే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తన ఐటీ సిస్టమ్‌పై సమగ్ర సిస్టమ్ ఆడిట్ నిర్వహించేందుకు ఐటీ ఆడిట్ సంస్థను నియమించాల్సిందిగా ఆదేశించినట్లు ఆర్బీఐ ఉత్తర్వుల్లో పేర్కొంది. Paytm పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోవడం అనేది IT ఆడిటర్ల నివేదికను సమీక్షించిన తర్వాతే జరగాల్సి ఉంది. అది కూడా RBI మంజూరు చేసే నిర్దిష్ట అనుమతికి లోబడి ఉండాలని సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది.

Post a Comment

0 Comments

Close Menu