Ad Code

వాట్సప్‌లో మెసేజ్‌లు ఫార్వర్డ్ చేసే అలవాటా?


ప్రపంచ వ్యాప్తంగా వాట్సప్‌కు 2 బిలయన్ యూజర్లు ఉన్నారు. వాట్సప్‌లో ఎక్కువ సమస్య ఫార్వర్డ్ మెసేజ్‌లు దీని వల్ల తప్పుడు సమాచారం వేగంగా వ్యాప్తి చెందుతుందని చాలా మంది వాపోతుంటారు. ఇప్పుడు ఫార్వర్డ్‌ మెసేజ్‌లపై వాట్సాప్‌ ప్రత్యేక దృష్టి సారించింది. అందుకోసం కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్‌తో ఆయా వాట్సాప్‌ యూజర్లు సదరు మెసేజ్‌లను ఒకటి కంటే ఎక్కువ వాట్సాప్‌ గ్రూప్స్‌కు ఫార్వార్డింగ్ చేయడాన్ని పరిమితం చేయనుంది. దీంతో ఒక మెసేజ్‌ను సదరు యూజరు ఒకటి కంటే ఎక్కువ వాట్సాప్‌ గ్రూప్స్‌కు ఒకే సమయంలో ఫార్వర్డ్‌ చేయలేరు. ఈ చర్యతో ఫేక్ న్యూస్ లేదా తప్పుడు సమాచార వ్యాప్తిని కొంతవరకు అరికట్టవచ్చునని వాట్సాప్‌ అభిప్రాయపడుతోంది. ప్రస్తుతం WABetainfo ప్రకారం...వాట్సాప్‌ ఒకేసారి ఒక గ్రూప్ చాట్‌కు మాత్రమే సందేశాలను ఫార్వార్డ్ చేసే అవకాశాన్ని పరీక్షిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఫీచర్‌తో ఒక సందేశాన్ని ఫార్వార్డ్ చేసినట్లుగా గుర్తించనప్పుడు, దానిని ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ గ్రూప్ చాట్‌లకు ఫార్వార్డ్ చేయడం ఇకపై సాధ్యం కాకుండా చేయనుందని సమచారం. ఒక వేళ ఆ మెసేజ్‌ను ఒకటి కంటే ఎక్కువ గ్రూప్ చాట్‌లకు ఫార్వార్డ్ చేయాల్సి వస్తే, యూజర్లు ఆయా సందేశాన్ని సెలక్ట్‌ చేసుకొని, మళ్లీ ఫార్వార్డ్ చేయాల్సి ఉంటుంది. తొలుత ఫీచర్‌ వాట్సాప్‌ బీటా వెర్షన్‌ యూజర్లకు అందుబాటులోకి రానున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మెసేజ్‌ ఫార్వార్డింగ్‌ విషయంలో వాట్సాప్‌ గతంలో ఒక అప్‌డేట్‌ను విడుదల చేసింది. దీని ద్వారా యూజర్లు ఒకేసారి ఒక చాట్‌కు సందేశాలను ఫార్వార్డ్ చేయవచ్చు. వాట్సాప్‌ సదరు మెసేజ్‌ అనేక సార్లు ఫార్వార్డ్ చేశారని ' ఫార్వర్డెడ్‌ మెనీ టైమ్స్‌ అంటూ ఆయా మెసేజ్‌కు లేబిలింగ్‌ను వాట్సాప్‌ ఇస్తోంది. ఈ ఫీచర్ రావడం వల్ల చాలా ఉపయుక్తంగా ఉంటుందని కొందరు చెబుతుంటే.. మరి కొందరి నచ్చట్లేదు.  

Post a Comment

0 Comments

Close Menu