Ad Code

రొమ్ము క్యాన్సర్ కి ఈ బ్రాతో చెక్


నైజీరియన్ కంపెనీ నెక్స్ట్‌వేర్ టెక్నాలజీ బ్రెస్ట్ క్యాన్సర్ ని తగ్గించే స్మార్ట్ బ్రాను తయారు చేసింది. ఇందులో చిన్న అల్ట్రాసౌండ్ సెన్సార్లు ఉన్నాయి. ఈ సెన్సార్లు అనేవి బ్యాటరీ ఆధారంగా పనిచేస్తాయి. ఈ సెన్సార్లు బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధ పడేవారి రొమ్మును స్కాన్ చేస్తాయి. స్కానింగ్ సమయంలో కణితి ఉంటే వెంటనే కనిపెట్టేస్తాయి. ఈ పరికరం సహాయంతో బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పద్ధతిని మరింత మెరుగ్గా చేయవచ్చని దీన్ని రూపొందించిన పరిశోధన టీం స్పష్టంగా చెబుతోంది.ఇక ఈ బ్రా ఒక యాప్‌కి లింక్ చేయబడుతుంది. రొమ్ములో ఉన్న కణితి క్యాన్సర్‌ కారకమా? లేదా? అనేది పరీక్షల వలన తెలుస్తుంది. టెస్ట్‌ల తర్వాత ఇంకా ఆ ఫలితాలు వినియోగదారు మొబైల్ యాప్‌కు పంపబడతాయి. అలా క్యాన్సర్‌ను ప్రాథమిక దశలో గుర్తించి ఆ తరువాత చికిత్స అందించవచ్చునని పరిశోధకులు చెబుతున్నారు. అయితే, రొమ్ము క్యాన్సర్‌ కణితులను గుర్తించడానికి మహిళలు ఈ బ్రాను ఒక 30 నిమిషాల పాటు ధరించాలని దీని పరిశోధకులు చెబుతున్నారు. ఇక దీని ఫలితాలను మొబైల్‌లో చూసి ఆ తరువాత డాక్టర్ లను సంప్రదించడం ద్వారా క్లారిటీ పొందవచ్చునని వారు చెబుతున్నారు. ఈ బ్రాని డెవలప్ చేసిన రోబోటిక్స్ ఇంజనీర్ కెమిసోలా బొలారినోవా మాట్లాడుతూ.. ''2017లో బ్రెస్ట్ క్యాన్సర్ వలన మా అమ్మ చనిపోయింది. రొమ్ము క్యాన్సర్‌ని ఆలస్యంగా గుర్తించడమే ఆమె చనిపోవడానికి కారణం. ఆమె అడ్మిట్ అయిన హాస్పిటల్‌లోని వార్డులో అమ్మాయిల నుండి వృద్ధుల వరకు కూడా అందరూ బ్రెస్ట్ క్యాన్సర్ బాధతో బాధపడుతున్నారు. ఇక ఈ వ్యాధితో పోరాడేందుకు నా వంతు పాత్ర పోషించాలని అప్పుడే అనుకున్నాను. ప్రస్తుతం, మహిళలు రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం డాక్టర్ వద్దకు వెళ్లవలసి ఉంటుంది. కానీ ఇప్పుడు స్మార్ట్ బ్రాల సహాయంతో ఇంట్లో కూడా సురక్షితమైన ఇంకా అలాగే సౌకర్యవంతమైన పరీక్ష అందుబాటులో ఉంటుంది.'' అని చెప్పుకొచ్చారు. ఈ స్మార్ట్ బ్రా సాయంతో ప్రారంభ దశలో క్యాన్సర్‌ను గుర్తించడం ద్వారా మరణాల సంఖ్యను ఈజీగా తగ్గించవచ్చు. స్మార్ట్ బ్రా 70 శాతం దాకా కచ్చితమైన ఫలితాలను ఇస్తుందని విచారణలో వెల్లడైందని అన్నారు. ఇక ఫలితాలు 95 నుండి 97 శాతం దాకా ఖచ్చితమైనవిగా ఉండేలా తమ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వారు తెలిపారు. ఇక ఈ సంవత్సరం జూలై నాటికి ఈ బ్రా మార్కెట్‌లో అందుబాటులోకి రావచ్చునని వారు తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu