Ad Code

టొయోటా గ్లాంజా బుకింగ్స్ ప్రారంభం !


టయోటా కంపెనీ తన కొత్త టొయోటా గ్లాంజా విడుదల చేయనుంది.  కంపెనీ ఈ కొత్త మోడల్ బుకింగ్స్ ప్రారంభించింది. దీని కోసం కష్టమర్లు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లో లేదా కంపెనీ డీలర్లను సంప్రదించి రూ. 11,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. త్వరలో భారతీయ మార్కెట్లో కి కొత్త టొయోటా గ్లాంజా రానున్నది. కొత్త టొయోటా గ్లాంజా నాలుగు వేరియంట్లలో విడుదల కానుంది. రెండు గేర్‌బాక్స్‌లతో (మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ఆప్సన్) అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. టొయోటా గ్లాంజాలో కంపెనీ ఆధునిక డిజైన్, ఫీచర్లు మరియు సేఫ్టీ ఫీచర్స్ వంటి వాటిని అందిస్తుంది. కంపెనీ దేశీయ మార్కెట్లోకి తీసుకురానున్న అత్యంత తక్కువ ధర కలిగిన మోడల్ కానుంది. ఇది  ఎక్కువమంది కొనుగోలుదారులను తప్పకుండా ఆకర్షిస్తుంది. ఇది 89 బిహెచ్‌పి పవర్ అందించే శక్తివంతమైన కె-సిరీస్ ఇంజన్‌ కలిగి ఉంటుంది. ఇది మాన్యువల్ మరియు ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌ ఆప్షన్ కలిగివుంటుంది. కంపెనీ ఈ కొత్త మోడల్ లో లేటెస్ట్ ఫీచర్స్ తో రానుంది. ఇందులో హెడ్స్-అప్ డిస్ప్లే, 360-డిగ్రీ కెమెరా, కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే వంటివి ఉంటాయి. ఇవన్నీ కూడా వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

Post a Comment

0 Comments

Close Menu