Ad Code

క్రాఫ్ట్ సార్ట్ కార్టూన్ ఫోటో టూల్స్ యాప్ ను వెంటనే డిలీట్ చేయండి


గూగుల్ ప్లే స్టోర్‌లో ఉండే ఆండ్రాయిడ్ యాప్స్ అన్నీ సురక్షితం కావు. వేలాది యాప్స్ యూజర్ల డేటాను కాజేస్తుంటాయి. వీటిని సైబర్ నిపుణులు ఎప్పటికప్పుడు గుర్తించి అప్రమత్తం చేస్తుంటారు. గూగుల్ వాటిని ప్లేస్టోర్ నుంచి తొలగిస్తూ ఉంటుంది. ఇది నిరంతరం జరుగుతున్న ప్రక్రియ. తాజాగా సైబర్ నిపుణులు మరో డేంజరస్ యాప్‌ను గుర్తించారు. మొబైల్ సెక్యూరిటీ సొల్యూషన్స్ సంస్థ అయిన ప్రేడియో ఫేస్‌బుక్ డేటాను కాజేస్తున్న ఓ కార్టూన్ ఫిల్టర్ యాప్‌ను గుర్తించారు. క్రాఫ్ట్ సార్ట్ కార్టూన్ ఫోటో టూల్స్ పేరుతో ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉండేది. ఇందులో ట్రోజన్ ఉందని బయటపడటంతో ఈ యాప్‌ను ప్లేస్టోర్ నుంచి తొలగించింది. యూజర్లు తమ ఫోటోను అప్‌లోడ్ చేసి కార్టూన్‌గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ యాప్‌లోకి వెళ్లాలనుకుంటే హోమ్ స్క్రీన్‌లో ఫేస్‌బుక్ లాగిన్ వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ కార్టూనిఫయర్ యాప్‌లో ఫేస్‌స్టీలర్ అనే ట్రోజన్ ఉందని ప్రేడియో రీసెర్చెర్స్ గుర్తించారు. దీంతో గూగుల్ ఈ యాప్‌ను ప్లేస్టోర్ నుంచి తొలగించింది. ప్లేస్టోర్ నుంచి తొలగించినా ఇప్పటికే ఈ యాప్‌ను 1,00,000 మంది యూజర్లు డౌన్‌లోడ్ చేశారు. ఇప్పటికే ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసినవారు యాప్ ఉపయోగించుకునే అవకాశం ఉంది. అయితే ఈ యాప్ ఉపయోగించడం వల్ల స్మార్ట్‌ఫోన్ యూజర్లకు ముప్పు తప్పదు. ఎందుకంటే ఈ యాప్ యూజర్ల ఫేస్‌బుక్ క్రెడెన్షియల్స్ అంటే ఫేస్‌బుక్ ఐడీ, పాస్‌వర్డ్ లాంటి వివరాలన్నింటినీ కాజేస్తోంది. గూగుల్ ప్లేస్టోర్ పాలసీలను బైపాస్ చేస్తూ ఈ యాప్స్‌లోకి మాల్‌వేర్‌ను ఎంటర్ చేస్తున్నట్టు తేలింది. ఈ యాప్ కాజేసే ఫేస్‌బుక్ క్రెడెన్షియల్ వివరాలు హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. అదే జరిగితే యూజర్ల ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ అయినట్టే. ఈ హానికర యాప్‌ను తొలగించామని ఇప్పటికే గూగుల్ ప్రకటించింది. మీరు ఈ యాప్ గతంలో డౌన్‌లోడ్ చేసి ఉపయోగిస్తున్నట్టైతే వెంటనే డిలిట్ చేయడం అసరం. గూగుల్ ప్లేస్టోర్‌లో ఇలాంటి హానికరమైన యాప్స్ చాలా ఉంటాయి. నచ్చిన ప్రతీ యాప్‌ను డౌన్‌లోడ్ చేయకుండా డెవలపర్ పేరు చూడాలి. ప్రముఖ డెవలపర్స్ తయారు చేసే యాప్స్ వాడాలి. యాప్ రివ్యూస్ కూడా చెక్ చేయాలి. థర్డ్ పార్టీ యాప్ స్టోర్స్ నుంచి అప్లికేషన్స్ అస్సలు డౌన్‌లోడ్ చేయకూడదు. థర్డ్ పార్టీ యాప్ స్టోర్స్‌లో ఉండే యాప్స్‌లో చాలావరకు ప్రమాదకరమైనవే ఉంటాయి. మీ స్మార్ట్‌ఫోన్‌లో మంచి యాంటీవైరస్ యాప్ ఉపయోగిస్తే ఇలాంటి ప్రమాదకరమైన యాప్స్‌ని కొంతవరకు గుర్తించొచ్చు.

Post a Comment

0 Comments

Close Menu