Ad Code

నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ షేర్ చేసుకోవచ్ఛా ?


ఇప్పటివరకూ ఒక్క అకౌంట్ కు మాత్రమే యాక్సెస్ ఉండే నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ ఇకపై ఇతరులు కూడా వాడేందుకు వీలు కల్పించనుంది. ఈ అంశంపై బుధవారం కీలక ప్రకటన చేసిన నెట్‌ఫ్లిక్స్ చిలె, కాస్టా రికా, పెరూ దేశాల్లోని సభ్యులతో టెస్టింగ్ చేయిస్తుంది. స్టాండర్డ్, ప్రీమియం ప్లాన్స్ వాడే యూజర్లు మరో ఇద్దరికి కూడా అకౌంట్ షేర్ చేసుకునే వీలు కల్పించి కాస్త ఎక్కువ అమౌంట్ ఛార్జ్ చేయనున్నారు. ఈ స్ట్రీమింగ్ సర్వీస్.. మరో ఫీచర్ పైనా పరీక్షలు జరుపుతుంది. బేసిక్, స్టాండర్డ్, ప్రీమియం ఏ ప్లాన్ వాడేవారైనా తమ ప్రొఫైల్ ను ఇతరులకు ట్రాన్షపర్ చేయొచ్చు. లేదా సబ్ అకౌంట్ గానూ ట్రాన్సఫర్ చేసుకోవచ్చు. అలా చేయడం ద్వారా వ్యూయింగ్ హిస్టరీ, పర్సనలైజ్‌డ్ రికమెండేషన్స్ మొత్తం ట్రాన్సఫర్ అవుతాయట. ప్రస్తుతానికి నెట్‌ఫ్లిక్స్ కలిసి ఒకే ఇంట్లో ఉండేవారికి మాత్రమే అకౌంట్ షేర్ చేసుకునే వీలు కల్పిస్తుంది. ఈ ప్లాన్లు కాస్త కన్ప్యూజన్ ను క్రియేట్ చేస్తుండటంతో వాటిని ఎలా షేర్ చేసుకోవచ్చో.. కంపెనీ పూర్తి వివరాలను వెల్లడించింది. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు బదిలీ అయ్యే ముందే ఫీచర్లలో మార్పులను పరీక్షించాలనుకుంటున్నామని కంపెనీ వెల్లడించింది. రీసెంట్ గా యూకే, ఐర్లాండ్ కస్టమర్లకు తమ సబ్ స్క్రిప్షన్ రేటును అమాంతం పెంచేసింది నెట్‌ఫ్లిక్స్.

Post a Comment

0 Comments

Close Menu