Ad Code

ఆండ్రాయిడ్ యూజర్లు హిస్టరీ డిలీట్ చేసేందుకు కొత్త ఫీచర్!


ఆండ్రాయిడ్​ యూజర్లు తమ సెర్చ్​ హిస్టరీలోని చివరి 15 నిమిషాల హిస్టరీని డిలీట్​ చేసుకునేలా కొత్త అప్​డేట్​ను తీసుకురానుంది. ఈ మేరకు గూగుల్ తన 2021 I/O కాన్ఫరెన్స్‌లో కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే, ఈ లేటెస్ట్ అప్​డేట్​ను​ ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. అతి త్వరలోనే ఆండ్రాయిడ్​ యూజర్లకు సైతం పరిచయం చేయనున్నట్లు గూగుల్ వెల్లడించింది. ఈ ఫీచర్​ను గతేడాది జులైలోనే పరిచయం చేయాలని గూగుల్​ తొలుత భావించినప్పటికీ.. సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైనట్లు సమాచారం. ప్రస్తుతం, కొద్ది మంది యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్​ అందుబాటులో ఉందని, త్వరలోనే పూర్తి స్థాయిలో యూజర్లకు పరిచయం చేస్తామని పేర్కొంది. అయితే, ఈ ఫీచర్ డెస్క్​టాప్ వెర్షన్​లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయంపై గూగుల్ స్పష్టతనివ్వలేదు. ప్రస్తుతం గూగుల్​లో గంట, ఒక రోజు, వారం, నెలా లేదా మొత్తం హిస్టరీని మాన్యువల్​గా డిలీట్ చేసుకునే ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. ఇటీవల 3 నెలలు, 18 నెలలు లేదా 36 నెలల ఓల్డ్​ హిస్టరీని ఆటోమేటిక్​గా క్లియర్​ చేసే ఆప్షన్​ను సైతం గూగుల్ చేర్చింది. ఇప్పుడు, కొత్తగా 15 నిమిషాల ఓల్ట్ హిస్టరీని కూడా డిలీట్ చేసే అప్​డేట్​ను అందుబాటులోకి తీసుకురానుంది. యూజర్లు డిఫాల్ట్ గూగుల్ సెర్చ్ యాప్​లోని పాప్ అప్ మెనూ ఓపెన్ చేయగానే అక్కడ చివరి 15 నిమిషాల సెర్చ్ హిస్టరీని తొలగించే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్​ చేస్తే చివరి 15 నిమిషాలకు సంబంధించిన హిస్టరీ క్లియర్​ అయిపోతుంది.

Post a Comment

0 Comments

Close Menu