Ad Code

నోకియా ప్రీమియం స్మార్ట్ ఫోన్లకు స్వస్తి పలికానుందా?


నోకియా ప్రీమియం స్మార్ట్ ఫోన్లకు స్వస్తి పలికేందుకు రెడీ అవుతోందా ? ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే అది అవుననే అనిపిస్తోంది. రాబోయే రోజుల్లో నోకియా నుంచి ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయడం కష్టమేనని తెలుస్తోంది. ఇప్పటికే నోకియా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆలస్యంగా తీసుకొచ్చింది. కేవలం ఫీచర్ల ఫోన్లకు పరిమితమైన నోకియా ఇతర స్మార్ట్ ఫోన్ల కంపెనీలో పోటీ కారణంగా స్మార్ట్ ఫోన్లలోకి నోకియా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ల నుంచి భారీగా పోటీ నెలకొనడంతో ఈ స్మార్ట్ ఫోన్ల ఉత్పత్తిని కూడా ఆపేయాలని నోకియా నిర్ణయించుకుంది. ప్రీమియం స్మార్ట్ ఫోన్లపై కాకుండా బడ్జెట్ స్మార్ట్ ఫోన్లపై నోకియా దృష్టిసారించనుంది. కొన్ని రోజుల క్రితమే బార్సిలోనాలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2022 లో బడ్జెట్ శ్రేణిలో Nokia C series ఫోన్లను ప్రకటించింది. నోకియా నుంచి ప్రీమియం స్మార్ట్ ఫోన్లకు స్వస్తి పలకడం ఖాయమేనని ఈ ప్రకటన ద్వారా నిర్ధారణ అయింది. దీనికి సంబంధించి HMD Global ప్రొడక్ట్ మార్కెటింగ్ హెడ్ అయిన ఆడమ్ ఫెర్గూసన్ 800 డాలర్లకు మించి స్మార్ట్ ఫోన్లను తయారు చేయడం అనేది క్లిష్టమైన చర్యగా పేర్కొన్నారు. ఈ స్మార్ట్ ఫోన్ల సేల్స్.. ఆశించిన స్థాయిలో లేవని ఆడమ్ వెల్లడించారు. ప్రీమియం స్మార్ట్ ఫోన్లకు స్వస్తి పలికి రాబోయే స్మార్ట్ ఫోన్లలో ఎంట్రీ లెవల్, మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లపై ఎక్కువగా దృష్టిసారించనున్నట్టు ఆడమ్ స్పష్టం చేశారు. బడ్జెట్ రేంజ్ స్మార్ట్ ఫోన్లను తయారుచేయడం ద్వారా 5G సిగ్మెంట్ లో గ్లోబల్ లీడర్‌గా అధిగమించేందుకు వీలుంటుందని ఆడమ్ అభిప్రాయపడ్డారు. ఆ దిశగా హెచ్ఎండీఏ గ్లోబల్ కంపెనీ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టు ఆడమ్ వెల్లడించారు.

Post a Comment

0 Comments

Close Menu