Ad Code

పోర్టబుల్ మినీ వాషింగ్ మెషీన్


మంచి వాషింగ్ మెషీన్ కొనాలంటే కనీసం ఎడెనిమిది వేలు ఖర్చవుతాయి. వాషింగ్ మెషీన్ కొనాలని ఉన్నా.. అంత డబ్బు పెట్టలేరు. కానీ టెక్నాలజీ పెరిగింది. ప్రస్తుతం వాషింగ్ మెషీన్లలోనూ ఎన్నో రకాల మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరకే దొరుకుతున్నాయి. వెయ్యిరూపాయల లోపే లభించే పోర్టబుల్ వాషింగ్ మెషీన్లు మార్కెట్లో లభిస్తున్నాయి. పోర్టబుల్ మినీ వాషింగ్ మెషీన్ల సైజు చాలా చిన్నదిగా ఉంటుంది. వైఫై రూటర్ పరిణామలంలోల లభిస్తాయి. చిన్న డబ్బాలో పెట్టుకొని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ల్యాప్‌టాప్ బ్యాగుల్లో కూడా ఈజీగా పడతాయి. పోర్టబుల్ మినీ వాషింగ్ మెషీన్‌తో బట్టలు ఉతికేందుకు.. ఒక బకెట్ పట్టేంత స్థలం ఉంటే చాలు. ఇది బకెట్ గోడలకు అతక్కునేలా అడుగు భాగంలో గ్రిప్ ఉంటుంది. లేదంటే బకెట్ గోడలకు తగిలించుకునే సదుపాయం కొన్నింటిలో లభిస్తుంది. బకెట్‌లో నీళ్లు పోసి... అడుగు భాగంలో వాషింగ్ మెషీన్ ఉంచాలి. లేదంటే బకెట్ గోడలకైనా అట్టిపెట్టవచ్చు. ఆ తర్వాత బట్టలు, డిటర్జెండ్ పౌడర్ లేదా లిక్విడ్ వేయాలి. అంతే మెషీన్ స్విచాన్ చేస్తే చాలు.. గిర్రున తిరుగుతూ బట్టను క్లీన్ చేస్తుంది. వాషింగ్ మెషీన్ అటూ ఇటూ తిరుగుతూ.. బట్టలను కూడా పులుముతుంది. అందులోని మురికి వదిలేలా పిండుతుంది. బకెట్ గోడలకు కూడా ఈ వాషింగ్ మెషీన్‌ను అతికించవచ్చు. సైడ్ భాగంలో ఉంచి కూడా... దుస్తులను ఉతకవచ్చు. పలు కంపెనీలు ఈ మినీ వాషింగ్ మెషీన్లను తయారు చేస్తున్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్లలోనూ అందుబాటులో ఉన్నాయి. కంపెనీని బట్టి రూ.800 నుంచి 1500 వరకు విక్రయిస్తున్నారు. ఐతే మృదువైన బట్టలను వీటితో ఈజీగా ఉతకవచ్చు. కానీ జీన్స్ వంటివి మాత్రం కష్టమే.

Post a Comment

0 Comments

Close Menu