Ad Code

ఇగ్నిట్రాన్ మోటోకార్ప్ నుంచి మూడు ఎలక్ట్రిక్ బైక్స్!


భారతదేశానికి చెందిన ఈవీ స్టార్టప్ ఇగ్నిట్రాన్ మోటోకార్ప్ నుంచి మూడు ఎలక్ట్రిక్ బైక్స్ విడుదలయ్యాయి. సైబాగ్ యోడ, సైబాగ్ జీటీ 120, సైబాగ్ బాబ్-ఇ మోడల్స్‌ని పరిచయం చేసింది ఇగ్నిట్రాన్ మోటోకార్ప్. వేర్వేరు ప్రైస్ రేంజ్‌లో ఈ ఎలక్ట్రిక్ బైక్స్ లాంఛ్ అయ్యాయి. సైబాగ్ యోడ ఎలక్ట్రిక్ బైక్ ధర రూ.1,84,999 కాగా, సైబాగ్ జీటీ 120 ఎలక్ట్రిక్ టూవీలర్ ధర రూ.1,64,999. ఇక తక్కువ ధరలో సైబాగ్ బాబ్-ఇ మోడల్ రూ.1,14,999 ధరతో లాంఛ్ అయింది. ఈ మూడు బైకులకు సబ్సిడీ లభిస్తుంది. కాబట్టి ధర తగ్గుతుంది. అయితే ధర ఎంత తగ్గుతుందన్నది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సబ్సిడీ పైన ఆధారపడి ఉంటుంది. బుకింగ్స్ తేదీని కంపెనీ ప్రకటించనుంది. సైబాగ్ యోడ విశేషాలు చూస్తే ఇది మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ క్రూజర్ మోటార్ బైక్. ఇందులో 3.24 kWH లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించొచ్చు. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 150కిలోమీటర్ల దూరం ప్రయాణించొచ్చు. బ్లాక్, సిల్వర్ కలర్స్‌లో లభిస్తుంది. సైబాగ్ బాబ్-ఇ ప్రత్యేకతలు చూస్తే భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ ఉన్న మొదటి ఎలక్ట్రిక్ డర్ట్ మోటార్ బైక్ ఇది. ఇందులో 2.88 kWH లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. గంటకు 85 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించొచ్చు. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 110కిలోమీటర్ల దూరం ప్రయాణించొచ్చు. బ్లాక్, రెడ్ కలర్స్‌లో లభిస్తుంది. సైబాగ్ యోడ, సైబాగ్ బాబ్-ఇ ఎలక్ట్రిక్ బైక్స్‌లో స్వాపబుల్ బ్యాటరీ సపోర్ట్ లభిస్తుంది. అంటే బ్యాటరీస్ బయటకు తీసి ఛార్జ్ చేయొచ్చు. 15 amp ఫాస్ట్ హోమ్ ఛార్జర్‌తో ఒకసారి ఫుల్ ఛార్జ్ చేయడానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. జియో లొకేట్, జియో ఫెన్సింగ్, బ్యాటరీ స్టేటస్, యూఎస్‌బీ ఛార్జింగ్, బ్లూటూత్, కీలెస్ ఇగ్నిషన్, డిజిటల్ క్లస్టర్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇకో, నార్మల్, స్పోర్ట్ మోడ్స్ ఉంటాయి. ఈ రెండు బైకులకు రివర్స్ మోడ్, క్రూజ్ కంట్రోల్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. సైబాగ్ జీటీ 120 బైక్ విషయానికి వస్తే ఇందులో 4.68 kWH లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. గంటకు 125 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించొచ్చు. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 180కిలోమీటర్ల దూరం ప్రయాణించొచ్చు. ఇందులో ఫిక్స్‌డ్ బ్యాటరీ ఉంటుంది. 15 amp ఫాస్ట్ హోమ్ ఛార్జర్‌తో ఒకసారి ఫుల్ ఛార్జ్ చేయడానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది.

Post a Comment

0 Comments

Close Menu